Wednesday, October 1, 2025

 భారత దేశ చరిత్ర (పోటీ పరీక్షల కోసం ) 

  • మొహంజొదారో ను  కనిపెట్టినది : మార్షల్ 
  • మొహంజొదారో అంటే అర్థం : మృతుల దిబ్బ 
  • హరప్పా పై పరిశోధన చేసినది: కనింగ్ హాం 
  • నాలుగు వేదాలలో ప్రాచీనమైనది : ఋగ్వేదం 
  • వేదాలలో మిత్ర శబ్దం ఏ దేవుడిని సూచిస్తుంది? సూర్యుడు 
  • సుదాస్ పురోహితుడి పేరు: విశ్వామిత్రుడు 
  • అలహాబాద్ త్రివేణి సంగమం లో అంతర్వాహినిగా ప్రవహించే నది: సరస్వతి 
  • సుదాస్ తండ్రి పేరు: దివోదాస్ 
  • ఋగ్వేదం లో వాడబడిన ఓకల శబ్దానికి అర్థం : రోకలి 
  • ఋగ్వేదం లో వాడబడిన అయస్ శబ్దం ఏ లోహాన్ని సూచిస్తుంది? రాగి 
  • హరిశ్చంద్రుడి కొడుకు పేరు : లోహితుడు 
  • హరిశ్చంద్రుడి కొడుకు లోహితుడికి బదులుగా నరబలికి ఎవరిని సిద్దం చేసారు? శునశ్శేపుడు 
  • శునశ్శేపుడిని కాపాడినది ఎవరు? విశ్వామిత్రుడు 
  • సాగరానికి ఆ పేరు ఎలా వచ్చింది? సగర పుత్రులచే తవ్వబడడం వలన 
  • బ్రహ్మ వాదాన్ని మొదటిసారిగా ప్రతిపాదించినది : ప్రవహణ జైవాలి 
  • జాతక కథలలో కనిపించే కాశీ రాజు : బ్రహ్మ దత్తుడు 
  • బింబిసారుడి పుత్రుడు: అజాత శత్రువు 
  • నాసదీయ సూక్తం దేని లోనిది? ఋగ్వేదం 
  • బుద్దుడి అసలు పేరు: గౌతముడు 
  • గౌతముడి తల్లి పేరు: మహా మాయ 
  • బుద్దుడి వంశం: శాక్య వంశం 
  • బుద్దుడి గుర్రం పేరు: కంటకం 
  • బుద్దుడి రథ సారథి: చన్నుడు 
  • బుద్దుడు జన్మించిన ప్రదేశం: లుంబినీ 
  • బుద్దుడు ప్రతిపాదించిన సూత్రం : ప్రతీత్య సముత్పాదం 
  • ప్రతీత్య సముత్పాదం అంటే కార్యకరణ వాదం 
  • గౌతముని భార్య: యశోధర 
  • బుద్దుడు చూసిన ముని పేరు: అజీవక ముని 
  • బుద్దుడు మొదటి సారి ఐదు మంది శిష్యులకు ధర్మం బోధించాడు 
  • బుద్దుడు మొదటిసారి ధర్మ బోధ చేసిన ప్రాంతం: సారనాథ్ 
  • బింబిసారుడు బుద్దుడికి దానం చేసిన ప్రాంతం: వేణు వనం 
  • బుద్దుడి కాలంలో జీవించిన లిచ్చావి రాజ నర్తకి పేరు : అంబ ఫలి 
  • అంబ ఫలికి మరో పేరు : ఆమ్రపాలి 
  • బుద్దుడు బోధించిన మార్గం: అష్టాంగ మార్గం 
  • కాలాశోకుడిని హత్య చేసిన సేనాని : మహా పద్మ నందుడు 
  • చంద్రగుప్త మౌర్యుడు ఎవరి సహాయంచే నవ నందులను జయించాడు? చాణుక్యుడు 
  • రాక్షస మంత్రి అసలు పేరు: ఉగ్రసేనుడు 
  • అలెక్సాండర్ ఏ కనుమ ద్వారా భారత దేశం లోకి అడుగుపెట్టాడు? కైబర్ 
  • అలెక్జాండర్ దండెత్తినప్పుడు తక్షశిల రాజు ఎవరు? అంభి 
  • ఏ నది తీరంలో అలెక్జాండర్ సేనలకు, పురుషోత్తముడి కి యుద్దం జరిగింది? జీలం 
  • చంద్రగుప్త మౌర్యుడు అవలంబించిన మతం : జైనం 
  • అశోకుడి తండ్రి పేరు: బిందుసారుడు 
  • కథా సరిత్సాగరం ఏ రాజుల కాలంలో రచించబడినది? శాతవాహన 
  • ఆంటియోకస్ ఎవరి కుమారుడు? సెల్యూకస్ 
  • అశోకుడు ఎవరి బోధల వలన బౌద్ధం స్వీకరించాడు? ఉపగుప్తుడు 
  • వృద్దాప్యం లో అశోకుడు వివాహం చేసుకున్న వనిత పేరు: తిష్య రక్షిత 
  • కునాలుడు మరియు జలోకుడు అనువారు అశోకుడి పుత్రులు 
  • జలోకుడు అవలంబించిన మతం : కాశ్మీర శైవం 
  • అశోకుడి మనవడు: సంప్రతి 
  • పుష్యమిత్ర శృంగుడు ఏ మతావలంబి? బ్రాహ్మణ మతం 
  • పుష్య మిత్రుడు ఎవరి వద్ద సేనాని గా పనిచేశాడు? బృహద్రధుడు 
  • ప్రతీత్య సముత్పదాన్ని వ్యాప్తిలోకి తెచ్చిన బౌద్ద భిక్షువు : నాగసేనుడు 
  • బౌద్ద ధర్మానికి రెండవ అశోకుడి గా ఖ్యాతి చెందిన రాజు: కనిష్కుడు 
  • కనిష్కుడి ఆస్థానం లో ఉన్న ఆయుర్వేద పండితుడు ఎవరు? చరకుడు 
  • తమిళ గ్రంథం అకట్టియం ను రచించినది : అగస్త్యుడు 
  • కాళిదాసు రచించిన రఘువంశం లో ప్రారంభ శ్లోకం : వాగర్థా వివ సంపృక్తౌ 
ఇవి విద్యార్థులకు చరిత్ర మీద మక్కువ కలుగజేయడానికి సేకరించిన విషయాలు. వీటి పట్ల అనురక్తిని పెంచుకుని, ప్రతి విషయం పట్ల ఇంకా వీలైనంత సమాచారాన్ని సేకరించవలసిన బాధ్యత విద్యార్థులదే. 
సింధూ నాగరికత, వేద కాలం, బౌద్ధం, జైనం గురించిన సమాచారాన్ని సేకరించండి. చారిత్రక ప్రదేశాలను సందర్శించండి. ఏ ఒక్క వాదం వైపు ఆకర్షితులు కాకండి. 
బౌద్దము లో వచ్చిన చీలకల గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి. 

  భారత దేశ చరిత్ర (పోటీ పరీక్షల కోసం )  మొహంజొదారో ను  కనిపెట్టినది : మార్షల్  మొహంజొదారో అంటే అర్థం : మృతుల దిబ్బ  హరప్పా పై పరిశోధన చేసినద...