ఈ రోజు అనుకోకుండా ఒక విచిత్రం జరిగింది. అదేమంటే నన్ను mathematics day ( ఇది అనేక కారణాల వల్ల ఈ రోజు అంటే జనవరి 4 , 2025 వ తేదీన జరిగింది ) కు ప్రధాన వక్త గా సోదరుడు ఆనంద భాస్కర్ పిలిచారు. ' నాకు గణితమే రాదు కదా ఏమి చెప్పగలను? ' అని అడిగాను. ' గణితం రాకపోవడం వలన నీ జీవితం ఎలా మారింది?అనేది చెప్పు' అని సలహా ఇచ్చాడు మిత్రుడు. సరే అని ఒప్పేసుకుని ఉదయం మా కళాశాలకు వెళ్లాను. స్టూడెంట్స్ ఎవరూ కనిపించలేదు కానీ స్కూల్ పిల్లలు అందరూ వందల్లో మా కళాశాలకు వస్తూ కనిపించారు. అప్పుడు గుర్తుకు వచ్చింది మా కళాశాల మైదానం లో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం జరగబోతున్నదని. నిన్న ఆ కార్యక్రమ ఏర్పాట్లు పర్యవేక్షించడానికి పోలీస్ ట్రైనింగ్ సెంటర్ Additional Superintendent of Police శ్రీ మల్లికార్జున వర్మ గారు పిలిస్తే కూడా వెళ్లాను. నాకిచ్చిన VIP పాసులను శ్రీదేవి మరియు P S లక్ష్మీ మేడమ్స్ కు ఇచ్చిన విషయం కూడా స్మృతి పథం లో మెదిలింది. నేను ఆ కార్యక్రమాన్ని దూరం నుండి తిలకించాను.
మధ్యాహ్నం 2 గంటలకు డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్ చేరుకున్నాను. నాతో పాటు రసాయన శాస్త్ర అధ్యాపకుడు కిరణ్ కూడా వచ్చాడు. కార్యక్రమం చక్కగా జరిగింది. లెక్కల విషయం లో శూన్యం తో మొదలైన నా ప్రయాణం ఇలా పూర్ణం తో ముగిసిందని చెప్పి ముక్తాయించాను. కిరణ్ Fibonacci sequence గురించి చక్కగా వివరించాడు. అలా ఈ రోజు కార్యక్రమంలో నేను చాలా కొత్త విషయాలను నేర్చుకున్నాను.
No comments:
Post a Comment