Wednesday, August 21, 2024

 

I am really blessed to associate myself with NAAC Peer visit as a previous IQAC Coordinator. These are the fine moments captured by my mobile cam on 21st August 2024

































Thursday, August 8, 2024

ఆగస్టు 8 వ తేదీ ఉదయం 10.30 కు CCE వారి ఉత్తర్వులకు అనుగుణంగా LMS Video Making మీద NRC కేంద్రం అయిన మా కళాశాలలో జిల్లా వ్యాప్తంగా ఉన్న అధ్యాపకులకు శిక్షణా తరగతులు మొదలయ్యాయి. ఇది పది రోజుల పాటు జరిగే కార్యక్రమం. రోజుకు సుమారు 20 మంది అధ్యాపకులు వివిధ కళాశాలల నుంచి వచ్చి ఈ శిక్షణ లో తర్ఫీదు పొందుతారు. ఈ రోజు గుంతకల్ మరియు KSN Govt College (A) Women కళాశాలల నుంచి 23 మంది లెక్చరర్లు పాల్గొన్నారు. గౌరవనీయ  కమిషనర్ గారు ఆన్లైన్ లో మమ్మల్ని ఉద్దేశించి ప్రసంగించారు. తరువాత కళాశాల ప్రిన్సిపల్ దివాకర్ రెడ్డి గారి ఆధ్వర్యం లో శిక్షణ మొదలయ్యింది. Academic Coordinator  Dr. H. పల్లవి ముందుగా ప్రసంగిస్తూ శిక్షణ యొక్క ముఖ్య ఉద్దేశ్యాన్ని తెలియజేశారు. Quadrant పద్దతిలో ఎలా కంటెంట్ అభివృద్ధి చేయాలో చక్కగా తెలియజేశారు. స్టూడియో in charge చంద్ర శిక్షణ కోసం స్టూడియో లో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చక్కటి ఏర్పాట్లు చేశాడు. అహ్మద్ వేదికకు సంబంధించిన ప్రోటోకాల్ బాధ్యతలు తీసుకున్నాడు. 
LMS Videos తయారు చేయడానికి కావాల్సిన  ఈ క్రింది మెళుకువలను నిపుణులు తెలియజేశారు. 

  • కంటెంట్ తయారుచేయడం లో దృశ్య మరియు శ్రవణ మాధ్యమాల ప్రాధాన్యత 
  • పవర్ పాయింట్ స్లయిడ్స్ తయారుచేసే విధానం. దీనికి సంబంధించి Design, Aspect ratio, background design, Smart art conversion, animation లాంటివి ఎలా చేయాలో నేర్పించారు. దానితో పాటుగా images, icons మరియు ఆడియో క్లిప్స్ ను ఎలా slides లో చొప్పించాలో తెలియజేశారు. 
  • తరువాత podcast చేసే మెళుకువలు నేర్పించారు. ఆడియో recording చేసేటప్పుడు modulation ప్రాధాన్యత తెలియజేశారు. 
  • రికార్డింగ్ చేసేటప్పుడు 'అన్నమాట, అర్థం అయ్యిందా' లాంటి time fillers వాడకూడదు.
  • రికార్డింగ్ మధ్యలో ఆటంకం వస్తే, కొద్ది సమయం గడిచిన తరువాత తిరిగి ప్రారంభిస్తే ఎడిట్ చేసుకోవడం సులభం అవుతుంది. 
  • Magic School ఉపయోగించి ఎలా కంటెంట్ మరియు MCQ తయారుచేయవచ్చో తెలియజేశారు. 
  • Gamma ai ఉపయోగించి క్షణాలలో పవర్ పాయింట్ స్లయిడ్స్ ఎలా తయారుచేయవచ్చో చెప్పారు. ఇవన్నీ చూస్తూ ఉంటే మాయాబజార్ సినిమాలో ప్రియదర్శిని యంత్రం గుర్తుకువచ్చింది సుమండీ!!!! కరోనా తరువాత 'తరగతులు' అన్నీ 'తెర గతులుగా' మారిపోయాయి. ఈ తెరచాటు పాటాలు ఇక రాబోయే రోజుల్లో నిర్మాణాత్మకంగా కొనసాగాలి అంటే వాటికి కొత్త సొబగులు అద్దాల్సిందే కదా!!!!! ఇక రాబోయే రోజుల్లో గురు దేవుళ్ళ స్థానం లో గూగుల్ దేవుళ్ళు రాబోతారు. నాలాంటి వారు 'తెర మరుగు' కాకుండా ఉండాలి అంటే ఇలాంటి డిజిటల్ టూల్స్ మీద కసరత్తు చేయాల్సిందే. నేను చెప్పే points లో power లేకున్నా, ఇక మీదట power point తో నా విద్యార్థుల దగ్గర చెలరేగిపోతాను. 
  • ఇక మీదట సుద్ద ముక్కతో సుద్దులు చెపుతాము అంటే వినే శుంట కాయలు లేరు. నల్ల బోర్డు ఆధారంగా అక్షర సేద్యం చేస్తాను అంటే ఎవరూ పట్టించుకోరు. మనకు change management తెలియాలి. మారి తీరాలి. మనం మారి శిష్యుల తల రాతలు మార్చాలి. 
  • Post lunch session లో స్టూడియో లోకి పిలుచుకు వెళ్లి interactive board ను ఎలా ఉపయోగించాలో తెలియజేశారు. Sticky notes, Mind mapping, Grid లాంటి options ను ఎలా ఉపయోగించాలో నేర్పారు. 
  • వచ్చిన వారికి అందరికీ video చేసేటప్పుడు screen sense , dress sense ఎలా ఉండాలో sense of humor ను కలిపి చెప్పారు. మెషిన్ కు మనిషికి ఉన్న ఏకైక తేడా అల్లా నవ్వుతూ పాటం చెప్పడం. video చేసే సమయం లో కెమెరా వైపు ఎలా చూడాలో చెప్పారు. కెమెరా frame దాటి బయటకు పోకూడదు మరి. ఇది చెప్పే సమయం లో నాకు మా గురువు గుర్తుకు వచ్చాడు. ఆయన అప్పట్లో పాటం చెప్పేటప్పుడు నటరాజు లాగా తరగతి గది మొత్తం శివ తాండవం చేసినట్టు తిరిగేవాడు. ఇప్పుడు ఆయనతో ఈ స్టూడియో లో పాటం చెప్పిస్తే అలా తిరగడానికి స్టూడియో ఎథిక్స్ మరియు ప్రోటోకాల్ ఒప్పుకోవు. 
  • వచ్చిన అందరూ కూడా చక్కగా పది నిముషాల నమూనా videoలు చేశారు. అందరి కళ్ళల్లో ఏదో సంతృప్తి. మా చంద్ర సర్ clap & cut చెపుతూ అధ్యాపకుల పాటాలు వీడియో ఘాట్ చేస్తుంటే నాకైతే బాహుబలి స్టూడియో సెట్ లో ఉన్న ఫీల్ వచ్చేసింది. ఈ కార్యక్రమం ఇంత జనరంజకంగా జరగడానికి కారణం మా JKC Mentor స్వామి. 
  • అధ్యాపకలందరికీ ఒక విషయం తెలిసివచ్చింది. డిజిటల్ టూల్స్ నేర్చుకోకుంటే ఈ కృత్రిమ మేధా యుగం లో రాణించలేము. మారకుంటే సర్స్ కూడా డైనోసర్స్ లాగా అంతరించిపోతారు. మార్పు అనివార్యం అయినప్పుడు అందరికంటే ముందు మారదాం. తరాల తలరాతలను మారుద్దాం. 
                                                        "విద్యయా అమృత మష్నుతే" 
                            
                                                                                                    G L N PRASAD



















                                                Some more photos are attached below 
                                          Dr D Sahadevudu delivering a lecture on Tajmahal 




















                                Above photos belong to the training batch on 14th August 2024 

                                        My newly published book "టీ టైమ్ కథలు"