Tuesday, November 26, 2024

STSN Govt Degree College, Kadiri on 26th November 2024. Participation in a session on 'Coral Reef Restoration and Diversity by Dr Ch Satyanarayana, Scientist ZSI. 














నిన్న మా కళాశాలలో చాలా విజయవంతంగా ప్రవాళ భిత్తికల మీద సదస్సు జరిగింది కదా!!! విద్యార్థుల నుంచి వచ్చిన స్పందన చూసి, ఇలాంటి సదస్సే ఒకటి కదిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తే బాగుంటుందని తలచి, సైంటిస్టు సత్యనారాయణ గారిని అడిగితే ఆయన తన అంగీకారాన్ని తెలియయజేశారు. తరువాత కదిరి డిగ్రీ కళాశాల ఆంగ్ల అధ్యాపకుడు హైదర్ అలీ గారికి తెలియజేసి సదస్సుకు కావలసిన ఏర్పాట్లు జరిగేలా చూసాము. ప్రిన్సిపల్ స్మిత గారు కూడా తన అంగీకరాన్ని తెలియజేయడంతో, 26వ తేదీ ఉదయం 9.15 కు కదిరి కళాశాల చేరుకున్నాము. వెంటనే కదిరి నరసింహ స్వామి దర్శనం చేసుకుని, సదస్సుకు హాజరయ్యాము. సుమారు 11 గంటలకు మొదలైన సత్యనారాయణ గారి ప్రసంగం ఒక గంటపాటు కొనసాగింది. ప్రవాళ వైవిధ్యం, వాటిని ఎలా సంరక్షించాలి అనే అంశం మీద చక్కగా సత్యనారాయణ గారు ప్రసంగించారు. సాగర గర్భంలో దాగిన జీవ వైవిధ్యాన్ని వీడియోల రూపంలో ప్రదర్శించడం విద్యార్థులను అలరించింది. చివరగా సత్యనారాయణ గారిని ప్రిన్సిపల్ స్మిత, హైదర్ అలీ, మరియు నారాయణ స్వామి సన్మానించడం జరిగింది. ఇలాంటి సదస్సులు వీలైతే అన్ని డిగ్రీ కళాశాలల లో జరిగితే విద్యార్థులు లబ్ధి పొందుతారు. 

 


No comments:

Post a Comment

                                        My newly published book "టీ టైమ్ కథలు"