ఫిబ్రవరి 7 వ తేదీ 2025 శుక్రవారం రోజు, నేను STSN Govt.Degree College Kadiri కి వెళ్లాను. అధ్యాపకులకు Capacity Building for Teachers అనే అంశం మీద IQAC ఆధ్వర్యం లో చిన్నపాటి సదస్సు జరిగింది. 20 మంది అధ్యాపకుల వరకు హాజరై ఉంటారు. ప్రిన్సిపల్ స్మిత మేడం గారు సదస్సుకు అధ్యక్షత వహించారు. మిత్రుడు రాళ్లపల్లి హైదర్ సదస్సును నిర్వహించారు. ఇరవై ఒకటవ శతాబ్దంలో అధ్యాపకులు అలవరుచుకోవలసిన నైపుణ్యాల గురించి కొన్ని విషయాలను వీరందరితో పంచుకోవడం జరిగింది. సదస్సు 11 గంటలకు మొదలై మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది. తరువాత జువాలజీ విద్యార్థులనుద్దేశించి ఒక అరగంట పాటు ప్రసంగించాను. కృష్ణా నాయక్ జువాలజీ విద్యార్థులతో చర్చా గోష్ఠి ఏర్పాటు చేసాడు.
No comments:
Post a Comment