Tuesday, October 1, 2024

ఒక  రోజంతా అనేక కార్యక్రమాలతో ప్యాకప్ అయిపోవడం అంటే ఏమిటో ఈరోజు అనుభవానికి వచ్చింది. చాలా బిజీగా ఈరోజు గడిచిపోయింది. అసలు బిజీ గా ఎందుకు వుండాలి? నాకు అదో వ్యసనం మరి. ఉదయాన్నే మా డిపార్ట్మెంట్ లో డాక్టర్ పల్లా గిరిధర్ ఆధ్వర్యం లో రక్తదాన శిబిరం జరిగింది. ఇండియన్ రెడ్ క్రాస్ టెక్నీషియన్స్ మరియు డాక్టర్ ప్రకాశ్ 48 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. రక్త నిర్ధారణ పరీక్షలను కూడా మా పీజీ పిల్లలు చేశారు. సుమారు వంద మందికి రక్త సముదాయాల నిర్ధారణ జరిగింది.  కళాశాల ఆంగ్ల అధ్యాపకులు అహ్మద్ రక్త దానం చేశారు. ANSET మేనేజర్ సునీల్ కుమార్ రెడ్డి గారు కూడా రక్త దానం చేశారు. మా పీజీ విద్యార్థులు మరియు డిగ్రీ విద్యార్థులు అనిల్, మహేష్ గౌడ్, కుళ్లాయి స్వామి, విద్యాసాగర్ మరియు సాయి భరత్ ఈ కార్యక్రమానికి వెన్నుదన్ను గా నిలిచారు. 

పదకొండు గంటల ప్రాంతంలో స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో కూడా జీవన్ కుమార్ ఆహ్వానం మేరకు పాల్గొన్నాను. 

తరువాత మధ్యాహ్నం 12 గంటలకు గీతం జూనియర్ కాలేజీ లో ANSET తరుపున శిక్షణా కార్యక్రమానికి హాజరై పోయాను. డాక్టర్ పావని గారు ధర్మవరం నుంచి వచ్చారు. పిల్లలతో సుమారు ఒక గంటకు పైగా జీవన నైపుణ్యాల మీద ఒక interaction జరిగింది. 

తిరిగి మా కాలేజీలో తరగతులు గట్రా , షరా మామూలే. 

ఈరోజు ఒక ధన్యజీవిగా గడిపాను. నా వద్ద ఉన్న ఫోటోస్ ను అనుబంధంగా జతపరుస్తున్నాను 








స్టూడెంట్ విష్ణు సాయి రక్త దానం 

                                                        స్టూడెంట్ రత్నాకర్ రక్త దానం 
మిత్రుడు అహ్మద్ రక్త దానం. 

                                             మేనేజర్ శ్రీ సునీల్ కుమార్ రక్త దానం 





                                       

                                       

                                        

                                        

                                        

                                        

                                       

                                       

                   పై ఫోటోలు అన్నీ గీతం జూనియర్ కాలేజీ లో నా interaction కు సంబంధించినవి. 



   చిత్తశుద్ది తో చెత్త శుద్ధి చేస్తూ స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో పాల్గొన్న ఫోటోస్ 

No comments:

Post a Comment

                                        My newly published book "టీ టైమ్ కథలు"