Wednesday, November 1, 2023

                                                        National Unity Day













నెహ్రూ యువ కేంద్ర తరుపున నేను చాలా కార్యక్రమాలలో పాల్గొన్నాను. వేలమంది యువత తో పరిచయం నాకు ఈ వేదిక ద్వారానే అయ్యింది. clean & green, fit India లాంటి ఎన్నో కార్యక్రమాలలో నేను ట్రైనర్ గా వెళ్ళడం జరిగింది. ఈ రోజు కూడా నా పూర్వ కార్యక్షేత్రం అయినటువంటి కల్యాణదుర్గం ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో NYK ఆధ్వర్యం లో ఏక్తా దివస్ ( National Unity day) జరుపుకున్నాము. శ్రీధర్ చక్కటి ఏర్పాట్లు చేశాడు. ఈ కార్యక్రమం లోనే  అనుబంధంగా NKC (Nature, Knowledge, Caring ) సేవాసమితి కల్యాణదుర్గం కళాశాల మహిళా సాధికారతా విభాగానికి కుట్టు మిషన్ ను బహూకరించడం జరిగింది. NKC Founder & General Secretary కమల్ నాథ్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 

ఇన్ని కార్యక్రమాలు చేసుకుని తిరిగి వస్తుంటే, ఏక్తా దివస్ గురించి ఒక వాయిస్ ఓవర్ రికార్డు చేసి పంపమని ఆకాశవాణి నుండి ఫోన్ వచ్చింది. కారు లోనే రికార్డు చేసి పంపేశాను. రాత్రి 10 గంటలకు ప్రసారం కూడా చేశారు.  అలా ఈ రోజు చాలా క్రియాశీలకంగా జరిగింది 

No comments:

Post a Comment

                                Multiple Activities in Our College Today  1. Meeting is convened in the examination committee with the membe...