Saturday, June 29, 2024



CSP Project & Internship Evaluation for 2024 batch of students in the months of June- July 











 " ఎవడి ఎత్తని కొలవను 

ఒక్కొక్కడో  హిమాలయం 

ఎవడి  లోతని  కొలవను,

ఒక్కొక్కడో  మహా సముద్రం,

తోలుకంటి తో  చూస్తే ఊరి చెరువులా ఉంటాడు, 

మొహం మీద సిరా మరకలతో 

మొద్దబ్బాయిలా ఉంటాడు" 

అన్న సినారె మాట నాకు ఈరోజు అనుభవానికి వచ్చింది. దానికి కారణం కమ్యూనిటి సర్విస్ ప్రాజెక్టు వైవా ను ఈ రోజు మా డిపార్ట్మెంట్ లో నేనూ, శ్రీదేవీ మేడం నిర్వహించడం. 20 మంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. పూల్ సింగ్ external examiner గా వ్యవహరించారు. చాలా మంది పిల్లలు Mobile Addiction మరియు Lifecycle disorders మీద projects చేశారు. వీటిలో వారు రూపొందించిన ప్రశ్నావళి చక్కగా ఉంది. ఇంతే కాకుండా వైవా లో పిల్లలు మాట్లాడిన తీరు చాలా బాగుంది. వారిలో ఉన్న Sense of humor అద్భుతం. వీరి తో interaction వల్ల ఈ రోజు నేను గ్రామీణ వాతావరణం గురించి చాలా తెలుసుకోగలిగాను. ఈ వైవా లో మేము ఈ క్రింది విషయాలను విద్యార్థులకు నేర్పించగలిగాము. 

- Body language 

- eye contact 

- method of greeting the board members 

- Presentation skills 

- Social interactions & intelligence 




  

No comments:

Post a Comment

                                        My newly published book "టీ టైమ్ కథలు"