Friday, January 12, 2024


National Youth Day Celebrations at Central University Anantapur on 12th January 2024 













 నేను అనంతపురం ఆర్ట్స్ కళాశాల లో డిగ్రీ చేసే రోజుల్లో హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయం లో పి జీ కోర్సు చేయాలని కలలుగనే వాడిని. కానీ సివిల్ సర్వీసెస్ మీద నాకున్న వ్యామోహం దానిని dominate చేయడంతో కనీసం ప్రవేశ పరీక్ష కూడా రాయలేక పోయాను. అప్పట్లో మా క్లాస్ మెట్ ఆప్యాయ ఇక్కడే biochemistry లో పి జీ చేరాడు. ఒకసారి వాడిని చూడడానికి ఆపసోపాలు పడి సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్ కు వెళ్ళాను. అప్పట్లో సిటీ బస్ లు కూడా తక్కువగా ఉండేవి. అలా నా ప్రాప్తం పరిధి లోనికి రాని సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురం క్యాంపస్ లో జాతీయ యువజనోత్సవాలకు నన్ను అతిథిగా పిలిచారు NSS Programme Coordinator ప్రొఫెసర్ గరికపాటి గురుజాడ గారు ( ఈయన ప్రముఖ వక్త గరికపాటి నరసింహ రావు గారి తనయుడు ) . నాకు ఈ అవకాశం నెహ్రూ యువ కేంద్ర DDO శ్రీనివాసులు వలన వచ్చింది. క్యాంపస్ లోకి చాలా ఆనందంగా ప్రవేశించాను. డీన్ ఛాంబర్ లో  ఇచ్చిన కాన్వా బ్రాండ్ గ్రీన్ ఛాయ్ అదుర్స్. డీన్ మేడమ్ ప్రొఫెసర్ షీలా రెడ్డి గారు నన్ను, ANSET Manager సునీల్ కుమార్ రెడ్డి గారిని, మా గురువు రమేష్ నారాయణ గారిని ఎంతో ఆదరించారు. మా పరోక్ష గురువు రమేష్ నారాయణ గారు రచించిన ఒక పది పుస్తకాలను షీలా రెడ్డి గారి ద్వారా నాకు బహుకరించారు. ఈ పుస్తక ప్రసాదం అందుకుంటూ రమేష్ నారాయణ గారితో ఓ మాట అన్నాను. " మీ తరం వేసిన అక్షరాల భిక్ష తో నా జోలె నిండిపోయింది" అన్న నా మాటలకు ఆయన అనుగ్రహపూర్వకంగా నవ్వారు. ఈ మాటలు నేను ఎక్కడ చదివానో గుర్తుకులేదు. అప్పుడు నాకు స్పురించాయి అంతే. తరువాత కార్యక్రమం జరుగుతున్న ఆడిటోరియం కు వెళ్ళాము. మీకో అనుమానం రావచ్చు. "నీవు యూత్ ఏంటిరా బాబూ?" అని. తెల్ల జుట్టు వచ్చినంత మాత్రాన యూత్ కాకుండా పోతామా ఏంటి? Age is only number you know. ఇదే విషయం వేదిక మీద చెప్పాను. జ్యోతి ప్రజ్వలన తో కార్యక్రమం మొదలయ్యింది. నా ప్రసంగం తరువాత వైస్ ఛాన్సలర్ గారు ఆన్లైన్ లో మాట్లాడారు. తరువాత మా గురువు రమేష్ నారాయణ గారు, సునీల్ కుమార్ రెడ్డి గారు తమ సందేశాలు ఇచ్చారు. చివరగా డిప్యూటీ మేయర్ కోగటం విజయ భాస్కర్ రెడ్డి గారు చాలా చక్కటి భావోద్వేగం తో ప్రసంగించారు. విద్యార్థులకు బహుమతి ప్రదానం చేసిన తరువాత మాకు సన్మానాలతో కార్యక్రమం ముగిసింది. తరువాత మోడీ గారి ప్రసంగ కార్యక్రమాన్ని ఆన్లైన్ లో మేమంతా వీక్షించాము. 

 


No comments:

Post a Comment

                                        My newly published book "టీ టైమ్ కథలు"