AP SOCIAL WELFARE SCHOOL, ROTARY PURAM
&
ZPHS, KORRAPADU
ఈ రోజున ( ఫిబ్రవరి 21, 2025 ) వంద మంది విద్యార్థులను కలిసే అవకాశాన్ని ANCET అధికారులు నాకు కల్పించారు. మిత్రుడు చిగిచెర్ల శ్రీనివాసులు మరియు మేనేజర్ సునీల్ కుమార్ రెడ్డి తో పాటుగా ఉదయం 10.15 కు కొర్రపాడు జిల్లా ఉన్నత పాఠశాలకు చేరుకున్నాను. క్యాంపస్ చాలా ఆహ్లాదకరంగా మరియు శుభ్రంగా ఉంది. పిల్లలను ఒక రూములో కూచోపెట్టారు. నైపుణ్యాభివృద్ధి గురించి మేమంతా మాట్లాడాము. వాసంతి అనే అమ్మాయి చక్కటి సమాధానాలు ఇవ్వడం వలన రెండు వందల రూపాయల నగదు బహుమతి నేను, సునీల్ కుమార్ రెడ్డి సర్ కలిసి ఇచ్చాము.
కొర్రపాడు నుంచి రోటరీ పురం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కు చేరుకున్నాము. లైబ్రరి హాలు లో ఎనభై మంది విద్యార్థినులు చక్కగా ఒక వరుస క్రమం లో కూచున్నారు. సునీల్ కుమార్ సర్ career orientation గురించి చక్కగా వివరించారు. నేను ఈ సారి వ్యూహం మార్చి నైపుణ్యాభివృద్ధి గురించి చెపుతూనే, అమ్మాయిలు తమను తాము ఏ విధంగా రక్షించుకోవాలనే విషయం గురించి వివరించాను.
- సామాజిక మాధ్యమాలలో క్రియాశీలకంగా ఉండకండి.
- మీ ఫోటో ను పంచుకోకండి
- అపరిచుతులతో చాటింగ్ చేయకండి
- చాలా విషయాలలో NO చెప్పడం నేర్చుకుంటే, ఇబ్బందులు రావు.
- అమ్మా, నాన్న కు పాఠశాలలో జరిగే విషయాలు తెలియజేయాలి.
- మంచి స్నేహితులతో మాత్రమే కలిసి ఉండాలి.
- Birth day పార్టీల లాంటి వాటికి దూరంగా ఉండాలి.
- ఏ రోజు పాఠాలు ఆ రోజే పురశ్చరణ చేసుకోవాలి.
- మీ ఫోన్ నెంబర్ ఎవరితోను, ముఖ్యంగా కొత్త వారితో పంచుకోకూడదు.
- అభ్యంతరకర రీతిలో ప్రవర్తించే వారి గురించి టీచర్లకు, తల్లి తండ్రులకు చెప్పాలి.
- Good touch మరియు bad touch గురించి అవగాహన కలిగి ఉండాలి.
No comments:
Post a Comment