Tuesday, September 24, 2024


జీవితం లో తరించిపోవడం అంటే ఏమిటో ఇప్పుడిప్పుడే అర్థం అవుతూ ఉంది. ఒక విఫల మనోరథుడనై ఒకప్పుడు తిరిగిన నేను ఇప్పుడు అత్యంత సంతృప్తికరంగా జీవిస్తున్నాను. వెనక్కు తిరిగి చూసుకుంటే నిజానికి పోగొట్టుకున్నది ఏమీ లేదు. పోగొట్టుకున్నాను అనుకున్నది అంతా వడ్డీ తో సహా తిరిగి పొందగలిగాను. నా జీవన యానం లో ప్రతి దశ లో వైఫ్యల్యాలు ఎదుర్కొన్న నేను, వాటిని సాఫల్యాలు గా మార్చుకోగలిగాను. ఇప్పుడు నేనొక బాధ్యతాయుత అధ్యాపకుడను. నేను కలిసిన విద్యార్థుల సంఖ్య లక్ష దాటి ఉంటుంది. స్కూల్ దశ నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు చాలా మందిని కలిసాను. ఇప్పుడు నేను ఒక రచయితగా కూడా ఒక కొత్త అవతారం ఎత్తాను. నాకు చిన్నప్పటి నుంచి మాట్లాడాలి అన్నా, రాయాలి అన్నా తెగ ఇష్టం. ఇప్పుడు అనేక సామాజిక వేదికలలో నా రాత కోతలు అందరితో పంచుకుంటున్నాను. కోరా లో నేను రాసిన రాతలను scratch book publications వారు అచ్చేసారు. ఈ రోజు నేను నామసేవ హరికృష్ణ అన్నను వారి ఇంటికి వెళ్లి కలిసి, నేను రాసిన 'నా కోరా రాతలు' ఆయనతో పంచుకున్నాను. నామసేవ అన్నను నేను చిన్నప్పటి నుంచి ఎరుగుదును. ఈయన 'కృష్ణ వాణి' అనే కలం పేరుతో బాలజ్యోతి మరియు ఇతర పత్రికలలో చాలా కథలు రాసేవారు. నేను డిగ్రీ చదివే రోజుల్లోనే ఆయన ఒక లబ్ధ ప్రతిష్టితుడైన రచయిత. అలా నాలో ఒక రచయిత బయటకు రావడానికి నామసేవ అన్న ఒక కారణం. 

ఈరోజు మరో విశేషం కూడా జరిగింది. ANSET ఆధ్వర్యం లో జరిగిన ఒక కార్యక్రమానికి అతిథి గా వెళ్లాను. నారాయణా బాలికల జూనియర్ కళాశాలలో ఈ కార్యక్రమం జరిగింది. మేనేజర్ సునీల్ కుమార్ మరియు నేనూ విద్యార్థినులతో ఒక గంట పాటు అనేక విషయాలు చర్చించాము. మనుషులను కలవడంలో, పుస్తకాలను చదవడం లో , ఊర్లు తిరగడంలో ఉన్న ఆనందం ఇంక దేనిలోనూ లేదని నా అభిప్రాయం. 



నామసేవ హరి అన్న కు నా పుస్తకం ఇస్తూ నేను. 





 









This is the awareness programme held in collaboration with ANSET at Narayana Boys Junior College Anantapur on 26th September 2024 at 5.20 PM to 6.10 PM.  

1 comment:

                           Collaborative Work With District Science Center, Anantapur   In collaboration with the District Science Center an...