Friday, January 3, 2025

 ఈ రోజు జిల్లా స్థాయి సైన్స్ ప్రదర్శన కు నేను న్యాయ నిర్ణేతగా వెళ్ళడం జరిగింది. రాప్తాడు స్కూల్ లో ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. నాతో పాటుగా శ్రీదేవి, నాగ శశికళ మేడమ్స్ , రఘురాములు , కిరణ్ మరియు శర్మ సర్ వచ్చారు. నేను మరియు శర్మ గారు గ్రూప్ ప్రాజెక్ట్స్ ను పరిశీలించాము. 35 వరకు నమూనాలు వచ్చాయి. మిగిలిన వారిని individual మరియు టీచర్ ప్రాజెక్ట్స్ కు న్యాయ నిర్ణేతలుగా కేటాయించారు. ఉదయం అల్పాహారం సేవించి judgement కు ఉపక్రమించాము. పిల్లలందరూ చక్కటి స్పూర్తితో నమూనాలు తయారు చేశారు. ఇంత శ్రమకోర్చి పిల్లలను తీర్చి దిద్దినందుకు వారి గైడ్ టీచర్లను అభినందించాలి. 

judgement ముగిసిన తరువాత భోజనం చేసాము. మధ్యాహ్నం మూడింటికల్లా జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారితో పాటుగా MP గారు , రాప్తాడు MLA పరిటాల సునీత గారు వచ్చారు. వీరందరితో నేను వేదిక పంచుకోవడం ఒక చక్కటి ఫీల్ ని ఇచ్చింది. ఈ ఫోటోలు అన్నీ ఈ కార్యక్రమానికి చెందినవే మరి. 




































No comments:

Post a Comment

                                        My newly published book "టీ టైమ్ కథలు"