రెండు నెలల పైచిలుకు అయ్యింది నేను కల్యాణదుర్గం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి బదిలీ అయ్యి. ఈ రోజు అంటే సెప్టెంబర్ 12వ తేదీ 2023 న నేను ఆ కళాశాల కు ప్రాక్టికల్ ఎక్సామినర్ గా వెళ్ళడం జరిగింది. అప్పుడే తలవని తలంపుగా అక్కడికి నేత్ర దానం మరియు అవయవ దానం గురించి అవగాహన కల్పించడానికి పాలకొల్లు నుంచి Amma Eye, Organ and body donation promoters Association వ్యవస్థాపకులు శ్రీ గంజి ఈశ్వర లింగం మరియు వారి మిత్రులు పెన్మత్స సుబ్బరాజు రావడం జరిగింది. సెమినార్ హాల్ లో నిర్వహించిన అ సదస్సుకు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జయరామ రెడ్డి అధ్యక్షత వహించారు.
సర్వస్య గాత్రస్య శిర: ప్రధానం
సర్వేం ద్రి యాణామ్ నయనం ప్రధానం అన్నారు కదా!
కాబట్టి అందరూ మరణానంతరం కళ్ళు, అవయవాలు మరియు శరీరం దానం చేయడానికి సిద్దంగా ఉండాలి. మనం మరణించినా కూడా మన శరీరం లోని అవయవాలు పది మందికి ఉపయోగపడాలి.
శ్రీ గంజి ఈశ్వర లింగం మరియు వారి మిత్రులు పెన్మత్స సుబ్బరాజు నేత్ర దానం మరియు అవయవ దానం గురించి ఈ క్రింది అంశాలు చెప్పారు.
- బతికి ఉండంగా రక్తం, కాలేయం లోని కొంత భాగం, మూత్ర పిండం దానం చేయవచ్చు. మరి మరణానంతరం మన శరీరం, కళ్ళు, మరియు గుండె లాంటి అవయవాలను దానం చేయవచ్చు.
- నేత్ర దానం మరణించిన తరువాత 6 గంటల లోపు చేయాలి. కార్నియల్ అంధులకు నేత్ర దానం ద్వారా చూపు ప్రసాదించవచ్చు.
- ఒక ఏడాది బిడ్డ నుంచి ఎంత వయసు వారైనా నేత్ర దానం చేయవచ్చు.
- చూపు మందగించిన వారు, కంటి అద్దములు వాడేవారు కూడా నేత్ర దానం చేయవచ్చు.
- నేత్ర దానానికి ఈ క్రింది వారు అర్హులు కారు
రక్త కాన్సర్ వలన మరణించిన వారు
విషం తీసుకోవడం వలన చనిపోయిన వారు
సుఖ వ్యాధులతో చనిపోయినవారు
ఇక అవయవ దానం brain dead అయిన వారు చేయవచ్చు. దీనికి మృతుల వారసుల అంగీకారం ఉండాలి. ఈ క్రింది అవయవాలు దానం చేయవచ్చు.
గుండె
ఊపిరి తిత్తులు
గుండె లోని కవాటాలు
మూత్ర పిండాలు
క్లోమం
చర్మ దానం
కేశ దానం
చనిపోయిన తరువాత మృత శరీరాన్ని పూర్తిగా మెడికల్ కాలేజీ కి ప్రాక్టికల్స్ కోసం దానం చేయవచ్చు.
నాకు ఇవన్నీ విన్న తరువాత గజల్ శ్రీనివాస్ గారి ఒక గేయం గుర్తుకు వచ్చింది. "మనిషి చనిపోతే వాడి చర్మం మట్టిలో కలుస్తుంది, మృగం చనిపోతే దాని చర్మం మృదంగమై నిలుస్తుంది. కాబట్టి మనిషి కంటే మృగం గొప్పది" అని. మనం మృగం కంటే గొప్ప అనిపించుకోవాలి అంటే అవయవ దానం మరియు నేత్ర దానం పట్ల అవగాహన ఏర్పరుచుకోవాలి. చచ్చి బతకడం అనేది అవయవ దానం ద్వారా మాత్రమే సాధ్యం.
మరి ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన ప్రిన్సిపల్ జయరామ రెడ్డి గారికి, రిసోర్స్ పర్సన్స్ గంజి ఈశ్వర లింగం మరియు సుబ్బ రాజు గారికి ధన్యవాదాలు.

.jpeg)

.jpeg)

.jpeg)
.jpeg)


.jpeg)
.jpeg)

.jpeg)

.jpeg)

.jpeg)

.jpeg)



.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)

No comments:
Post a Comment