Saturday, September 21, 2024


Photos related to Student Induction Programme at SKR & SKR Govt College (A) Kadapa and Board of Studies meeting at SKP Govt Degree College Guntakal on 20th & 221st September 2024 respectively. 









 



















సెప్టెంబర్ 20 మరియు 21, 2024 రెండు రోజులు నేను చాలా నిర్మాణాత్మక కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది. కడప మహిళా డిగ్రీ కళాశాల లో ప్రిన్సిపల్ డాక్టర్ సలీం బాషా ఆహ్వానం మేరకు నేను, శ్రీదేవి మేడం ఇరువురం స్టూడెంట్ ఇండక్షన్ ప్రోగ్రామ్ లో విషయ నిపుణులుగా పాల్గొనడానికి బయలుదేరి వెళ్లాము. మధ్యలో వచ్చే యోగి వేమన విశ్వవిద్యాలయం లో మా గైడ్ డాక్టర్ అనుప్రసన్న మేడం గారిని కలిసి డిగ్రీ కళాశాలకు వెళ్లాము. మధ్యాహ్నం 2.30 కి సదస్సు మొదలయ్యింది. మొదటగా నేను stress management మీద ఒక అరగంట పాటు ఉపన్యసించాను. తదుపరి శ్రీదేవి మేడం climate change అనే అంశం మీద ఉపన్యసించారు. తరువాత సన్మాన కార్యక్రమం తో సదస్సు ముగిసింది. మా మధ్యాహ్న భోజనాన్ని మీనాక్షీ భవన్ లో ముగించాము. సోదరి కృష్ణవేణి మేడం నాకు ఒక memento బహుకరించారు. 
ఇక 21 వ తేదీన గుంతకల్ SKP Govt Degree College లో Board of Studies  meeting కు హాజరు కావడానికి నేను, శ్రీదేవి మేడం, శేషయ్య సర్, శ్యామ్ ప్రసాద్, కరణం సుధాకర్ మరియు శశాంక మౌళి గారు బయలుదేరి వెళ్లాము. మీటింగ్ అనంతరం అందరూ వెళ్లి కసాపురం లో ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని, శంకరానంద గిరి ఎయిడెడ్ డిగ్రీ కళాశాల కు వెళ్లాము. 
పై ఫోటోలు అన్నీ కూడా ఈ రెండు రోజుల పర్యటనకు సంబంధించినవి. 

No comments:

Post a Comment

                           Collaborative Work With District Science Center, Anantapur   In collaboration with the District Science Center an...