Tuesday, August 29, 2023
















 మా తరం లో విద్యార్థులు జ్ఞాన యోగం, విజ్ఞాన యోగం మార్గం లో ఉండేవారు. అప్పట్లో చదువు లక్ష్యం జ్ఞాన సమూపార్జన. తరాలు మారేకొద్దీ తలరాతలు మారాలి కదా! అప్పట్లో విద్య కొందరి సొత్తు. అది అందరికీ అందేలా చేయాలి కదా!!!! అంటే విద్యా రంగం లో access & equity ఉండాలి. అదే విధంగా Quality కూడా వుండాలి. ఈ తరానికి నైపుణ్య ప్రధాన విద్యలు కావాలి. అందుకోసమే ప్రతి కోర్సు లోనూ multidisciplinary course & pathway course లను ప్రవేశపెట్టడం జరిగింది. అందరికీ చాలా విషయాలు తెలిస్తే, నైపుణ్యం సాధ్యం అవుతుంది. ఎవరో అన్నారు "Name it and then you can tame it" అని. ఇలా కొత్త కోర్సు లను ప్రవేశపెట్టినప్పుడు, కొద్దిగా గందరగోళం ఉండడం సహజం. అందుకే CCE వారు ప్రతి కళాశాల లో SIP అనే పేరుతో Student Induction Programme నిర్వహించవలసిందిగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా నేను కడప లోని SKR & SKR Government College for Women (A) కు వెళ్ళడం జరిగింది. రెండు వందల మంది విద్యార్థినులతో సమావేశం మొదలయ్యింది.  సమావేశం తదనంతరం సన్మానం షరా మామూలే అనుకోండి. తరువాత నేనూ, NYK శ్రీనివాసులు సర్ కడప లోని NYK office ను సందర్శించడం జరిగింది. చక్కటి వాతావరణం లో ఉంది ఆ కార్యాలయం. దానిలో ఉన్న Reading room facility నన్ను అమితంగా ఆకర్షించింది. మరి మీరు కూడా నైపుణ్యం సంపాదించుకునే వైపుగా  అడుగులు వేయండి. 

- మీకు, మీ ప్రాడక్ట్ కు మార్కెట్ ఉండేలా చూసుకోండి. 

- వృత్తి పరమైన నైపుణ్యాలు సంపాదించుకోండి 

- మీ విలువ తో పాటు మీ ప్రాడక్ట్ విలువ కూడా పెరిగేలా చేసుకోండి. 

- డబ్బు సంపాదించడం ఒక కళ. ఆ కళను ఆకళింపు చేసుకోండి. 

- మంచి మానవ సంబంధాలు కలిగిఉండండి 

- Pathway courses బోధించడానికి వివిధ సబ్జెక్టులకు సంబంధించిన గురువులు మీ వద్దకు వస్తారు కాబట్టి, వారిలో ఉన్న బోధనా పరమైన నైపుణ్యాలను, వృత్తి పరమైన నైపుణ్యాలను గ్రహించి అలవరుచుకోండి. 

నైపుణ్య ప్రాప్తి రస్తూ 

Saturday, August 26, 2023








 సినీ హీరో , దర్శకుడు, కమ్యూనిస్ట్ మరియు హ్యూమనిస్ట్ అయిన ఆర్. నారాయణ మూర్తి ఈ రోజు మా ఆర్ట్స్ కళాశాల కు విచ్చేశారు. ఛాంబర్ లో నాక్ పనులలో మునిగితేలుతున్న మాకు ఆయన రాక చాలా థ్రిల్లింగా అనిపించింది.  నారాయణ మూర్తి సినిమా లు నేను  డిగ్రీ చదువుకునే రోజులలో  ఒక ఊపు ఊపాయి. 'ఎన్నియల్.. ఎన్నియల్.. ఎన్నియెల్లో యెర్ర్ యెర్రని జండలో ఎన్నియెల్లో' అనే పాట విన్నప్పుడు నాలో ఒక కమ్యూనిస్ట్ మేలుకొన్నాడు. ఆ మేలుకున్న కమ్యూనిస్ట్ ఏమయ్యాడని  మాత్రం అడక్కండి. అప్పట్లో ప్రతి అన్నా 'నీ పాదం మీద పుట్టు మచ్చ నై చెల్లమ్మా, తోడ బుట్టిన ఋణం తీర్చుకుందునే చెల్లమ్మా' అని పాడుకునేవాడు. నారాయణ మూర్తి సినీ కార్మికుల కష్టాల నివారణకు కూడా ఎప్పుడూ పోరాడుతూనే ఉంటారు. సినీ గ్లామర్ ముందు మా గురువుల గ్లామర్ ఎందుకూ పనికిరాదు. ఆయన ఛాంబర్ లోకి రాగానే , మా గురువులంతా నారాయణ మూర్తి గురత్వాకర్షణ లోకి వెళ్లిపోయాము. అందరూ ఆయన చుట్టూ చేరిపోయి ఫోటోలు  తీసుకున్నాము. ఆ ఫోటోస్ నే ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. 

Friday, August 25, 2023










 కొన్ని అనుభూతులు తిరిగి రావు. రాకూడదు కూడా. అలాంటివే మేము కల్యాణదుర్గం ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో పనిచేసిన రోజులు. ఆ విద్యార్థులు చూపించే అనురాగానికి విలువకట్టలేము. వారిని కలుసుకునే అవకాశము ఈ రోజు తిరిగి మహా జాబ్ మేళా రూపం లో నాకు వచ్చింది. రెండు బస్సుల్లో  ఉదయం 9 గంటల కంతా  చిల్లో బొల్లో మంటూ దిగేశారు వారు. వారందరితో కరచాలనం చేసిన తరువాత మా విభాగానికి పిలుచుకుపోయాను. ఇక్కడ ఉన్న సౌకర్యాలు వారికి బాగా నచ్చినట్టే అనిపించాయి. మా ప్రయోగశాలలు, మ్యూజియం చూసి వారిలో ఒకడు "ఎంతున్నా ఆర్ట్స్ కళాశాల.. ఆర్ట్స్ కళాశాలే సర్" అన్నాడు. తరువాత వారికి కొత్తగా ప్రవేశపెట్టిన 4 సంవత్సరాల డిగ్రీ ఆనర్స్ కోర్సు గురించి తెలియజేశాను. తరువాత జాబ్ మేళా కు బయలుదేరాము. ఏ మాటకామాటే చెప్పుకోవాలి, మా కాలం లో ఇలా ఉద్యోగాలు ఇచ్చేవారు కాదు. కంపెనీ లే ఉద్యోగాలు ఇస్తామంటూ కాలేజీ ప్రాంగణం లోకి వచ్చేశాయి. ఏకంగా 33 కంపెనీలు. నన్ను రిజిస్ట్రేషన్ పనిలోకి వేశారు. వందల మంది గుంపుగా వచ్చేశారు. నిజం చెప్పొద్దు.. ఉక్కిరి బిక్కిరి అయిపోయాను. అంత మంది విద్యార్థులను ఒక చోట చూస్తుంటే నాకు పుష్కరాలు చూసినంత సంబరంగా అనిపించింది. కమిషనర్ గారు విద్యార్థులను ఉద్దేశించి ఉత్తేజభరితంగా ప్రసంగించారు. తరువాత విద్యార్థులకు ఇంటర్వ్యూ లు నిర్వహించి సుమారుగా 3000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళ కళ్ళల్లో ఎన్ని ఊహలు, ఎన్ని తలపులు, ఎన్నెన్ని ఆశలు కనిపించాయో నాకు. వారిని చూస్తుంటే నా దేశ భవితకు ఇక ఢోకా లేదనిపించింది. మరి మీకు కూడా ఉద్యోగం రావాలంటే ఈ క్రింది సలహాలు పాటించండి. 

- జ్ఞానానికి, నైపుణ్యానికి మధ్య తేడా గుర్తించండి. జ్ఞానం వలన మోక్షం రావొచ్చు, కానీ నైపుణ్యం వలన ఉపాధి దొరుకుతుంది 

- దేశం నిండా ఉండేది ఉద్యోగాలే, కానీ చేసే నైపుణ్యం ఉన్న యువత దొరకడం లేదు 

- మంద లో ఒకరిగా కాకుండా, వంద లో ఒకరిగానన్నా ఉండే ప్రయత్నం చేయండి 

- ఏ ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారో, దానికి తగ్గ నైపుణ్యాలు అలవరచుకోండి  

- మొదట మీరు ఎందులో రాణించగలరో తెలుసుకోండి 

- మీరు ఎంచుకున్న రంగం లో ఎదుగుదల కు అవకాశం ఎంతో బేరీజు వేసుకోండి. 

- చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకుంటే ఎదగలేరు. Low aim is crime అని గుర్తుపెట్టుకోండి 

- వీలైతే ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వెళ్ళండి 

విజయోస్తు.. దిగ్విజయోస్తు














A batch of students from Govt Degree College, Patthikonda visited the museum in Zoology department on 25th August 2023. It was an amazing experience for us to spend some time with them. It was a fascinating and enriching experience for them. They observed the museum specimen and spotters and got inputs regarding human anatomy. We also created awareness among them regarding the 4th year degree honours course in our college. 

Thursday, August 24, 2023




Dr P Anilkumar OSD CCE AP visited our college to supervise the mega job mela drive scheduled on 25th August 2023. On this occasion, he has taken a session on NEP- 2020 for all faculty members. Nearly 150 faculty members have been benefited from this programme. Later Dr P Anil Kumar has been felicitated. 


Pre Mega Job mela involvement of the staff members 

 

                                        My newly published book "టీ టైమ్ కథలు"