Friday, July 31, 2026

  జంతుశాస్త్ర విద్యార్థులకు క్విజ్ పోటీలు 

జులై నెలలో ఒక రోజు మా ద్వితీయ సంవత్సరం జువాలజీ మేజర్ విద్యార్థులకు అనుకోకుండా ఒక రోజు క్విజ్ పోటీలు నిర్వహించాను. శ్రీదేవి మేడమ్ కూడా పాల్గొన్నారు. అనుకోకుండా జరిగిపోయింది కాబట్టి తేదీ గుర్తుకులేదు. క్విజ్ పోటీల కోసం విద్యార్థులను ఐదు బృందాలుగా విడగొట్టాను. జీవ పరిణామం అంశం మరియు పరిణామ సిద్దాంతాలు అనే అంశం మీద పోటీలు నిర్వహించాను. ఇలాంటి పోటీల వలన విద్యార్థులకు ఈ క్రింది లాభాలు ఉంటాయని నేను అనుకుంటాను. 

  • విద్యార్థులలో బృంద స్పూర్తి కలుగుతుంది 
  • ఓటమిని ఉదాత్తంగా ఎదుర్కొనే తెగువ వస్తుంది. 
  • ఇతరుల విజయానికి కూడా తోడ్పడే ఔదార్యం వస్తుంది. దీనినే win / win attitude అంటారు. 
  • Success management తెలుస్తుంది. నిజానికి  ఓటమి మేలు చేస్తుంది. విజయం చెడు చేస్తుంది. ఇది అర్థమైన రోజు గెలుపు మీద ధ్యాస కాకుండా, పని మీద ఫోకస్ పెట్టాలనే విషయం అర్థం అవుతుంది
  • బృంద చర్చల ద్వారా ఇతరుల అభిప్రాయాలను  గౌరవించే  సంస్కారం అలవడుతుంది 
  • దేనినైనా చర్చల ద్వారా సాధించుకోవచ్చు అని తెలుస్తుంది. 
ప్రథమ మరియు ద్వితీయ స్థానాలలో నిలిచిన బృందాల  విద్యార్థులకు పట్టాభిరామ్ గారి పుస్తకాలు బహుమతులుగా ఇచ్చాను. 



AS A CHAIR PERSON FOR A SESSION IN INTERNATIONAL CONFERENCE ON ENSURING GLOBAL FOOD SAFETY -ICEGFS It is my previlege to chair a session in ...