Wednesday, September 16, 2026

              As a Resource Person for Newly Admitted Medicos at Govt Medical College 



                         A Rare Privilege: Reflections on a Session with Newly Admitted Medicos

I was honoured to be invited as a resource person by Dr. Padma Sravani Sagi, Department of Pharmacology, Government Medical College, Anantapur, to deliver a talk on "Moral Values and Communication Skills" for newly admitted medical students. The session, originally scheduled for 24th September 2026, was advanced to 16th September 2026 and held from 11:00 AM to 12:00 Noon.

Over the course of the hour, I engaged with the young medicos on a range of interconnected themes — morals and ethics, the psychology of dual standards, split and multiple personalities, and the often-overlooked subject of money management. Weaving these topics together allowed the discussion to move beyond textbook definitions of ethics into the real, everyday dilemmas that shape character and professional conduct — dilemmas these future doctors will inevitably encounter in their careers.

Interacting with a room full of bright, curious minds at the very threshold of their medical journey was, without exaggeration, one of the rarest privileges I have experienced. There is something deeply gratifying about speaking to students at this formative stage — before the pressures of clinical life set in — when values, self-awareness, and financial discipline can still be nurtured as foundational habits rather than afterthoughts.

I am grateful to Dr. Padma Sravani Sagi and the Department of Pharmacology for this opportunity, and I hope the session leaves the students with a few lasting reflections as they begin their careers in medicine.

 



Saturday, September 12, 2026

 Eco Friendly Ganesh Idol DIstribution at Govt College (A) Anantapur 








ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా గణేశ చతుర్థి కోసం పర్యావరణ హిత గణేశ విగ్రహాలను మా కళాశాలలో పంపిణీ చేసారు. ఈసారి అదనపు ఆకర్షణగా జనపనారతో చేసిన సంచులు కూడా పంచారు.  ఈ సందర్భంగా నేను కొన్ని ముచ్చట్లు పెట్టుకున్నాను. 

  • ఏ పండగ అయినా దండుగ చేసుకోకండి 
  • రూపాన్ని కాదు తత్వాన్ని పట్టుకోండి. 
  • పండగ వెనుక ఉన్న పరమార్థాన్ని మరవకండి. 
  • పండగ పేరుతో పర్యావరణాన్ని కలుషితం చేయకండి. 
  • మట్టి విగ్రహం చెప్పే తత్వం ఏమంటే మనం మట్టి నుంచి వచ్చాము. మట్టిలోకి వెళతాము. మట్టి కున్న మహిమ దేనికి లేదు. ఎంత గట్టి మనిషి అయినా చివరకి మట్టి కరవాల్సిందే. 
  • 'ఆట కదరా మన్ను, ఆట కదరా మిన్ను, మిథ్యలో ముంచి తేల్చేవు నన్ను!!!" అన్న తనికెళ్ల  మాటలు స్మృతిలో పెట్టుకోండి. 
  • మట్టిలో కొన్ని తరాల జ్ఞాపకాలు నిక్షిప్తమై ఉన్నాయి. 
  • వీధి.. వీధికి ఒక గణేశ మండపం వద్దు. ట్రాఫిక్ కు ఇబ్బంది అవుతుంది. వినాయకుడి పేరుతో జనాలకు విఘ్నాలు కలిగించకండి. 
  • చందాల పేరుతో దందాలు వద్దు. 
  • పండగ చేసుకునే ఉత్సాహంలో సామాజిక బాధ్యతను మరువకూడదు. ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా బతికితే ప్రతి రోజు పండుగే. 
  • మట్టికి, కర్మకు జ్ఞాపకశక్తి ఎక్కువ. ఎప్పుడు ఇవ్వాలో, ఎప్పుడు లాగేసుకోవాలో పంచ భూతాలకు తెలిసినట్టుగా వేటికీ తెలియదు. 
  • వినాయకుడిలోని నాయకత్వ లక్షణాలను అలవరుచుకునే ప్రయత్నం చేయండి. 
  • సూక్ష్మంలో స్థూలం, స్థూలంలో సూక్ష్మం ఎలా కలిసి ఉంటాయో గణేశుడిని చూస్తే అర్థం అవుతుంది. 
  • క్రింద ఎలుక, పైన ఏనుగు .. ఏది ఎక్కువ కాదు.. ఏది తక్కువా కాదు. సమాజానికి పెద్ద తలకాయలు ఎంత ముఖ్యమో, చిన్న తలకాయలు అంతే ముఖ్యం. Leader ఎంత ముఖ్యమో, Cadre కూడా అంతే ముఖ్యం. ఏనుగంత వినాయకుడు ఎలుకను వాహనంగా పెట్టుకోవడం వెనుక ఎంతో resource management దాగుంది. ఉన్నదాంతో పండగ చేసుకోవడమే ఒక resource management టెక్నిక్. 
మీకందరికీ ఆ లంబోదరుడి ఆశీస్సులు మెండుగా ఉండుగాక !!!!!!

Sunday, September 6, 2026

                                 Teachers' Day 2026 Celebrations at Our College & Joyalukkas










ప్రతి సంవత్సరం ఆచార్య స్మరణ చేసుకునే teachers' day ఈ ఏడాది కూడా వచ్చేసింది. ఈ అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో నేను చదువుకున్నది మూడేళ్లు ( 1988- 91 ). అప్పుడు కలలో కూడా అనుకోలేదు ఈ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేసే అవకాశం వస్తుందని. మొదటి సారి హిందూపూర్ బాలాజీ విద్యా విహార్ లో అధ్యాపకుడిగా పని చేసే సమయంలో గురు పూజోత్సవంలో గురువుకు విద్యార్థులు ఇచ్చే ప్రాధాన్యత నాకు అనుభవానికి వచ్చింది. విద్యార్థినీ విద్యార్థులు సంప్రదాయబద్దంగా నారికేళ ఫలం ఇచ్చి కాళ్ల మీద 'గురుభ్యోనమః' అని వరుస కట్టి పడుతూఉంటే ఎంతో సంబర పడ్డాను. ఆ సంబరం ఎంతో బాధ్యతను మోసుకొచ్చింది అని కూడా గుర్తించాను. "అసలు దేనినైనా గురువు మార్చగలడా ? కనీసం శిష్యుడినైనా మార్చగలడా? " అని మనసులో తర్జన భర్జన పడినా, శిష్య సమూహంలో నాకున్న గౌరవం నన్ను వారి పట్ల సదా విధేయుడిగానే ఉంచింది. గురువు శిష్యుడన్న గుడ్డెద్దు చేనురా అన్న చందంగా ఉంటే శిష్యుడు తరిస్తాడు. ఈ గురు శిష్య తత్వ విచికిత్స తీరికగా మరో పోస్ట్ లో చూసుకుందాము గానీ ఇంతకు ఈరోజు ఎలా జరిగిందో చెపుతాను. 
మా ఆర్ట్స్ కళాశాల కామర్స్ సెమినార్ హాలులో మా గురువులు మరియు మాన్యులు పూర్వ రిజిస్ట్రార్ ఆచార్య సుధాకర్ బాబు గారికి మరియు D N సత్యనారాయణ గారికి సన్మానం చేసాము. ఆచార్య సుధాకర్ బాబు గారు చక్కని సందేశం ఇచ్చారు. గురవుకు గంభీరమైన గాత్రం ఉండడం అదనపు హంగు. 
కొసమెరుపు ఏమిటంటే మలబార్ గోల్డ్ వారు కార్యక్రమం చివరలో లాటరీ తీసి ముగ్గురు అధ్యాపకులకు బహుమతులు అందించి సత్కరించారు. 
మరో విశేషం ఏమంటే నన్ను Joyalukkas వారు సాయంత్రం గురు పూజోత్సవానికి ఆహ్వానించడం. నాతో పాటుగా అహ్మద్ , బసిరెడ్డి శ్రీదేవి మరియు P S లక్ష్మీ మేడమ్ కు ఆహ్వానం అందింది. అందరం సాయంత్రం 5.30 కు Joyalukkas కు చేరుకున్నాము. అక్కడ చాలా మంది ఉపాధ్యాయులు అప్పటికే వచ్చి కూచున్నారు. పరిసరాలు గురువుల విజ్ఞానం తోను, అపరంజి కాంతి తోను ధగ ధగలాడుతున్నాయి. అక్కడ సరస్వతీ మరియు లక్ష్మీ ఇరువురు కలసిపోయిన వైభవం కనిపిస్తూ ఉంది. చదువు, ఐశ్వర్యం రెండూ కూడా ఒక వ్యక్తికి అబ్బితే అదో యోగం. ఒకే వ్యక్తికి సరస్వతీ మరియు లక్ష్మీ కటాక్షాలు కలగడం అరుదు. నిజానికి నేను బంగారును ఎప్పుడూ పట్టి కూడా చూడలేదు. నాకూ, సంపదకు మధ్య ఉన్న దూరం ఎప్పటికీ ఒక స్థిరాంకమే. డబ్బు విషయంలో మాత్రం నా ఆశ వ్యామోహం స్థాయికి చేరకుండా జాగ్రత్త పడ్డాను. విద్యకు, సంపదకు తేడా ఏమంటే విద్య ఎంత ఉన్నా బరువు కాదు కానీ సంపద మోతాదు మించితే బరువై కూచుంటుంది. కాపాడాల్సిన ధనం మోతాదు మించితే కబళిస్తుంది. డబ్బు మరియు జ్ఞానం విషయంలో ఏ ఒక్కడూ తోపు కాలేడు. ఒకడిని మించి ఒకడు తగులుతూనే ఉంటారు. అక్కరకు రాని విద్యా, సంపద రెండూ వృధానే!!!! Joyalukkas లో పని చేసేవారిలో వినయం, సహనం రెండూ ఉండడం వారి బంగారానికి తావి అబ్బినట్టుగా అయ్యింది. మాకు ఒక memory contest పెట్టారు. గెలిచిన వారికి బహుమతులు ఇచ్చారు. నేను దారుణంగా ఓడిపోయాను. నా సహచరులు కూడా ఓడి పోవడం నాకు తులం బంగారం అప్పటికప్పుడు నా సొంతమైనంత ఆనందాన్ని ఇచ్చింది. ఇలాంటి memory contest లు మా విద్యార్థులకు మేము కూడా పెట్టాలి. సంపద గురించి, బంగారం, వెండి, ప్లాటినం గురించి కొన్ని విషయాలు నా ఉపన్యాసంలో పంచుకున్నాను. నీవేమన్నా కోటీశ్వరుడా ఇవన్నీ చెప్పడానికి అని మెలిక ప్రశ్న వేయకండి. డబ్బు గురించి మాట్లాడే వాడి వద్ద డబ్బు ఉండక పోవచ్చు. గుడ్డు పెట్టే కోడి వద్ద ఆమ్లెట్ ఉంటుందా ఏంటి.. మీ చిలిపితనం కాకపోతే. ఆమ్లెట్ వేసుకునే వాడు గుడ్డు పెడతాడా ఏంటి ? కొన్ని విని తలలూపాలి.. కవ్వించే ప్రశ్నలు వేయకూడదు. మా గురువులతో Joyalukkas వారు కేక్ కూడ కట్ చేయించారు. 
చుట్టూతా బంగారం కనిపిస్తున్న ఆ నేపథ్యంలో మాకు Joyalukkas వారు చేసిన సన్మానం నేను ఈ జన్మలో మరచిపోలేను. ఇలా ఈ teachers' day మాకు ఒక మధురానుభూతిని మిగిల్చింది. 

Wednesday, September 2, 2026

As a Resource Person in a Seminar on Intra & Inter Personal Skills at SKR & SKR GC (A) (W) Kadapa 






28 ఆగస్ట్ 2026 నుంచి 1 సెప్టెంబర్ 2026 వరకు నాలుగు రోజుల పాటు కడప యోగి వేమన విశ్వవిద్యాలయం లో Pre PhD పరీక్షలు రాసాను. చిన్నప్పుడు కూడా పరీక్షలకు ఇంతలా సన్నద్ధం కాలేదు. అన్ని పరీక్షలు సంతృప్తికరంగానే రాసాను. సెప్టెంబర్ 1 వ తేదీన Discipline Specific Elective paper బాగా రాసాను అనే ఆనందంలో ఉండగానే SKR & SKR మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాల IQAC Coordinator కృష్ణవేణి మేడంకు నేను Intra & Inter Personal Skills మీద మాట్లాడతానని చేసిన వాగ్దానం గుర్తుకువచ్చి 'నేను వస్తున్నాను, సదస్సుకు ఏర్పాట్లు చేసుకోండి " అని చెప్పి కారు ఎక్కి కూచుని కడపకు బయలుదేరాను. మధ్యాహ్నం 2.30 కు మొదలైన సదస్సు సాయంత్రం 5 కు ముగిసింది. దానికి సంబంధించినవే పై ఫోటోలు. 
ఇంతకు నేను సదస్సులో ఏమి మాట్లాడనో అని కదా మీ సందేహం. ఆ విషయాలు క్రింద ఇస్తున్నాను. 
  • Intra Personal Skills : మనతో మనం ఎలా ఉన్నాము? 
  • Inter Personal Skills :  మన చుట్టూ ఉన్నవారితో ఎలా ఉన్నాము? 
  • నీవీ, నావి కలిస్తే మనవి 
  • సహోద్యోగులతో సానుకూల దృక్పథంతో ఎలా ఉండాలి?
  • Personal & Professional works లో ఎలా compartmentalization ఉండాలి? వృత్తి -ప్రవృత్తిని ఎలా సమన్వయం చేసుకోవాలి? 
  • ఆనందం కోసం కాకుండా ఆనందంతో ఎలా పని చేయాలి? ( Work with happiness rather than working for happiness ) 
  • ఇష్టపడి చేస్తే సేవ.. కష్టపడి చేస్తే చాకిరి. 
  • కర్తవ్య నిర్వహణలో కర్తృత్వ భావన వదిలేస్తే ఒత్తిడి ఉండదు 
  • ఆనందంగా ఉండడం సాధన చేయాలి. Fake it, fake it, fake it until you make it. 
  • ఆనందంగా ఉన్నవారి వద్దకే అన్ని ఆనందాలు వస్తాయి. దు:ఖానికి కేంద్రబిందువుగా మారకండి. బాధ పడడం వలన దు:ఖం పోదు. 
  • విద్యార్థి వ్యక్తిత్వాన్ని గౌరవించండి. 
  • మన మానసిక స్థాయిని బట్టే మనం ఎదుటివారిని అర్థం చేసుకుంటాము. దృష్టి మారిందా, సృష్టి మారినట్టే. అంతా మనం చూసే దాన్ని బట్టే ఉంటుంది. దీనిని వేదాలలో చక్షుమతీ విద్య అన్నారు. మీలో లేనిది ఏదీ బయట కనపడదు. 
  • ప్రపంచం మారదు .. మనం మారి కూర్చోవాలి. ప్రపంచాన్ని మార్చడం కన్నా మనం మారడం సులభం. ఎదుటి వారిని మార్చడం మన చేతిలో లేదు. మనం మారడం మాత్రం మన చేతిలోనే ఉంది. 
  • మన వద్ద పోగొట్టుకోవడానికి ఏమి ఉందని బాధ??? 
  • దేనిని ఎక్కువ పోగేసుకోకండి. వంట చేసేటప్పుడు 'పొంగేదంతా పొయ్యి పాలే ' అనే విషయం గుర్తించేఉంటారు. 
  • Success ను glorify చేయకండి 
  • వేటూరి పాటల్లో ఎన్నో వ్యక్తిత్వ వికాస సూత్రాలు ఉన్నాయి. పాటలు వింటే మనసు ఆహ్లాదంగా ఉంటుంది. 
  • లోకం మీద కోపం మన ఇంటికి, ఒంటికి కూడా మంచిది కాదు. 
  • చిన్న చిన్న విషయాలలో ఆనందం పొందేవారి వద్దకే పెద్ద పెద్ద ఆనందాలు వస్తాయి. 
  • Belive in the Exit. Be ready to lose anything and everything gracefully. 
అందరూ ఎంతో ఓపికగా వినడం నాకు ఒక సంతృప్తినిచ్చింది. కార్యక్రమం ఏర్పాటు చేసిన కృష్ణ వేణి మేడంకు, నిర్వహణకు అనుమతినిచ్చిన ప్రిన్సిపల్ స్మిత మేడంకు నా ధన్యవాదాలు. 



Tuesday, August 25, 2026

                                                         


HACKATHAN WINNERS 










Tuesday, August 18, 2026

          STUDENT CENTRIC ACTIVITIES ADAPTED BY THE DEPARTMENT OF ZOOLOGY 


           Involving the students in environmentally friendly programmes like Seed ball distribution. 



Motivating the students to participate in the competitions like Hackathon. Training in Presentation skills is given as a group 


                                                             Think, Pair & Share activity 

                      Review of a book studied by the faculty member in detail in the class room 

                Dr B Sreedevi reaching out to the students and public through All India Radio 

 Review of the Programme: Distribution of Seed Balls to the Students of Microbiology Date: 18th August 2026





Amid the hectic schedule of conducting the Law examinations, I made it a point to steal some time and join this brief but meaningful programme on the distribution of seed balls to the students of Microbiology.

The seed balls were provided by Mr Elugu Suresh Kumar, and the event was coordinated by Dr H. Pallavi and Smt B. Nagajyothirmai, whose efforts ensured the programme was well organised despite its short duration.

Seed balls, also known as seed bombs, are prepared by encasing a mix of native seeds within a protective covering of clay, compost, and soil. The seeds are first blended with nutrient-rich compost, then coated in layers of clay, and finally shaped into small, dry balls. This clay casing shields the seeds from birds, ants, and harsh weather until the onset of rains, at which point it softens and disintegrates, allowing the seeds to germinate naturally in the soil. This simple, low-cost technique enables afforestation even in areas that are otherwise difficult to sow by conventional methods — degraded lands, roadsides, barren patches, and inaccessible terrain — making it a valuable tool for ecological restoration and green cover expansion.

During the programme, I spoke to the students about the significant role seed balls play in the natural dispersal of plant species, and how this method revives traditional, sustainable approaches to regreening the environment. I also recalled the notable contribution of Sir Thomas Munro, who is remembered for planting innumerable tamarind trees across the Ceded Districts — an enduring legacy of environmental stewardship that resonates with the spirit of this initiative.

The programme was deliberately kept brief, lasting only a few minutes, so as not to encroach upon the students' valuable academic time, while still leaving them with a meaningful message on environmental conservation.

 

 

              As a Resource Person for Newly Admitted Medicos at Govt Medical College                           A Rare Privilege: Reflection...