Saturday, December 23, 2023
Thursday, December 21, 2023
జనాలను కలవకుంటే నాకు జ్వరం వచ్చినంత పనవుతుంది. డిసెంబర్ 20 మరియు 21, 2023 , ఈ రెండు రోజుల్లో ఒక రెండు వందలమంది వివిధ స్థాయిల విద్యార్థులతో కలిసి మాట్లాడే అవకాశం వచ్చింది. కౌశల్ పోస్టర్ ప్రెసెంటేషన్ కు నేను, రాజశేఖర్ రెడ్డి జ్యూరీ లుగా వెళ్ళాము. జనరల్ మరియు స్పెషల్ థీమ్స్ మీద విద్యార్థులు చక్కగా మాట్లాడారు. టీచర్స్ అభిమానాన్ని నేను ఎప్పుడూ మరిచిపోలేను.
ఇక ఆన్సెట్ ఆధ్వర్యం లో సాయి మహిళా మరియు పురుషుల జూనియర్ కళాశాల విద్యార్థులతో ముచ్చటించే అవకాశం వచ్చింది.
Connect the people
Connect the dots
Meet success ........అంతే
Tuesday, December 19, 2023
Saturday, December 16, 2023
డిసెంబర్ 16, 2023 మా అనంతపురం ఆర్ట్స్ కళాశాల కు ఓ పిల్లల పండగ తరలివచ్చింది. వంద వసంతాల పైబడిన ఈ కళాశాలలో మరో వసంతం విరబూసింది. కళాశాల విద్యా కమిషనర్ పోలా భాస్కర్ గారి చొరవతో "ప్రజ్ఞ" పేరుతో అకడెమిక్ ఫెస్ట్ జరిగింది. ముందు రోజు నుంచే CCE అధికారులు తరలివచ్చారు. ఏర్పాట్లు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కళాశాలలోని ప్రిన్సిపాల్స్ మరియు ప్రాంతీయ సంచాలకులు విచ్చేశారు. ఈ సదస్సులో కళాశాల విద్యా కమిషనర్ పోలా భాస్కర్ గారు మాట్లాడిన తరువాత ప్రఖ్యాత సైకాలజిస్ట్ చెన్నోజు వీరేంద్ర విద్యార్థులకు ఎన్నో మెళుకువలను బోధించారు.
ఈ కార్యక్రమం లో కొసమెరుపు ఏమంటే మా జంతుశాస్త్ర అధ్యాపకుడు సలీం డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోటీ పరీక్షల అభ్యర్థుల కోసం రచించిన 5 పుస్తకాలను వేదిక మీద CCE AGO DR. తులసీ మేడమ్, OSD DR. కోగంటి విజయబాబు మరియు కళాశాల ప్రిన్సిపల్ DR. దివాకర్ రెడ్డి విడుదల చేశారు. చాలా మంది విద్యార్థులు సలీం తో ఫోటో సెషన్ లో పాల్గొనడానికి ఎగబడ్డారు. ఈ కార్యక్రమం లో కదిరి STSN GDC Principal DR. స్మిత, మా కళాశాల lecturers శ్రీదేవి మరియు Dr. P S Lakshmi పాల్గొన్నారు.
Multiple Activities in Our College Today 1. Meeting is convened in the examination committee with the membe...
.jpeg)
-
అనంతపురం ITI తో నా అనుబంధం ITI అంటే Industrial Training Center అని అర్థం. భారత కేంద్ర కార్మిక ...
-
ఆగస్టు 8 వ తేదీ ఉదయం 10.30 కు CCE వారి ఉత్తర్వులకు అనుగుణంగా LMS Video Making మీద NRC కేంద్రం అయిన మా కళాశాలలో జిల్లా వ్యాప్తంగా ఉన్న అధ్యాప...