Friday, July 12, 2024

                                Organ Donation Awareness Camp on 12th July 2024


















అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల జంతుశాస్త్ర విభాగం లో  SIDBI General Manager Sri V చంద్రమౌళి, Sri Rama Krishna DGM, Regional Office మరియు శివకుమార్ ఆధ్వర్యం లో అవయవ దానం మీద ఒక అవగాహనా సదస్సు జరిగింది. డాక్టర్ గిరిధర్ మరియు నెహ్రూ యువకేంద్ర వాలంటీర్లు దీనికి కావాల్సిన ఏర్పాట్లు పూర్తీ చేశారు. ఈ సందర్భంగా క్విజ్, స్లోగన్ రైటింగ్ మరియు అవయవ దానానికి సంబంధించిన డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. SSBN, SV Degree , RIPER మరియు మా ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొన్నారు. ఈ సదస్సులో రిసోర్స్ పర్సన్స్ అవయవ దాన ప్రాముఖ్యత మీద విద్యార్థులకు అవగాహన కల్పించారు. 
జీవితంలో రెండు సంఘటనలు మన చేతిలో ఉండవు. అవి ఒకటి పుట్టుక మరొకటి చావు. పుట్టుకతో 'పుట్టెడు' కష్టాలు మొదలవుతాయి. పుట్టుక నుంచి చావు వరకు మనం మన శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ శరీరం ఒక కొంప లాంటిది. దానిని తగలేసుకోకూడదు. 'దేహో దేవాలయం ప్రోక్తం , జీవో దేవః సనాతనః' అన్నారు కాబట్టి దేహాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే విద్యార్థులు స్మోకింగ్, ఆల్కహాల్ మరియు మాదక ద్రవ్యాల లాంటి వాటికి బానిసలు కాకూడదు. 
మనం చిరంజీవులుగా మరణానంతరం కూడా జీవించాలంటే, అవయవ దానం ఒకటే మార్గం. జీవన్  దాన్ లో అవయవ దాత గా మనం మన పేర్లు నమోదు చేసుకోవాలి. మీ మరణం తరువాత మీ గుండె వేరే వారిలో స్పందించాలి. Brain dead అయినవారి వివిధ అవయవాలను ఇతరులకు అమర్చవచ్చు. ఒక కళేబరం నుంచి తీసుకున్న అవయవాల ద్వారా సుమారు ఆరు మందికి కొత్త జీవితాన్ని ప్రసాదించవచ్చు. కళ్లు, గుండె, కాలేయం , మూత్రపిండం లాంటి అవయవాలను దానం చేయవచ్చు. మరణం తరువాత కూడా మనం ప్రపంచాన్ని చూడాలి అంటే నేత్ర దానం ద్వారా మాత్రమే సాధ్యం. 
చావు చెప్పి రాదు కాబట్టి అందరూ కూడా అవయవ దాతగా నమోదు చేసుకుంటే మృత్యువుకు కూడా ఒక అర్థం, పరమార్థం చేకూరుతుంది. చచ్చి పోయే ముందే, ఇచ్చి పోవడానికి సిద్దమవుదాం. అన్ని దానాలకన్న , అవయవ దానం మిన్న. 
ఈ సదస్సు విజయవంతమవడానికి తోడ్పడిన మా డిపార్ట్మెంట్ అధ్యాపకులకు మరియు విద్యార్థులకు ఇవే మా నమస్సులు. 
మీరు సహకరిస్తే, ఇలాంటి సదస్సులు సహస్రాధికంగా నిర్వహిస్తామని హామీ ఇస్తూ.. 

                                                                                                G L N PRASAD
                                                                                               Lecturer in Charge
                                                                                             Department of Zoology 
                                                                                           Govt College (A) Anantapur 


No comments:

Post a Comment

                                                 Freshers' day party of Biochemistry students                    News clippings related ...