Monday, August 10, 2026

                                                    NASHA MUKTH BHARATH RALLY          

                                   








ఈ రోజు నేను మా అధ్యాపకులు మరియు విద్యార్థులతో పాటు నషా ముక్త భారత్ ర్యాలీ లో పాల్గొనడం జరిగింది. సుమారు వెయ్యి మంది విద్యార్థులు పాల్గొన్న ఈ ర్యాలీ బ్రహ్మ కుమారీస్ సంస్థ సహకారంతో నిర్వహించబడింది. జిల్లా కలెక్టర్ గౌరవనీయ ఆనంద్ IAS దీనిని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పద్మ శ్రీ గారు క్రియాశీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా బృందా మేడమ్ గారి ఆధ్వర్యంలో విద్యార్థులు మాస్క్ లు ధరించి చేసిన ప్రదర్శన అందరినీ ఆకర్షించింది. కలెక్టర్ గారు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. తరువాత టవర్ క్లాక్ వరకు విద్యార్థులతో ర్యాలీగా వెళ్లి అక్కడ నషా ముక్త భారత్ సాధనకు అందరం కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేసాము. మాదక ద్రవ్యాలకు మరియు మత్తును కలిగించే ఇతర పదార్థాలకు యువత దూరంగా ఉండాలి. మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే అది క్రుంగుబాటుకు గురిచేస్తుంది. ఈ మధ్య అనేక మాధ్యమాల ప్రభావం వలన యువత మాదక ద్రవ్యాల వైపు ఆకర్షితులు అవుతున్నారు. వీటి వలన brain chemistry మారుతుంది.  వీటి వాడకం hallucinations ను (విభ్రమలను) కలుగజేస్తుంది. Addiction కు గురి కావడం వలన ఇవి లేకుండా ఉండలేని స్థితి వస్తుంది. మాదక ద్రవ్యాల సేవనానికి అలవాటు పడితే నియంత్రణ కోల్పోయి నేరాలు, ఘోరాలకు పాల్పడతారు. జీవితం మొత్తం పగటి కలలతో గడిపేస్తారు. కేంద్ర నాడీ వ్యవస్థ మీద మాదక ద్రవ్యాలు ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఆత్మహత్యా ధోరణులు ప్రబలుతాయి. చివరకు చికిత్స కోసం Deaddiction center లను ఆశ్రయించవలసి వస్తుంది. ఇవన్నీ యువతను ఆర్థికంగా క్రుంగదీస్తాయి. ఈ అవగాహన కోసమే ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. చరిత్ర అధ్యాపకులు నాగభూషణం, కామర్స్ అధ్యాపకులు శ్రీనివాసులు మరియు రాజనీతి శాస్త్ర అధ్యాపకులు సూగప్ప ఈ ర్యాలీ విజయవంతం కావడానికి తమదైన సహకారాన్ని అందించారు. ఉరవకొండ కళాశాల NSS Program Officer విష్ణుప్రియ కూడా హాజరయ్యారు. 
ఈ ఫోటోలు అన్నీ కూడా బ్రహ్మ కుమారీస్ సంస్థ సభ్యులు మరియు మిత్రులు అయిన నీలగిరి కృష్ణమూర్తి గారు ( ప్రసన్న) పంపారు. వారికి ధన్యవాదాలు. టవర్ క్లాక్ వద్ద నషా ముక్త భారత్ సాధన కోసం చేసిన ప్రతిజ్ఞ వీడియో ఇంస్టా వేదిక మీద అప్పుడే 24000 మంది చూడడం జరిగింది. 
స్వస్తి 

 

No comments:

Post a Comment

                                                     NASHA MUKTH BHARATH RALLY                                                ఈ రోజు నేను మా...