ఎప్పటిలాగే ఈ రోజు కూడా అనేక కార్యక్రమాలతో సందడిగా గడిచిపోయింది. మా కళాశాల షిఫ్ట్ పద్దతిలో కొనసాగుతుండడం వలన నేను అనేక కార్యక్రమాలను చేయగలుగుతున్నాను. ఈ రోజు పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో సబ్ ఇన్స్పెక్టర్స్ కు నేను శిక్షణ ఇవ్వడం ముగిసిన తరువాత లక్ష్మీ సినర్జీ స్కూల్ లో ANSET Youth Wing వారు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రధాన వక్తగా వెళ్లాను. లక్ష్మీ సినర్జీ స్కూల్ కరెస్పాండెంట్ మరియు head mistress ఇద్దరూ కూడా కార్యక్రమం కోసం చక్కటి ఏర్పాట్లు చేశారు. పదవ తరగతి పిల్లలు నూటా అరవై మంది ఒక పెద్ద హాలులో నిశ్శబ్దంగా కూచుని, మేము ఏమి చెపుతామా అని ఎదురు చూస్తున్నారు. కాలర్ మైక్ కూడా ఇవ్వడంతో మా వాగ్దాటి సుమారు రెండు గంటల పాటు కొనసాగింది. మేము విద్యార్థులతో ముచ్చటించిన అంశాలు ఈ క్రింద ఇస్తున్నాను.
ప్రపంచం నిండా ఉండేది డబ్బే. కానీ అది అందరి దగ్గర ఉండదు. డబ్బుకు తన యజమాని గురించి బాగా తెలుసు. అతడు ఎక్కడ ఉన్నా అది వెతుక్కుని వస్తుంది.
ప్రపంచం నిండా ఉండేది ఉద్యోగాలే. కానీ అందరికీ ఉద్యోగాలు రావు.
ఉద్యోగం రావాలి అంటే నైపుణ్యం ఉండాలి.
పదవ తరగతి పూర్తీ చేసేంతలో, ఏ రంగంలో ప్రవేశించాలి అని నిశ్చయించుకుంటే మంచిది.
ఇంజనీరింగ్ మరియు మెడిసిన్ తో పాటు చాలా రంగాలలో ఉద్యోగాలు నిపుణుల కోసం ఎదురుచూస్తున్నాయి.
జనాల మనస్తత్వం తెలుసుకుని అంకుర పరిశ్రమలు స్థాపిస్తే, మీ ఇంట్లో సిరుల పంటే.
ప్రకటన రంగంలో కూడా అనేక ఉద్యోగాలు ఉన్నాయి. శ్రీ శ్రీ లాగా పంచ్ డైలాగులు రాయగలగాలి. ఒక సారి శ్రీ శ్రీ వద్దకు ఒక పెద్ద మనిషి తను పెట్టబోయే ఫోటో స్టూడియో కు caption కోసం వస్తాడు. అప్పుడు శ్రీ శ్రీ చెప్పిన caption "ఇచ్చట ఫోటోలు మీ మొఖం లా తియ్యబడును".
లెక్కలు, సైన్స్ కంటే కూడా ఇప్పుడు కామర్స్ కు ప్రాధాన్యత పెరుగుతూ ఉంది.
Communication Skills ఉంటే, ఏ రంగంలోనైనా ఇట్టే ఉద్యోగాలను పట్టేయొచ్చు.
LSRW Skills ను యువత అందిపుచ్చుకోవాలి.
సుమారు గంటకు పైగా కొనసాగిన ఈ కార్యక్రమం లో విద్యార్థులు ఏ మాత్రం అల్లరి చేయకపోవడం ఒక కొసమెరుపు.
No comments:
Post a Comment