Inauguration of Cricket League matches of Bhashyam School at PTC
ఈ రోజు ఉదయం 8.30 కు మిత్రుడు బాలకృష్ణ ఫోన్ చేసి, తను ఇప్పుడు భాష్యం స్కూల్ లో పనిచేస్తున్నట్టు తెలియజేసి, వారి స్కూల్ తరపున PTC లో జరగబోయే క్రికెట్ లీగ్ పోటీలకు ముఖ్య అతిథి గా రమ్మని నన్ను ఆహ్వానించాడు. అలాగే అని మాట ఇచ్చాను. నేను మొదట విశాలాంధ్ర కు వెళ్లి అక్కడ పట్టాభిరాం రచించిన "జీవితం ఒక ఉత్సవం" పుస్తకం కొనుక్కొని, అక్కడ నుంచి అలానే PTC కి వెళ్లాను. అక్కడ భాష్యం స్కూల్ జిల్లా స్థాయి అధిపతి రవివర్మ మరియు DSDO అనిల్ కుమార్ అప్పటికే ఉన్నారు. పిల్లలందరూ ఉత్సాహంగా ఆటలలో తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించడానికి వేచి ఉన్నారు. నన్నుమిగిలిన అతిథులతో పాటుగా వేదిక మీదికి ఆహ్వానించారు. పిల్లలకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఆటల గురించి నాకు తెలిసిన విషయాలు ముచ్చటించాను.
- ఆటలలో బృంద నైపుణ్యాలు మెరుగుపడతాయి
- క్రికెట్ ఆటలో మీకు నైపుణ్యం ఉన్న అంశాన్ని ఎంచుకోండి. అంటే బ్యాటింగ్, బౌలింగ్, వికెట్ కీపింగ్ ఇలా. ఇతరుల నైపుణ్యాలను కెప్టెన్ గుర్తించి ప్రోత్సహించాలి.
- నెగ్గడం, తగ్గడం రెండూ నేర్చుకోవాలి.
- ఓటమిని హృదయానికి తీసుకోకూడదు, గెలుపును నెత్తికి ఎక్కించుకోకూడదు.
- వీలైనంత సమయాన్ని practice కు కేటాయించాలి. ఇక్కడ రవివర్మ గారు చెప్పిన మరో అంశం నాకు చాలా నచ్చింది. అదేమంటే తరగతి లోని మిత్రుడి కంటే కూడా క్రీడా మైదానం లోని మిత్రుడు కలకాలం గుర్తుంటాడు అని ఆయన తెలియజేశారు.
- DSDO Anil ఆటలు ఆడడం వలన వచ్చే లాభాలను చక్కగా తెలియజేశారు. ఆటలు relaxation కు చక్కని మార్గాలు. ఆరోగ్యంగా ఉండాలి అంటే కూడా ఆటలే ఏకైక మార్గం.
- చిన్న వయసులో ఆటలోని మెళుకువలను పట్టుకోవాలి. దీని వలన reflexes మెరుగవుతాయి.
- భాష్యం స్కూల్ స్టాఫ్ అందరూ కూడా కార్యక్రమం లో చక్కగా involve అవడం వారి టీం స్పిరిట్ ను తెలియజేసింది.
ప్రయివేట్ విద్యా సంస్థ అయిన భాష్యం క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వడం ఒక మేలి మలుపు.
No comments:
Post a Comment