Monday, July 22, 2024




తిరిగి చాలా కాలం అయ్యింది కదా అని ఉన్నట్టుండి నేను, నా అర్ధాంగి, శ్రీదేవి మేడం బాదామి, పట్టడకల్, ఐహోలె, బనశంకరి మరియు హంపీ చూసి వద్దామని ప్లాన్ వేశాము. మాకు పూల్ సింగ్ తోడయ్యాడు. ట్రిప్ రెండు రోజులు అనుకున్నాము. జులై 21 వ తేదీన ఉదయాన్నే 5 గంటలకు బయలుదేరాలని నిర్ణయించుకుని డ్రైవర్ బాషాకు చెప్పేసాను. ముందు రోజే weather report చూశాను. మేము చూడబోయే ప్రదేశాలలో రాబోయే పది రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుందో తెలుసుకున్నాను. తుఫాన్ వల్ల వర్ష సూచన ఉన్నప్పటికీ అది ప్రమాదకర స్థాయి లో లేదు అని తెలిసింది. కానీ ఎందుకన్నా మంచిదని కారులో గొడుగులు రెండు వేసుకున్నాము. కియా కారెన్స్ లో మా ప్రయాణం. జులై 21 వ తేదీ ఉదయం 5 గంటలకు శ్రీదేవి మేడం, పూల్ సింగ్ డ్రైవరు బాషా అపార్ట్మెంట్ వద్దకు వచ్చేశారు. ఇక నేను కూడా నా శ్రీమతి తో కలిసి కారు ఎక్కేసాను. హోస్పేట మార్గం లో హైవే లో ఉన్న నందగోకుల హోటల్ లో అందరూ ఇడ్లీ లాగించాము. బట్ట మీద ఉడికించిన ఇడ్లీ, దానికి ఆదరువుగా ఇచ్చిన సాంబార్ చాలా బాగున్నాయి. డీసెల్ కూడా పట్టించాను. ఎప్పటికప్పుడు ఖర్చు చేస్తున్న అమౌంట్ నమోదు చేసుకోవడం మొదలెట్టాను. తరువాత రెండు గంటలు ప్రయాణించి బాదామీ చేరుకున్నాము. ఆ గుహాలయాలు చూసి మేమందరం మైమరిచి, మా వయసు మరచి వాటిని చూసాము. చాలా ఎత్తులో ఉన్నాయి ఈ ఆలయాలు. వయసు పైబడితే మీరు ఇలాంటివి చూడలేరు. అందుకే వయసు ఉన్నప్పుడే తిరిగేయండి. మీకు వీలైతేనే సుమా!!!!! బాధ్యతలు ఉంటే మాత్రం నా లాగా బలాదూర్ తిరగకండి. అలా అని ఎన్ని బాధ్యతలు ఉన్నా సరే పూర్తిగా తిరగడం మానేయకండి. నాలుగు గుహాలయాలను చక్కగా ఫోటోస్ తీసుకుంటూ చూసేసాము. గైడ్ తో అవసరం రాలేదు. గుహాలయాల నుంచి చూస్తే క్రింద అగస్త్య లేక్ కనిపిస్తుంది. ఈ గుహాలయాలను చూడడం మోకాళ్ళకు మంచి వ్యాయామం. 
ఇక అక్కడ నుంచి పట్టడకల్ కు వెళ్లాము. బాదామీ నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. మేము పోయే సరికి ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. ముందు జాగ్రత్తగా గొడుగులు పట్టుకెళ్ళాము కదా!!! తడవకుండా పట్టడకల్ చూసేసాము. వీటి శిల్ప కళాచాతుర్యం చూస్తే ఎవరికైనా అబ్బురమనిపిస్తుంది.  అక్కడి నుంచి ఐహోలె చేరుకున్నాము. అక్కడ రావణ పడి, దుర్గా temple complex చూసుకుని బనశంకరి చేరుకున్నాము. ఇక్కడ అమ్మవారి దర్శనం అధ్బుతంగా జరిగింది. ఈ ప్రాంతాలలో కనడ మరియు మరాటి mixed culture కనిపిస్తుంది. గుడి బయట ఎవరో ఆమె బుట్టలో పెట్టుకుని సద్ద మరియు జొన్న రొట్టెలు మమ్మల్ని పిలిచి మరీ పెట్టింది. చివరలో డబ్బు తీసుకుందనుకోండి, అది వేరే విషయం. ఆమె రొట్టెలు వడ్డించేటప్పుడు ఆమె ఆప్యాయత చూస్తుంటే, గుడి లోపలి అమ్మవారు బయటకు వచ్చి వడ్డిస్తూ ఉన్నట్టుగా అనిపించింది. ఇదెక్కడి ఎమోషన్స్ రా అనుకోకండి. ఆ మాత్రం ఎమోషన్స్ లేకుంటే, ప్రయాణాలు చేయకండి. 

చివరికి రాత్రి 9 గంటలకు TB dam లో వైకుంఠ గెస్ట్ హౌస్ కు చేరుకున్నాము. మా కెమిస్ట్రీ లెక్చరర్ భర్త అక్కడ ఇంజనీర్ గా పనిచేస్తూ ఉండడం తో మాకు రెండు గదులు కేటాయించారు. గదులు పెద్దగా, శుభ్రంగా ఉన్నాయి. మాకు చపాతీలు మరియు పన్నీర్ కర్రీ తెచ్చి ఇచ్చారు. తినేసాము. ఒక్కో రూములో మూడేసి మంచాలు. ఎప్పుడు పండుకున్నామో తెలియదు. ఒళ్లు తెలియని నిద్ర కమ్మేసింది. నేను లేచేసరికి ఉదయం 6 అయ్యింది. 
ఆ ఉదయం ఫ్రెష్ అప్ అయిన తరువాత dam చూడడం ఒక మధురానుభూతి. తుంగభద్ర పరవళ్లు తొక్కుతోంది. సముద్రం లాగా పరుచుకొని ఉంది. ఏ నదినైనా దగ్గరి నుంచి చూడడం ఒక దివ్యానుభవం. 'గంగా స్నానం, తుంగా పానం' అని మా తాత చెప్పడం నాకు ఇంకా గుర్తు. ప్రతి నదీ కూడా ఎన్నో నాగరికతలను చూసి ఉంటుంది. అసలు నది లేనిది నాగరికత ఎక్కడి నుంచి వస్తుంది? నదీ హృదయాన్ని, నారీ హృదయాన్ని అంచనా వేయలేము కదా! 
తరువాత ఇక్కడి నుంచి 18 కిలోమీటర్ల దూరం ఉన్న హంపీ కి వెళ్లాము. హంపీని చాలా మంది పాడుపడ్డ కొంప తో పోలుస్తారు. కానీ ఈ శిథిల నగరపు హొయలు చూస్తే, ఎవరైనా ఇట్టే ఫిదా అయిపోతారు. నాకిది నాలుగో సారి హంపీ దర్శనం. ఈ సారి మాకు దొరికిన గైడ్ పేరు మహేంద్ర. తన ఆటో లో మమ్మల్ని హంపీ మొత్తం తిప్పి చూపాడు. హంపీ చరిత్ర మాకు చెప్పాలనే తాపత్రయం అణువణువునా నింపుకున్న యువకుడతడు. 'సర్ ! రేపు నా పెళ్లి!' అంటూనే మాకు హంపీని మొత్తం పరిచయం చేశాడు. ఉద్యోగం పట్ల passion అంటే అలా ఉండాలి. అసలు ఎవరికైనా హంపీ ని చూసిన తరువాత ఇంక ఏ ప్రదేశాన్ని, వ్యక్తినీ ప్రేమించ బుద్ది కాదు. శిథిలాలలో, శిశిరాలలో కూడా ఇంత సౌందర్యం ఉందనే విషయం హంపీని చూస్తేనే  తెలుస్తుంది. మొదటగా ముష్కరుల దాడిలో చేయి విరిగిన యోగా నరసింహ స్వామి ని చూసాము. ఓడ్యాణ బంధం లో ఎంత రాజసం ఒలక బోస్తున్నాడో ఈ స్వామి ఇప్పటికీ. కళ్లు క్రోధం తో ఉబికి ఉన్నాయి. కాలానికి తలవంచి, ముష్కరులకు తన చేతిని అప్పగించిన ఔదార్యం ఆ మూర్తి లో కనిపించింది. ఒక video ఇంస్టా రీల్ కోసం అక్కడే తీసుకున్నాను. ఇక్కడ నరసింహ స్వామి విగ్రహం భిన్నం అయినందు వల్ల పూజాదికాలు లేవు. హంపీ నిండా ఎక్కువ భాగం మూర్తి లేని గుళ్లే. 
దీని పక్కనే బడవి శివ లింగం.  బడవి అంటే కన్నడ భాష లో పేద వనిత అని అర్థం. పేద మహిళ పూజించిన శివ లింగం కాబట్టి దీనిని బడవి శివ లింగం అంటారు. దాని చుట్టూ నీళ్లు ఉంటాయి. మేము దర్శించుకునే సమయానికి శివ లింగం మీద కొండ ముచ్చు కూచుని ఉంది. నాకైతే అది చూస్తే బిడ్డలను నెత్తి కెక్కిచుకున్న తండ్రి గుర్తుకువచ్చాడు. అన్నిటినీ, అందరినీ తలకెత్తు కోవడం మన శివయ్యకు అలవాటే కదా! వీరభద్ర స్వామి ని కూడా చూసాము. అంత అధ్బుతమైన వీరభద్రుడి విగ్రహం నేను ఎక్కడా చూడలేదు. 
తరువాత అక్కడి నుంచి ఏనుగుల మహల్, మ్యూజియం దర్శించాము. రాణులు నివాసం ఉండే మహల్ చూసాము. మొదటిసారి దర్శిస్తూ ఉండడం వలన పూల్ సింగ్ మైమరచి చూస్తూ ఉన్నాడు. నాకైతే హంపీ లో రాణుల కంటే కూడా సానులే ఉజ్వలమైన జీవితాన్ని అనుభవించి ఉంటారని అనిపిస్తుంది. రాణులు పేరుకు దొరసానులే గానీ, సానుల ముందు వీరి వైభవం దిగదుడుపే. గజశాల majestic గా ఉంది.  పహారాకు ఉపయోగించే టవర్ కూడా చూసాము. 
ఇక మా పయనం హజారీ రామ స్వామి మందిరం వైపు సాగింది. రామాయణ కథనాన్ని వెయ్యి రీతుల తనలో కుడ్య శిల్పాలుగా ఇముడ్చుకున్న వన్నె చిన్నెలు దీనివి. అప్పటి శిల్పులు కళను తపస్సుగా భావించారు. ప్రతి శిల్పం లో ఓ ప్రత్యేక భంగిమ. అక్కడ రాముడి విగ్రహం లేకున్నా నేను రాముడికి సొంతమైన త్రిభంగి ముద్రలో స్వామిని ఊహించుకుని పరవశించాను. 
హంపీ లో చూడదగ్గ మరొక ప్రదేశం నవ రాత్రి దిబ్బ. అక్కడ ఎంతో మంది నాట్య కత్తెలు దసరా ఉత్సవాలలో నృత్యం చేస్తూ ఉంటే, పండిత, పామరులు పరవశించి చూసేవారట. అది లౌల్యం గా ఈ తరానికి అనిపించవచ్చు గానీ, నా  దృష్టి లో ఇది ఒక కళా పిపాస. అప్పట్లో అగణికంగా ఉన్న గణికలు అందరూ అక్కడ నాట్యం చేస్తున్నట్టు, వారికి నేను నృత్యం నేర్పుతున్నట్టు ఊహించుకున్నాను. ఆ గణికల మువ్వల సవ్వళ్లు నా మదిలో ఘల్లుమని మోగాయి. వీరి లేపనాల కోసమే ఒక బజారు వెలిసింది అప్పటి హంపీలో. ఈ దసరా దిబ్బ దగ్గరే ఒక కోనేరు. ఈ కోనేటి మెట్ల వైభవం చూస్తే ఎంతో ముచ్చట వేసింది. అసలు ఏమీ ఆశించకుండా, ప్రతి పనిని ఇంత కళాత్మకంగా అప్పటి వారు ఎలా చేశారు? వీళ్లందరూ కేవలం ఆత్మ సంతృప్తి కోసం పనిచేసి ఉంటారు. ఈ శిలా హృదయాలలో ఆ శిల్పుల ఆత్మలు ఇప్పటికీ కదులుతూనే ఉన్నట్టు నాకు అనిపించింది. 
ఇప్పుడు మా పయనం నవ బృందావన వైపు సాగింది. మధ్యలో విఠల స్వామి దేవాలయాన్ని బ్యాటరీ వాహనం లో వెళ్లి చూసి వచ్చాము. అక్కడ ఏక శిలా రథం ఉంది. దానిలో ఒకప్పుడు పండరంగడి ఆరాధనోత్సవాలు జరిగేవట. పండరీ పురం లో ఇప్పుడు ఉన్న పాండురంగడి విగ్రహం అసలు హంపీ లోదేనని మా గైడ్ చెప్పడం ఒక అతిశయోక్తి అనిపించింది. ఇక్కడనే అందరం నిమ్మ సోడాలు పట్టించాము. నేనైతే ఏకంగా రెండేసి బుడ్లు లాగించాను. ద్రవాలు తీసుకుంటే శరీరానికి ఏ ఉపద్రవాలు రావని నా నమ్మకం. 
నవ బృందావనం చూడాలి అంటే తుంగభద్ర ను మోటార్ బోట్ లో దాటుకువెళ్లాలి. అక్కడకు వెళ్లేటప్పుడు ఒక నెమలి తన క్రేంకారాన్ని షడ్జమం లో వినిపించింది మాకు. అది శుభ సూచకంగా భావిస్తూ నవ బృందావన చేరుకున్నాము. అక్కడ విష్ణుసహస్ర నామ పారాయణ చేస్తూ అందరూ ప్రదక్షిణలు చేశాము . ఆ రోజు వ్యాస రాయల జన్మ నక్షత్రం అట. 
ఇక్కడ నుంచి కడలే కాళు గణేశ వద్దకు వెళ్లాము. చివరగా విరూపాక్ష ఆలయం వద్ద మమ్మల్ని వదిలేసి మా గైడ్ మహేంద్ర సెలవు పుచ్చుకున్నాడు. అతనికి రూపాయలు 1500/-  రుసుము చెల్లించాము. తరువాత గుడి లోపలికి వెళ్లి విరూపాక్షుడి దర్శనం, భువనేశ్వరి మరియు పంపా దేవి దర్శనం చేసుకుని బయటకు వచ్చే సమయానికి, మా డ్రైవరు బాషా మా కియా కారెన్స్ ను తీసుకుని మా కోసం వేచి ఉండడం కనిపించింది. 
అనంతపురం తిరుగు ప్రయాణానికి కారు ఎక్కి కూచున్న మాకందరికీ అప్పుడు ఒక్కసారిగా ఆకలి గుర్తుకు వచ్చింది. హోటళ్లు మూసి ఉండడం వలన కమలాపురం దాటిన తరువాత ఏదో ఓ చిన్న బంకులో పచ్చి మిరపకాయలు దట్టించిన బొరుగులు, బజ్జీలు తిని ఉపశమనం పొందాము. తరువాత మేము బళ్ళారి లో తిన్న దావణగరే బెణ్ణే దోసె అదుర్స్. ఉరవకొండ కు దగ్గరగా ఉన్న చేళ్ళదుర్తి లో ఎర్రి తాత సమాధిని చూసుకుని రాత్రి ఎనిమిది గంటలకు మా ఇళ్లు చేరుకున్నాము. 
మా టూర్ ఇంత విజయవంతం కావడానికి కారణాలు 
1. ఒకే విధమైన మనస్తత్వం ఉన్నవారు కలిసి ప్రయాణించడం 
2. అందరికీ చరిత్ర మీద మక్కువ, గౌరవం ఉండడం 
3. అందరికీ అనుష్టానం అంటే ఇష్టం ఉండడం 
4. ముందస్తు సన్నాహాలు శాస్త్రీయంగా చేసుకోవడం 
5. మితాహారం, హితాహారం తీసుకోవడం 
6. ఎవరికీ ఉద్యోగ జీవితంలో ఎటువంటి హడావుడీ లేకపోవడం. 
నేను అందరికీ ఇచ్చే సలహా ఏమంటే  
1. శరీరం సహకరించినప్పుడే, బాగా తిరగండి . 
2. డబ్బును ఆదా చేయడం కోసం మీ యాత్రా కుతూహలాన్ని చంపుకోకండి 
3. అధికారులతో, పని ఒత్తిడి ఉన్న వారితో కలిసి ప్రయాణించకండి. మధ్యలోనే తిరిగి రావలసి రావొచ్చు. 
4. చిరాకు పడే వారి తో కలిసి ప్రయాణం నిషిద్దం సుమా!!
5. తనికెళ్ళ భరణి గారి మాటలతో ముగిస్తాను. మళ్లా ఈ తోవరాము, మళ్ళొచ్చినా  మనుషులం కాము. కాబట్టి సత్తువ ఉండగానే, వీలైనన్ని ప్రదేశాలు చూసేయండి. 
మరో ట్రావెలాగ్ తో మళ్ళీ కలుద్దాం.  



























































 

Saturday, July 20, 2024

                                  Board of Studies Meeting at KSN GDC (A) for Women 

Several photos capture the proceedings of the Board of Studies (BoS) meeting held at KSN Government Degree College (A) for Women on July 20, 2024. The meeting encompassed discussions for the Zoology and Paramedical Technology streams' 3rd and 4th Semesters for the academic year 2024-25. Representing our college, Dr. Giridhar, Dr. B. Sreedevi, and myself participated, along with Smt. B. Jameela Beebi from SKP GDC (A) Guntakal.

The meeting agenda included:

  1. Designing the curriculum and subsequent discussions.
  2. Proposed revisions to the curriculum.
  3. Approval of the question paper pattern.
  4. Designing questions based on Bloom's taxonomy.

The sessions, divided into pre-lunch and post-lunch segments, were successfully conducted.

                             Board Members discussing the curriculum and its relevance 



                                                Board Members enjoying the lunch 

Wednesday, July 17, 2024

 


Prithvi Innovation Video related to my live on Insta on 19th July 2024 






Tuesday, July 16, 2024

                                                         GLOBAL SNAKES DAY 

పాము అంటే పది ఆమడలు పరిగెత్తే నేను ఈ రోజు మా కళాశాల లో మరియు ఒక ప్రఖ్యాతమైన స్కూల్ లో  Global Snakes Day ను SARISHA WILDLIFE AND ECOLOGY SOCIETY వారి సహకారంతో నిర్వహించాను. దీనిలో మా అధ్యాపకులు డాక్టర్ బసిరెడ్డి శ్రీదేవి, అహ్మద్ మరియు Science coordinator ఆనంద భాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మా విద్యార్థులకు మరియు స్కూల్ బుడతలకు పాముల పట్ల అవగాహన కల్పించాము. పాము అంటే భయపడవలసిన పనిలేదని, వాటిని విచక్షణా రహితంగా చంపకూడదని చెప్పాము. మేము బోధించిన అంశాలు ఈ క్రింద ఇస్తున్నాను. 

పాములు విజయవంతమైన సరీసృపాలు. 

పర్శుకలు మరియు పర్శుకాంతర కండరాలను ఉపయోగించి చలిస్తాయి 

పాములు పాలు తాగవు. దీనికి కారణం వాటిలో రెనిన్ అనే ఎంజైమ్ లేకపోవడమే. 

నాగ పంచమి మరియు నాగుల చవితి పండుగల ఆంతర్యం పాములను సంరక్షించడమే. 

పాములు గాలిలో వచ్చే ఏ శబ్ధ తరంగాలను వినలేవు. కానీ అవి భూమి ద్వారా శబ్ద తరంగాలను      గ్రహిస్తాయి. కాబట్టి పాముల దగ్గరికి వెళ్లి, 'నాగ స్వరం ఊదేస్తా, నాలో నిను కలిపేస్తా' అని పాడితే  వాటికి తిక్క రేగి మనల్ని కాటేస్తాయి. మన దేశంలో విషయుక్త మరియు విషయ రహిత      సర్పాల నిష్పత్తి 1:10. మనకు ఎక్కువగా కనపడే విషయుక్త సర్పాలు నాగుపాములు, కట్ల      పాములు,  పొడ పాములు, సముద్ర సర్పాలు మరియు ప్రవాళ సర్పాలు. 

వీటిలో నాగుపాములు అంటే అందరికీ ఆరాధనా, భయమూ రెండూనూ. పాముకు కాళ్లు లేవు కాబట్టి మీరు వాటిని కాళ్లతో  తొక్కితే, వాటికి చిర్రెత్తి తోక తొక్కిన తాచులవుతాయి. నా చిన్నప్పుడు వీటి గురించి ఎన్ని సినిమాలని బాబూ నేను చూసింది. పాముల మీద ఎంత సాహిత్యం ఉందో  తెలుసా మీకంతా !!!!. మన దేవుళ్ళకి ఈ పాములు పడకలయ్యాయి కదా!!!! ఇక విష రహిత సర్పాల విషయానికి వస్తే జర్రి పోతులు, అనకొండలు, కొండ చిలువలు, పసరిక పాములు , ఇలా చాలా వైవిధ్యమే కనపడుతుంది. 

కొండచిలువల గురించి చిలువలు, పలువలుగా చెప్పుకునేవారు నా చిన్నప్పుడు.అనకొండ ను  చూస్తే 'అబ్బో' 'అనకుండా' ఉండలేమండి బాబు. కొండచిలువలని constrictor snakes అంటారు. ఇక విష యుక్త మరియు విష రహిత సర్పాలను ఎలా గుర్తించవచ్చో కూడా చెప్పాము. తోక, తల, పొలుసులు, హను ఫలకాలు, లోరియల్ గర్త ఇలాంటి లక్షణాల ద్వారా ఎలా విష యుక్త సర్పాలను గుర్తించవచ్చో చెప్పాము. విషాలలో రకాలు కూడా చెప్పాము. పాముకు విషం కోరలలో ఉంటే 'ఖలునకు నిలువెల్ల విషము, కదరా సుమతీ!' అని సన్నాయి నొక్కులు నొక్కాము. 

యాంటీ వీనం ఎలా తయారుచేస్తారో వివరించాము. 

పాము విషానికి, పూడు పాములకు ఎంత డిమాండ్ ఉందో చెపుతుంటే, పిల్లలు 'వీడి పాఠం వినేకంటే పోయి పాములు పట్టుకోవడం మేలు అన్నట్టుగా చూసారండీ. తరువాత క్విజ్ నిర్వహించి పిల్లలకు వెయ్యి రూపాయల విలువ చేసే బహుమతులు ఇచ్చాము. పవర్ పాయింట్ స్లయిడ్స్ పిల్లలను బాగా ఆకట్టుకున్నాయి. పాముల మీద ఇంత తతంగం జరగడానికి కారణం భరత్ అనే నా స్టూడెంట్ చూపిన చొరవ. అదే విధంగా ఇది ఇంత విజయవంతం కావడానికి సహకరించిన శ్రీదేవి మేడం గారికి, మిత్రులు అహ్మద్, ఆనంద భాస్కర్ లకి, విద్యార్థులు మహేష్, కుళ్లాయ స్వామి, శ్రీనివాస్, మరో భరత్ మరియు గణేష్ లకు ధన్యవాదాలు. 





























Sunday, July 14, 2024

                                          GLOBAL SNAKES DAY JULY 16th  2024 

                                                                     QUIZ 

1. Which is the most poisonous snake?  

     Sea snake or Hydrophis 

2. What is the shape of the tail in Sea snakes?

     Oar shape

3. Name the viviparous groups of snakes?

    Sea snakes and vipers 

4. Which is the most poisonous terrestrial snake?

    Krait 

5. Which is the only snake that builds nest?

     King Cobra 

6. What is the scientific name of King Cobra?

    Naja hanna 

7. What are the other names given to Naja hanna or King cobra?

    Hamadryad or Ophiophagus hanna 

8. What is the study of snakes called?

    Ophiology or Serpentology  

9. Which medicine is given to the victim of the snake bite?

    antivenom or poly venom 

10. Which animal is used in the preparation of antivenom or poly venom?

       Horse 

11. Name the pioneer institutes in the preparation of antivenom and poly venom?

      Hofkin's  institute Mumbai and Central Research Institute Kasouli 

12. Which snake bite has no antidote?

      Sea snake 

13. In which country snakes are absent?

      New Zealand 

14. In which reptiles, tongue is bifurcated?

      Snakes 

15. Presence of hood is the characteristic feature of which snake?

      Cobra 

16. What do you call the snakes that live on trees?

       Arboreal 

17. What is the scientific name of krait?

      Bungarus 

18. What is the process of shedding skin in snakes  called? 

      Ecdysis or molting 

19.  To which class of chordates, do snakes belong?

        Reptiles 

20. What are the locomotory organs in snakes?

      Ribs and intercostal muscles 

21. What are baby snakes called?

       Snakelets

22. What is a group of snakes called? 

       Den

23. Which snake is called Constrictor snake?

       Python 

24. What is the ratio of non-poisonous to poisonous snakes in India?

       10:1 

25. What are the five types of  poisonous snakes found in India?

       Sea snakes, Cobra, Krait, Vipers and Coral snakes 

26. On which part of the central nervous system, does the cobra venom act?

      Medulla oblongata. Hence it is called respiratory poison 

27. What do you call the venom that acts on nervous system?

      Neurotoxin 

28. What do you call the venom that acts on circulatory system?

      Hemotoxin 

29. What is the scientific name of rat snake?

       Ptyas 

30. What are the organs of olfaction in snakes?

      Jacobson's organs 

31. Which snake can spit venom? 

       Spitting Cobra

32. What is a snake's natural enemy? 

       Mongoose

33. Which snake has a rattle on its tail? 

       Rattlesnake

34. Which snake is called Double headed snake?

      Eryx johny 

35. Python belongs to which family?

      Boaidae 

36. What is the function of loreal pit present in pit vipers?

      Thermoreceptor 

37. Name the pit viper present in Himalayas?

      Ancistrodon himalayensis 

38 What is the common name of Russel's viper?

     Chain Viper 

39. What is the diagnostic feature of Russel's viper?

       Three rows of diamond shaped black marks on dorsal side 

40. What is the sound made by snakes called?

       Hissing 

41. What is the term for a snake's attack on prey?

       Strike

42. Which snake is known for its vibrant red coloration? 

      Coral Snake

46. What is a snake's method of capturing prey called? 

      Ambush

47. Which snake is known for its preference for aquatic habitats? 

      Water Moccasin

48. What is the term for a snake's use of venom to immobilize prey? 

      Envenomation

49. Which snake has rudimentary limbs? 

      Python 

50. What is the term for a snake's scales that overlap like roof tiles? 

      Imbricate

51. What is the term for the arrangement of colors on a snake's body that mimics its 

      environment? 

      Camouflage

52. Which Snake is used to churn Ambrosia or amruth from ocean in mythological days?

       Vasuki 

53. Name the snake that bit King Parikshit in Bhagavatha  Purana? 

      Takshaka 

54. Why snakes do not digest milk? 

      due to the absence of renin 

55. Which Hindu God in South India is identified with Snake and fertility?

      Subramanya 

56. Which sound vibrations are listened by snakes?

       Earth born sound vibrations 

57. What is the common name of Drayophis? 

      Green snake or whip snake or wine snake 

58. Which snake is called blind snake?

      Typhlops 

59. Which snake is called 'Friend of the farmer'? 

      Ptyas 

60. Which is the costliest snake in India?

      Red Sand Boa 

61. Name the parts by which poisonous and non-poisonous snakes can be differentiated?

      Tail, Supra Labials, Infra Labials, Ventrals, Vertebrals, Head shape, Loreal Pit etc. 

62. Give one example pit less viper.

       Russel's Viper 

63. What do you call the venom of cobra?

       Cobradin 

64. What do you call the venom of Viper?

       Viperidin 

65. Which is the earliest known true snake fossil?

      Hassiophis terrasanctus 

66. Which country is known as 'Country of Snakes'? 

      Bhutan ( because of the presence of more poisonous snakes ) 

67. Which country is known for much snake diversity?

       Brazil 

68. Which are the World's biggest snakes?

       Green Anacondas 

69. Which is the smallest snake?

      Barbados Thread snake 

70. What is the name given to the teeth of poisonous snakes?

       Fangs 

71. Which place is known as 'Snake Capital of India'? 

      Agumbe located in Western Ghats 

72. Which is the largest venomous snake?

       King Cobra 

73. In which snake, fastest acting venom is found?

      Black Mamba 

74. Which ribs are useful to expand the hood in cobra?

       Cervical ribs 

75. Which glands are modified into poisonous glands in poisonous snakes?

       Salivary glands 

76. Which snake is called Phoorsa snake?

       Echis carinata 

77. Which enzyme is found in snake venom?

       Hyaluronidase 

78. What is the color of snake venom?

       Straw colored 

79. Which muscles constrict the poisonous glands of snake while biting?

      Masseter muscles or Mandibularis constrictus 

80. In which snakes movable fangs are found?

      Vipers and Rattle snakes 

81. In which snakes, permanently erect fangs are found?

      King Cobra and Krait 

82. In which snake, hexagonal Vertebrals are found?

      Krait 

83. In which snakes, third supra labial touches the eye and nasal shield?

      Cobra and Coral snakes 

84. In which snake, fourth infra labial is larger?

      Krait  

85. Which is the most poisonous snake found in North America?

      Diamondback Rattle Snake

86. Which snake is known as eye poker?

       Drayophis 

87. Which snake is known as grass snake or pond snake?

      Tropidonotus 

88. How the fangs function while injecting the venom into the victim?

      Hypodermic syringe 

89. What is the excretory product of snakes?

       Uric acid 

90. How many cranial nerves are found in snakes?

       10 pairs 

91. How do snakes use their venom?

       Prey immobilization and self defense

92. How can we describe snake venom in general?

       Toxic saliva 

93. Can you list out the major symptoms of poisonous snake bite?

       Puncture marks, labored breathing, hemorrhage, swelling and nausea 

94. What is the scientific name of  Inland Taipan?

       Oxyuranus microlepidotus 

 95. What is the scientific name of Black mamba?

        Dendroaspis polylepis 

96. How often snakes shed their skin in a year?

       3-6 times 

97.  If one poisonous snakes bite another poisonous snake, what does happen?

       The snake that is bitten will die. 

98. What is the name given to the tail scales of a snake?

       Sub caudals 

99. Which is the major component of venom?

       Protein 

100. Which teeth are modified into fangs in poisonous snakes?

         maxillary teeth 



Friday, July 12, 2024

                                Organ Donation Awareness Camp on 12th July 2024


















అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల జంతుశాస్త్ర విభాగం లో  SIDBI General Manager Sri V చంద్రమౌళి, Sri Rama Krishna DGM, Regional Office మరియు శివకుమార్ ఆధ్వర్యం లో అవయవ దానం మీద ఒక అవగాహనా సదస్సు జరిగింది. డాక్టర్ గిరిధర్ మరియు నెహ్రూ యువకేంద్ర వాలంటీర్లు దీనికి కావాల్సిన ఏర్పాట్లు పూర్తీ చేశారు. ఈ సందర్భంగా క్విజ్, స్లోగన్ రైటింగ్ మరియు అవయవ దానానికి సంబంధించిన డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. SSBN, SV Degree , RIPER మరియు మా ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొన్నారు. ఈ సదస్సులో రిసోర్స్ పర్సన్స్ అవయవ దాన ప్రాముఖ్యత మీద విద్యార్థులకు అవగాహన కల్పించారు. 
జీవితంలో రెండు సంఘటనలు మన చేతిలో ఉండవు. అవి ఒకటి పుట్టుక మరొకటి చావు. పుట్టుకతో 'పుట్టెడు' కష్టాలు మొదలవుతాయి. పుట్టుక నుంచి చావు వరకు మనం మన శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ శరీరం ఒక కొంప లాంటిది. దానిని తగలేసుకోకూడదు. 'దేహో దేవాలయం ప్రోక్తం , జీవో దేవః సనాతనః' అన్నారు కాబట్టి దేహాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే విద్యార్థులు స్మోకింగ్, ఆల్కహాల్ మరియు మాదక ద్రవ్యాల లాంటి వాటికి బానిసలు కాకూడదు. 
మనం చిరంజీవులుగా మరణానంతరం కూడా జీవించాలంటే, అవయవ దానం ఒకటే మార్గం. జీవన్  దాన్ లో అవయవ దాత గా మనం మన పేర్లు నమోదు చేసుకోవాలి. మీ మరణం తరువాత మీ గుండె వేరే వారిలో స్పందించాలి. Brain dead అయినవారి వివిధ అవయవాలను ఇతరులకు అమర్చవచ్చు. ఒక కళేబరం నుంచి తీసుకున్న అవయవాల ద్వారా సుమారు ఆరు మందికి కొత్త జీవితాన్ని ప్రసాదించవచ్చు. కళ్లు, గుండె, కాలేయం , మూత్రపిండం లాంటి అవయవాలను దానం చేయవచ్చు. మరణం తరువాత కూడా మనం ప్రపంచాన్ని చూడాలి అంటే నేత్ర దానం ద్వారా మాత్రమే సాధ్యం. 
చావు చెప్పి రాదు కాబట్టి అందరూ కూడా అవయవ దాతగా నమోదు చేసుకుంటే మృత్యువుకు కూడా ఒక అర్థం, పరమార్థం చేకూరుతుంది. చచ్చి పోయే ముందే, ఇచ్చి పోవడానికి సిద్దమవుదాం. అన్ని దానాలకన్న , అవయవ దానం మిన్న. 
ఈ సదస్సు విజయవంతమవడానికి తోడ్పడిన మా డిపార్ట్మెంట్ అధ్యాపకులకు మరియు విద్యార్థులకు ఇవే మా నమస్సులు. 
మీరు సహకరిస్తే, ఇలాంటి సదస్సులు సహస్రాధికంగా నిర్వహిస్తామని హామీ ఇస్తూ.. 

                                                                                                G L N PRASAD
                                                                                               Lecturer in Charge
                                                                                             Department of Zoology 
                                                                                           Govt College (A) Anantapur 


  జంతుశాస్త్ర విద్యార్థులకు క్విజ్ పోటీలు  జులై నెలలో ఒక రోజు మా ద్వితీయ సంవత్సరం జువాలజీ మేజర్ విద్యార్థులకు అనుకోకుండా ఒక రోజు క్విజ్ పోటీ...