Saturday, May 4, 2024





నేను రాసిన  'నా కోరా రాతలు' పుస్తకం యొక్క ఉచిత కాపీలు పది  నాకు మే నెల నాల్గవ తేదీన 2024 న అందాయి. ఉదయం స్నానం చేసి దిన పత్రిక చదవడం కోసం హాలులోకి వచ్చిన నాకు టీపాయ్ మీద ఒక పార్శిల్ కనిపించింది. అది తెరిచి చూస్తే నా చేత లిఖించబడిన పుస్తకం ప్రతులు. స్క్రాచ్ బుక్ పబ్లికేషన్స్ కు నా బ్లాగ్ తరుపున ధన్యవాదాలు. పుస్తకం ప్రతులను చూసిన మా నాన్న లేని మీసాలు మెలేశారు. అమ్మ ముసి, ముసిగా నా కొడుకు ప్రయోజకుడయ్యాడని నవ్వుకుంది. నా శ్రీమతి 'పర్లేదు, మా ఆయన కోతలకే అనుకున్నా, రాతలకు కూడా పనికివస్తాడన్నట్టు చూచింది. ఏది ఏమైనా నేను రాసిన రెండో పుస్తకం ప్రచురణకు నోచుకోవడం ఒక కొత్త అనుభూతిని నాకు కలిగించింది. 







 

No comments:

Post a Comment

  My Books at Hyderabad Book fair