Thursday, January 18, 2024


















 ఈ రోజు కాలేజీ పునః ప్రారంభం. ఉదయాన్నే 11 గంటలకు స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ ముగించుకుని, తరువాత నా పూర్వ కార్యక్షేత్రం అయిన కల్యాణదుర్గం కాలేజీ నాక్ పనిలో ఇతోధికంగా సహకరించాను. తరువాత మధ్యాహ్నం మూడింటికి శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయ క్యాంపస్ లోని ఔషధ కళాశాలలో జాతీయ యువజన వారోత్సవాలకు ముఖ్య అతిథిగా వెళ్ళాను. ఈ కార్యక్రమ రూపకర్త నెహ్రూ యువ కేంద్ర శ్రీనివాసులు గారు. బయో టెక్నాలజీ ప్రొఫెసర్ మురళీధర్ మరియు ఔషధ కళాశాల ప్రిన్సిపల్ సోమశేఖర్ గార్ల తో వేదిక పంచుకోవడం జరిగింది. ఔషధ రంగంలో ఉన్న యువత ఎలాంటి నైపుణ్యాలు సంతరించుకోవాలో కొద్దిగా తెలియజేయడం జరిగింది. 

అక్కడి నుంచి సీడ్ DMLT కళాశాలకు పయనం. అక్కడ ఓ 15 మంది విద్యార్థులతో పీస్ డే celebrations. చాలా సేపు మాట్లాడాము అందరం. వాళ్ళ పీస్ పోగొట్టామా కొంపదీసి!!!! విద్యార్థులందరూ చక్కగా విన్నారు. జనాలను కలుస్తూ ఉంటేనే నాకు మనశ్శాంతి మరి.  

No comments:

Post a Comment

  My Books at Hyderabad Book fair