Saturday, February 15, 2025

                Swachha Andhra - Swarna Andhra Initiative at Govt College (A) Anantapur 

















ఈ రోజు అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో స్వచ్చ ఆంధ్ర మీద ఒక మెగా ఈవెంట్ జరిగింది అని చెప్పవచ్చు. ప్రిన్సిపల్ పద్మ శ్రీ  ఈ కళాశాలలో పనిచేసే పారిశుద్ద సిబ్బంది మరియు విద్యార్థులకు వ్యర్థ పదార్థాల నిర్వహణ గురించి అవగాహన కల్పించారు. NSS coordinators సోమశేఖర్, బాలాజీ నాయక్, జయలక్ష్మీ, సుధాకర్, బృంద  మరియు ఇతర అధ్యాపకులు ఈ కార్యక్రమంలో క్రియాశీలకంగా  పాల్గొన్నారు. మొదటగా కామర్స్ బ్లాక్ ముందు విద్యార్థులు మరియు అధ్యాపకులు కలిసి స్వచ్చ ఆంధ్ర ప్రతిజ్ఞ చేసారు. తరువాత కాంటీన్ వద్ధ పారిశుద్ధ సిబ్బందికి తడి చెత్త, పొడి చెత్త గురించి అవగాహన కల్పించారు. Dust bins కు సంబంధించిన Colour code కు సంబంధించి ప్రిన్సిపల్ మేడం అవగాహన కలగజేశారు. ఏ విధంగా చెత్తను సంపదగా మార్చుకోవచ్చో తెలియజేసారు. Waste to wealth మరియు Trash to treasure concepts గురించి అవగాహన కలగజేశారు. 
మధ్యాహ్నం 2 గంటల నుంచి మూడు గంటల వరకు స్వచ్చ ఆంధ్ర అనే అంశం మరియు వ్యర్థ పదార్థాల నిర్వహణ మీద SASA coordinator విష్ణు ప్రియ ఆధ్వర్యం లో ఒక కార్యశాల ను కూడా నిర్వహించడం జరిగింది. ఈ కార్యశాల లో స్వచ్చ ఆంధ్ర సాధించడానికి  ప్రతి నెల చేపట్టవలసిన కార్యక్రమాల గురించి వక్తలు తెలియజేసారు. ఈ కార్యక్రమం లో అధ్యాపకులు అహ్మద్, లక్ష్మీ కాంత్, అరుణ శ్రీ, మాధవీ లత, శైలజ, చిన్న వెంకటమ్మ, బృంద, నాగ జ్యోతి మరియు రుహినాజ్ పాల్గొన్నారు. 
స్వచ్చ ఆంధ్ర కు సంబంధించి ఈ క్రింది slogans ను అధ్యాపకులు సూచించారు. 

  • Your waste - Your responsibility 
  • Planet Earth has suddenly become sick and it urgently needs a cure 
  • From trash to treasure, recycle for pleasure 
  • Don't be rubbish - Bin your trash 
  • Segregation of waste - A step towards Greener future 
  • Reduce, Reuse & Recycle 
  • Stop trashing your Planet 
  • Be a good guest on Earth 

No comments:

Post a Comment

                           Collaborative Work With District Science Center, Anantapur   In collaboration with the District Science Center an...