Saturday, August 12, 2023














 ఈ రోజు నెహ్రూ యువకేంద్ర మరియు ANSET సంయుక్త ఆధ్వర్యం లో అంతర్జాతీయ యువ దినోత్సవం సందర్భంగా మేరే మాటీ- మేరా దేశ్ కార్యక్రమాన్ని KSN ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల (A) లో నిర్వహించారు. ఈ కార్యక్రమం లో అతిథిగా పాల్గొనే అవకాశం నాకు లభించింది. దీనిలో శ్రీ కృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయ ఆచార్యులు మురళీధర్, ANSET సునీల్ కుమార్, నెహ్రూ యువకేంద్ర DDO శ్రీనివాసులు పాల్గొనడం జరిగింది. దీనిలో భాగంగా కార్గిల్ యుద్ధం లో పాల్గొన్న సైనికులకు సన్మానం చేశారు. 50 మొక్కలు నాటారు. మన దేశం మట్టి మహా మహిమాన్వితమైనది. నిజానికి మట్టి ముందు మనిషి దేనికీ పనికిరాడు. ఎందుకంటే మట్టి చిరంజీవి, మనిషి అల్పజీవి. మట్టి మనలాంటి తరాలను ఎన్నిటినో చూసింది. ఎన్నో నాగరికతలు మట్టిలో కలిసిపోయాయి. నిజానికి మన మంతా ఓ పిడికెడు మట్టే. మన దేశం మట్టిలో ఎన్నో సంస్కృతులు జ్ఞాపకాల రూపంలో కలిసిపోయాయి. ఇది తపో భూమి, జ్ఞాన భూమి, కర్మ భూమి, ధర్మ భూమి. ఈ దేశపు మట్టి లో ఏదో మహత్తు ఉంది. అందుకే భారత భూమి మీద దండయాత్రకు అలెక్సాండర్ బయలుదేరినప్పుడు, అరిస్టాటల్ అతనిని భారతదేశం నుంచి గంగా జలం మరియు పిడికెడు మట్టి తెమ్మన్నాడు. ప్రతి గ్రామంలో మట్టికీ ఏదో ఒక ప్రత్యేకత ఉండే ఉంటుంది. ప్రతి మండలం, ప్రతి రాష్ట్రం నుంచి సేకరించిన మట్టిని దేశ రాజధాని లో ప్రతిష్టించబోతున్నారు అందుకే. ఇలా ఈ భూమి, ఈ దేశం గురించి ఎన్నో విషయాలు ఈ కార్యక్రమం లో గుర్తుచేసుకున్నాము. చివర్లో తన ఛాంబర్ లో మా అందరినీ ప్రిన్సిపల్ శంకరయ్య సర్ అభినందించడం జరిగింది. 

No comments:

Post a Comment

                                        My newly published book "టీ టైమ్ కథలు"