Drug Abuse in Youth and Prevention
నెహ్రూ యువ కేంద్రం తో నా బంధం ఈ నాటిది కాదు. 2014 నుంచి కొనసాగుతోంది. కలిసి కొన్ని వందల కార్యక్రమాలు చేశాము. వేల కొద్ది విద్యార్థులను కలిసి మాట్లాడాము. అలాగే ఈ రోజు కూడా
( అక్టోబర్ 17 2024 వ తేదీ ) మీది మధ్యాహ్నం 12 ఇంటికి ఒక సెషన్ ఉంటుంది. యువత మరియు మాదకద్రవ్యాల వ్యసనం మీద మాట్లాడాలి అని మిత్రుడు శ్రీనివాసులు గారు చెప్పారు. నేను ఆ రోజు పోలీస్ శిక్షణా కార్యక్రమం చూసుకుని NYK ఆఫీసుకు ఠంచను గా చేరిపోయాను. 25 మంది వరకు యువత ఉన్నారు. వారికి సైక్రియాట్రిస్ట్ డాక్టర్ బాలాజీ వివిధ డ్రగ్స్ మరియు ఆల్కాహాల్స్ గురించి చక్కగా అప్పటికే వివరించారట.
నేను ఓపియాయిడ్స్, కన్నాబినాయిడ్స్, కోక్ , సిగరెట్ మరియు ఆల్కహాల్ ఇచ్చే మత్తు, గమ్మత్తు ల గురించి చర్చించాను. ఆ మత్తును ఎలా వదిలించుకోవాలో కూడా విశదపరిచాను. తరువాత సాయి ట్రస్ట్ అధినేత విజయ సాయి కి నా పుస్తకం "నా కోరా రాతలు" NYK మిత్రులు అందజేశారు. చివరగా నా సన్మానం తో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.