Saturday, July 29, 2023


 This is the skeleton preserved in the Zoology Museum of Govt Arts College (A) Anantapur. Following verse is dedicated to this. 

నాకు తెలుసు 

వీడు కూడా 

నా లాగే 

నిక్కీ, నీల్గీ , విర్రవీగే ఉంటాడు 

బతికున్న రోజుల్లో 

గురువు గానో 

బరువు గానో 

బతుకు వెళ్ళదీసే ఉంటాడు 

బతికున్న రోజుల్లో 

ఏం భోదించాడో 

తెలియదు కానీ 

చచ్చి మాత్రం 

చాలా సుద్దులు చెప్పేస్తున్నాడు 

పోగేసుకోవడానికి 

అస్థులు తప్పా 

ఆస్తులేమీ లేవని 

పళ్లికిలించి మరీ చెపుతున్నాడు 

చావెలా వస్తుంది చెప్పబ్బాయి ? అని అడిగితే 

ఎవడి చావు వాడే తెచ్చుకుంటాడని 

తేల్చి చెప్పేశాడు 

ఇంత బతుకు బతుకుతూ 

మేము 

చేయలేని జ్ఞాన బోధ 

చచ్చి చేస్తున్నాడు 

ఎందుకురా 

మ్యూజియం అల్మేరా లో 

తొంగున్నావని 

అడిగితే 

నీ 

గతి కూడా 

రేపో మాపో 

ఇంతేనన్నాడు దొంగ చచ్చినోడు 

No comments:

Post a Comment

  My Books at Hyderabad Book fair