A Workshop on Mental Health Challenges Among Adolescent Girls in KGVBVs
జిల్లా వ్యాప్తంగా ఉన్న కస్తూరిబా బాలికా విద్యాలయ ప్రిన్సిపల్స్ , వార్డెన్లు , వ్యాయామ అధ్యాపకులు మరియు ANM లకు బుక్కరాయసముద్రం లో "Mental Health Challenges Among Adolescent Girls in KGVBVs" అనే అంశం మీద కార్యశాల జరిగింది. దీనిని సమగ్ర శిక్ష అధికారులైన శైలజ గారు పర్యవేక్షించారు. ఈ సదస్సు మార్చి 25, 2025 న ఉదయం 10 గంటలకు ప్రారంభం అయ్యింది. మొదటగా అధికారులందరు జ్యోతి ప్రజ్వలన లో పాల్గొన్నారు. సుమారు వంద మంది వరకు KGVBV ఉద్యోగులు సదస్సుకు వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చారు. మొదటి సెషన్ నాకే ఇవ్వడం జరిగింది. నేను ఈ క్రింది అంశాలను ఉటంకించాను.
- ప్రిన్సిపల్ కు అధ్యాపకుల మధ్య ఉండవలసిన నిర్మాణాత్మక అవగాహన
- పాఠం చక్కగా చెప్పడానికి కావలసిన వాతావరణం నెలకొల్పడం
- స్టూడెంట్ కు అర్థమయ్యేలా బోధించడానికి కావలసిన మెళకువలు
- విద్యార్థినులలో మొబైల్ దుర్వ్యసనం దానిని నిర్మాణాత్మకంగా మార్చడానికి అధ్యాపకులు అలవరుచుకోవలసిన డిజిటల్ నైపుణ్యాలు
- కౌమార దశలో వచ్చే మానసిక మార్పులు మరియు ధోరణులు
Photo Courtesy : Sri Narayana Swamy
💐🌹👌🌹🤝🌹🙏🌹🇮🇳🌹💐
ReplyDelete