SSBN PRIVATE AIDED DEGREE COLLEGE ANANTAPUR - GUEST TALKS
SSBN కళాశాల అనంతపురం లోనే ఒక ఆదర్శప్రాయమైన కళాశాల. ఇక్కడ చాలామంది సెలెబ్రటీస్ చదువుకున్నారు. నాకు తెలిసిన అలాంటి ఒక సెలబ్రటీ యండమూరి వీరేంద్రనాథ్. ఇప్పుడు ఒకే క్యాంపస్ లో జూనియర్, డిగ్రీ కళాశాలలు, మరియు పాఠశాల కనిపిస్తాయి. ఈ కళాశాలకు సకల హంగులూ ఉన్నాయి. మంచి లైబ్రరీ, ఆడిటోరియం, క్రీడా ప్రాంగణం, డిజిటల్ బోర్డులు కలిగిన తరగతి గదులు, ప్రయోగశాలలు ఇలా విద్యార్థులకు కావలసిన సకల సౌకర్యాలు కలిగిన కళాశాల SSBN డిగ్రీ కళాశాల. స్వయంప్రతిపత్తిని కలిగిఉంది కాబట్టి ఈ కళాశాలకు ప్రత్యేకమైన పరీక్షా విభాగం కూడా ఉంది. నాణ్యమైన విద్యను అందించడంలో ఈ కళాశాల తనదైన ముద్రను వేసుకుందనే చెప్పాలి. ఒకటి రెండు సార్లు ఈ SSBN డిగ్రీ కళాశాల board of studies లో సభ్యుడిగా పాల్గొనే అవకాశం నాకు కలిగింది.
మరో విషయం ఇక్కడ ప్రస్తావించాలి. అదేమంటే నేను చదువుకున్నది ఆర్ట్స్ కళాశాల లోనే అయినప్పటికీ, నేను పీజీ జువాలజీ చేయడానికి కారణం SSBN కళాశాల జువాలజీ అధ్యాపకులైనటువంటి మురళి సర్ మరియు శివరామకృష్ణ సర్. అప్పట్లో వీళ్లు మా ఆర్ట్స్ కళాశాలకు పార్ట్ టైమ్ గా సేవలు అందించేవారు. ఆధునిక డిజిటల్ సొబగులు ఏవీ లేని ఆ కాలం లో అద్బుతంగా బొమ్మలు వేస్తూ, జువాలజీ పాఠాలు వీళ్లు బోధించేవారు. తదనంతర కాలంలో నేను డిగ్రీ కళాశాల లెక్చరర్ అయిన తరువాత నేను మరియు శివరామ కృష్ణ సర్ చాలా సార్లు టీచర్ల శిక్షణా తరగతులలో మరియు పేపర్ సెట్టింగ్ లలో కలిసి పాలుపంచుకున్నాము.
ఇప్పుడు అటువంటి కళాశాలలో శ్వాస వ్యవస్థ మీద అతిథి ఉపన్యాసం ఇమ్మని అక్కడ పనిచేస్తున్న జువాలజీ లెక్చరర్ యోగీశ్వర్ నన్ను ఆహ్వానించాడు. ఇతడు నాకు పరోక్ష శిష్యుడే కావడంతో 20-03-2025 మరియు 22-03-2025 తేదీలలో క్లాసులు తీసుకోవడానికి ఒప్పుకున్నాను. ఆ సందర్భంగా తీసుకున్నవే పై ఫోటోస్. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు శ్వాస వ్యవస్థ గురించి, మొదటి సంవత్సరం విద్యార్థులకు platyhelminthes గురించి power point ద్వారా వివరించాను. క్లాస్ తరువాత యోగి నా కోసం ఒక రోజు నెయ్యి దోసెలు మరో రోజు పూరీలు తెప్పించాడు. సంతృప్తిగా తినేసి మా ఆర్ట్స్ కళాశాల పరీక్షా విభాగానికి పనిచేసుకోవడానికి వచ్చేసాను.
No comments:
Post a Comment