డిసెంబర్ 16, 2023 మా అనంతపురం ఆర్ట్స్ కళాశాల కు ఓ పిల్లల పండగ తరలివచ్చింది. వంద వసంతాల పైబడిన ఈ కళాశాలలో మరో వసంతం విరబూసింది. కళాశాల విద్యా కమిషనర్ పోలా భాస్కర్ గారి చొరవతో "ప్రజ్ఞ" పేరుతో అకడెమిక్ ఫెస్ట్ జరిగింది. ముందు రోజు నుంచే CCE అధికారులు తరలివచ్చారు. ఏర్పాట్లు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కళాశాలలోని ప్రిన్సిపాల్స్ మరియు ప్రాంతీయ సంచాలకులు విచ్చేశారు. ఈ సదస్సులో కళాశాల విద్యా కమిషనర్ పోలా భాస్కర్ గారు మాట్లాడిన తరువాత ప్రఖ్యాత సైకాలజిస్ట్ చెన్నోజు వీరేంద్ర విద్యార్థులకు ఎన్నో మెళుకువలను బోధించారు.
ఈ కార్యక్రమం లో కొసమెరుపు ఏమంటే మా జంతుశాస్త్ర అధ్యాపకుడు సలీం డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోటీ పరీక్షల అభ్యర్థుల కోసం రచించిన 5 పుస్తకాలను వేదిక మీద CCE AGO DR. తులసీ మేడమ్, OSD DR. కోగంటి విజయబాబు మరియు కళాశాల ప్రిన్సిపల్ DR. దివాకర్ రెడ్డి విడుదల చేశారు. చాలా మంది విద్యార్థులు సలీం తో ఫోటో సెషన్ లో పాల్గొనడానికి ఎగబడ్డారు. ఈ కార్యక్రమం లో కదిరి STSN GDC Principal DR. స్మిత, మా కళాశాల lecturers శ్రీదేవి మరియు Dr. P S Lakshmi పాల్గొన్నారు.
No comments:
Post a Comment