Wednesday, March 26, 2025

                            BLAZER DISTRIBUTION PROGRAMME FOR BBA STUDENTS 

                                                                  26th March 2025 

 

 












  • ఈరోజు నాకో సరి కొత్త అనుభూతి కలిగింది. అదేమంటే BBA విద్యార్థుల blazer distribution కార్యక్రమానికి ఆ విభాగాధిపతి శర్మిళ రామయ్య నన్ను ఆహ్వానించడం, నేను ఆ విద్యార్థులతో ముచ్చటించడం. ప్రతి రోజు మా జంతు శాస్త్ర విద్యార్థులను నేను కలుస్తూనే ఉంటాను. కొత్త విద్యార్థులను కలవడం అంటే నాకు తగని ఆసక్తి. నేను పరీక్షా విభాగం నుంచి BBA కార్యక్రమం జరుగుతున్న సెమినార్ హాలుకు ఉదయం 10.15 కు చేరుకున్నాను. నన్ను వేదిక మీదికి సాదరంగా ఆహ్వానించారు. అప్పటికే వైస్ ప్రిన్సిపల్ సహదేవుడు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. వేదిక మీద ప్రభాకర్ రెడ్డి, శ్రీ రాములు, శర్మిళ రామయ్య ఆసీనులై ఉన్నారు. మిత్రుడు మిద్ధి మల్లికార్జున కాస్త ఆలస్యంగా వేదిక మీదికి వచ్చారు. కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం BBA విద్యార్థులకు బ్లేజర్ల పంపిణీ. అప్పటికే సెమినార్ హాల్ లో చాలా మంది విద్యార్థులు కోట్లు ధరించి కూచుని ఉండడంతో , ఆ సదస్సుకు ఒక కార్పొరేట్ శోభ వచ్చి చేరింది. ఆ బ్లేజర్లు ధరించిన విద్యార్థులలో ఆత్మ విశ్వాసం తొణికిసలాడుతూ ఉంది. అందుకే పెద్దలు "Eat to satisfy yourself and dress to satisfy others" అన్నారు. అసలు dress ఇచ్చే ధీమా ఏదీ ఇవ్వదు. మనకు ఎంత డబ్బు ఉందో ఎవరికీ తెలియదు కాబట్టి, అందరూ కూడా మన వ్యక్తిత్వాన్ని మనం వేసుకున్న డ్రెస్ ద్వారానే అంచనా వేస్తారు. మనం వేసుకున్న డ్రెస్ మనకు నప్పాలి. మనందరి దర్జాకీ కారణం మన దర్జీనే సుమా!!!!. ప్రభుత్వ కళాశాలలో సంపన్న వాతావరణం నెలకొనడం మొదటిసారి చూస్తున్నాను. విద్యార్థులకు సంపదను సృష్టించే అంశాలను పాఠాలుగా బోధించడం ఒక BBA లోనే సాధ్యం. అందుకే నాకు management classes అంటే చాలా ఇష్టం. డబ్బుకు సంబంధించిన ఆలోచనలు చిన్న వయసులోనే కలగాలి. Think Rich అంటూ పిల్లలను ప్రోత్సహించగలగాలి. ఆదాయానికి మించిన ఖర్చు ఉన్నవాడు త్వరలో బికారి అవుతాడు. నాకు ఈ సంపన్న వాతావరణం నచ్చి డబ్బుకు సంబంధించిన ఆలోచనలలో మునిగిపోయాను. నాకు డబ్బు అన్నా, డాబు అన్నా భలే ఇష్టం సుమండీ!!! ఇంతలో నన్ను మాట్లాడమని ఆహ్వానించడంతో, నా ఆలోచనలను ఈ క్రింది మాటల ద్వారా పంచుకున్నాను. 
  • మొదట మీరు డబ్బు కోసం పని చేస్తే, తరువాత ఆ డబ్బు మీ కోసం పని చేస్తుంది 
  • Active money & passive money రెండూ మన చేతిలో ఉండాలి 
  • saving మరియు investment మధ్య తేడా స్పష్టంగా తెలిసి ఉండాలి. 
  • ప్రపంచం నిండా ఉండేది డబ్బే, కానీ అది అందరి దగ్గరా ఉండదు. 
  • ప్రపంచ కుబేరుల జీవిత చరిత్ర కు సంబంధించిన సినిమాలను విద్యార్థులకు చూపాలి. సినిమాలు చూసి కూడా బాగు పడొచ్చు. దానికి నేనే సాక్ష్యం. 
  • మీ నెల సంపాదన కన్నా ఎక్కువ ధర కలిగిన mobile మీ వద్ద ఉంటే మీరు త్వరలో బిక్షగాళ్లు అవుతారు. 
  • డబ్బు గురించి మీరు ఆలోచిస్తూ ఉంటేనే, అది మీ దగ్గరకు వస్తుంది. డబ్బును గౌరవించని వాడి వద్ధ అది ఉండదు. 
  • Money is a very good servant but very bad manager. ఈ సూత్రానికి అనుగుణంగానే మహా విష్ణువు లక్ష్మీ దేవిని పాదాల వద్ద ఉంచుకున్నాడు. డబ్బు తలకెక్కితే ధన లక్ష్మి, ధన పిశాచిగా మారుతుంది. ఈ తేడా తెలియక చాల మంది జీవితాలు తగలేసుకుంటారు. 
  • అడగకనే ఇచ్చే అప్పుతో జాగ్రత్తగా ఉండండి. అప్పు ఎప్పటికైనా ముప్పే. ఇప్పుడు చాలా సంస్థలు అప్పు చేయడం నేర్పిస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త!!!!!. అప్పు లేని వాడు అధిక సంపన్నుడు అంటారు పెద్దలు. 
  • అలా అని పూర్తీ అప్పు చేయకున్నా కష్టమే. Credit rating సరిగా లేకుంటే అవసరమైనప్పుడు అప్పు పుట్టదు. తిరుమల వెంకన్నను చూడండి, చేసిన అప్పును పెట్టుబడి గా ఎలా మార్చాలో తెలుస్తుంది. 
  • భూములు కొనండి. భూమికి ఉన్న బూమ్ దేనికీ లేదు. 'ఇల దున్నువారు బలభద్రులగుదురు' అని ఊరికే చెప్పలేదు వీర బ్రహ్మేంద్ర స్వామి. 
  • లేదంటే బంగారు కొనండి. మీ సింగారం అంతా బంగారం మీదనే ఆధారపడి ఉంది.  నా చిన్నప్పుడు ఒక పాట వినేవాడిని. 'బంగారానికి, సింగారానికి కుదిరింది ఈనాడు బేరం, అసలిచ్చేది వడ్డీ కోసం" అనే పాట ఎన్ని సార్లు నా చిన్నప్పుడు విన్నానో చెప్పలేను. 
  • లక్కీ భాస్కర్ సినిమా చూడండి. డబ్బు ఇచ్చే కిక్ తెలిస్తే , దాని దుంప తెగ, సంపాదించాలనే కసి పుడుతుంది. 
  • నా చిన్నప్పుడు మా మాస్టర్ " బతికితే శివుడి లాగా పరమ వైరాగ్యం తో బతకాలి, లేదా విష్ణువు లా పరమ వైభవం తో బతకాలి" అని చెప్పేవాడు. 
  • వెంకటేష్ సినిమా క్షణక్షణం చూడండి. సంపద కలవాని సన్నిపాతకం తెలిసి వస్తుంది. డబ్బు ఉన్నోడు నాలాంటి వాడితో మాట్లాడడు రా అయ్యా!!!!. బెంజి లో తిరిగే వాడికి గంజి తాగే వాడి కష్టాలు ఏమి తెలుస్తాయి? 
  • మరో రహస్యం చెపుతాను. అది ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద , బడా ,బడా ఆసాములకి, అయ్యోర్ల కి కూడా తెలియదు ఆ రహస్యం. అదేమంటే డబ్బు దగ్గరే ఆగి పోకండి!!!!! దానిని సంపదగా మార్చుకోండి.. అక్కడ కూడా ఆగకండి. ఆ సంపదను ఐశ్వర్యంగా మార్చుకోండి. 
  • కుటుంబం కోసం డబ్బు సంపాదించండి. అంతే గానీ డబ్బు కోసం కుటుంబాన్ని వదులుకోకండి. 
  • మీరు ఇష్టపడే సినిమా హీరోలను, హీరోయిన్లను చూడండి. చిత్ర రంగం లో అలా వెలుగులీనుతూనే ఎన్ని వ్యాపారాలు వెలగబెడుతున్నారో తెలిస్తే అబ్బురం అనిపిస్తుంది. 'తగ్గేదేలే' అనండి.. .....నెగ్గడాన్ని అలవాటుగా మార్చుకోండి. విజయం మీకో వ్యసనం కావాలి, డబ్బు మీకు బానిస కావాలి. కోటు వేసుకోవడం వద్ద ఆగకుండా, కోట్లు సంపాదించే వైపు దృష్టి సారించండి. 
పై ఆలోచనల్లో కొన్ని సభాముఖంగా వాచ్యం చేసాను. కొన్ని మనసు పొరల్లో దాగుడుమూతలు ఆడడం వల్ల, సమయాభావం వల్ల పంచుకోలేక పోయాను. అందుకే అన్నిటినీ ఈ బ్లాగ్ ద్వారా పంచుకుంటున్నాను.

 




Tuesday, March 25, 2025

 A Workshop on Mental Health Challenges Among Adolescent Girls in KGVBVs 









జిల్లా వ్యాప్తంగా ఉన్న కస్తూరిబా బాలికా విద్యాలయ ప్రిన్సిపల్స్ , వార్డెన్లు , వ్యాయామ అధ్యాపకులు మరియు ANM లకు బుక్కరాయసముద్రం లో "Mental Health Challenges Among Adolescent Girls in KGVBVs" అనే అంశం మీద కార్యశాల జరిగింది. దీనిని సమగ్ర శిక్ష అధికారులైన శైలజ గారు పర్యవేక్షించారు. ఈ సదస్సు మార్చి 25, 2025 న ఉదయం 10 గంటలకు ప్రారంభం అయ్యింది. మొదటగా అధికారులందరు జ్యోతి ప్రజ్వలన లో పాల్గొన్నారు. సుమారు వంద మంది వరకు KGVBV ఉద్యోగులు సదస్సుకు వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చారు. మొదటి సెషన్ నాకే ఇవ్వడం జరిగింది. నేను ఈ క్రింది అంశాలను ఉటంకించాను. 
  • ప్రిన్సిపల్ కు అధ్యాపకుల మధ్య ఉండవలసిన నిర్మాణాత్మక అవగాహన 
  • పాఠం చక్కగా చెప్పడానికి కావలసిన వాతావరణం నెలకొల్పడం 
  • స్టూడెంట్ కు అర్థమయ్యేలా బోధించడానికి కావలసిన మెళకువలు 
  • విద్యార్థినులలో మొబైల్ దుర్వ్యసనం దానిని నిర్మాణాత్మకంగా మార్చడానికి అధ్యాపకులు అలవరుచుకోవలసిన డిజిటల్ నైపుణ్యాలు 
  • కౌమార దశలో వచ్చే మానసిక మార్పులు మరియు ధోరణులు
ఇవికాక eating disorders గురించి కూడా ప్రస్తావించాలని అనుకున్నాను. కానీ సమయాభావం వలన వాటి గురించి మాట్లాడలేక పోయాను. నా తరువాత సెషన్ మానసిక నిపుణులైన డాక్టర్ గురు బాలాజీ గారిది. ఇలాంటి సదస్సుల వలన ప్రతి స్థాయిలో ఉద్యోగులకు, అధ్యాపకులకు వ్యవహార శైలి లో మరియు ఉద్యోగ నిర్వహణలో సవ్యమైన మార్పులు చేసుకోవడం గురించి అవగాహన కలుగుతుంది. 
Photo Courtesy : Sri Narayana Swamy 



Saturday, March 22, 2025

                                           Multiple activities in our college and BC Hostels 


Banning Plastic......but advertising the theme on banning plastic by using flexi!!!!!!! Ideological paradox 








On 20th & 21st march 2025, I interacted with the students of BC Hostels at Ramnagar and Aravind Nagar respectively from 6.30pm to 7.30pm 

               SSBN PRIVATE AIDED DEGREE COLLEGE ANANTAPUR -  GUEST TALKS








SSBN కళాశాల అనంతపురం లోనే ఒక ఆదర్శప్రాయమైన కళాశాల. ఇక్కడ చాలామంది సెలెబ్రటీస్ చదువుకున్నారు. నాకు తెలిసిన అలాంటి ఒక సెలబ్రటీ యండమూరి వీరేంద్రనాథ్. ఇప్పుడు ఒకే క్యాంపస్ లో జూనియర్, డిగ్రీ కళాశాలలు, మరియు పాఠశాల కనిపిస్తాయి. ఈ కళాశాలకు సకల హంగులూ ఉన్నాయి. మంచి లైబ్రరీ, ఆడిటోరియం, క్రీడా ప్రాంగణం, డిజిటల్ బోర్డులు కలిగిన తరగతి గదులు, ప్రయోగశాలలు ఇలా విద్యార్థులకు కావలసిన సకల సౌకర్యాలు కలిగిన కళాశాల SSBN డిగ్రీ కళాశాల. స్వయంప్రతిపత్తిని  కలిగిఉంది కాబట్టి  ఈ కళాశాలకు ప్రత్యేకమైన పరీక్షా విభాగం కూడా ఉంది. నాణ్యమైన విద్యను అందించడంలో ఈ కళాశాల తనదైన ముద్రను వేసుకుందనే చెప్పాలి. ఒకటి రెండు సార్లు ఈ SSBN డిగ్రీ కళాశాల board of studies లో సభ్యుడిగా పాల్గొనే అవకాశం నాకు కలిగింది. 

మరో విషయం ఇక్కడ ప్రస్తావించాలి. అదేమంటే నేను చదువుకున్నది ఆర్ట్స్ కళాశాల లోనే అయినప్పటికీ, నేను పీజీ జువాలజీ చేయడానికి కారణం SSBN కళాశాల జువాలజీ అధ్యాపకులైనటువంటి మురళి సర్ మరియు శివరామకృష్ణ సర్. అప్పట్లో వీళ్లు మా ఆర్ట్స్ కళాశాలకు పార్ట్ టైమ్ గా సేవలు అందించేవారు. ఆధునిక డిజిటల్ సొబగులు ఏవీ లేని ఆ కాలం లో అద్బుతంగా బొమ్మలు వేస్తూ, జువాలజీ పాఠాలు వీళ్లు బోధించేవారు. తదనంతర కాలంలో  నేను డిగ్రీ కళాశాల లెక్చరర్ అయిన తరువాత నేను మరియు శివరామ కృష్ణ సర్ చాలా సార్లు టీచర్ల శిక్షణా తరగతులలో మరియు పేపర్ సెట్టింగ్ లలో కలిసి పాలుపంచుకున్నాము. 

ఇప్పుడు అటువంటి కళాశాలలో శ్వాస వ్యవస్థ మీద అతిథి ఉపన్యాసం ఇమ్మని అక్కడ పనిచేస్తున్న జువాలజీ లెక్చరర్ యోగీశ్వర్ నన్ను ఆహ్వానించాడు. ఇతడు నాకు పరోక్ష శిష్యుడే కావడంతో 20-03-2025 మరియు 22-03-2025 తేదీలలో క్లాసులు తీసుకోవడానికి ఒప్పుకున్నాను. ఆ సందర్భంగా తీసుకున్నవే పై ఫోటోస్. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు శ్వాస వ్యవస్థ గురించి, మొదటి సంవత్సరం విద్యార్థులకు platyhelminthes గురించి power point ద్వారా వివరించాను. క్లాస్ తరువాత యోగి నా కోసం ఒక రోజు నెయ్యి దోసెలు మరో రోజు పూరీలు తెప్పించాడు. సంతృప్తిగా తినేసి మా ఆర్ట్స్ కళాశాల పరీక్షా విభాగానికి పనిచేసుకోవడానికి వచ్చేసాను. 

Tuesday, March 18, 2025


ఆకాశవాణి తో నా అనుబంధం 









మీకో రహస్యం చెపుతాను. గట్టిగా అనుకోవాలి గానీ ఏ సంకల్పం అయినా ఇట్టే నెరవేరిపోతుంది. కొన్ని త్వరగా నెరవేరవచ్చు. కొన్ని సంకల్పాలు సిద్దించడానికి కాస్తా ఎక్కువ సమయం పట్టొచ్చు అంతే. ప్రతి కోరికకు ఒక time capsule ఉంటుంది. నేను అలా చిన్నప్పుడు అనుకున్నవన్నీ, నేను కాస్తా పెద్దగా అయిన తరువాత సహజంగానే జరగడం మొదలెట్టాయి. నేను నా బాల్యంలో నాన్నా, అమ్మతో కలిసి హైదరాబాద్ ఆకాశవాణికి వెళ్లాను. అప్పుడు మా బంధువు తరిమెల గోపాల కృష్ణమాచార్యులు హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం లో డ్యూటి ఆఫీసర్ గా పనిచేసేవారు. అప్పుడు నేను మూడో తరగతో, మరి నాలుగో తరగతో చదువుతున్న జ్ఞాపకం. ఆకాశవాణి అనే పేరే నాకు తెగ నచ్చేసింది. ఈ ఆకాశవాణి అనే పేరు పెట్టింది రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ అని నాకు తెలియడానికి చాలా కాలం పట్టింది. అప్పటికే భాగవతం కథలో కంసుడికి ఆకాశవాణి వినపడిన ఘట్టం నాన్న ద్వారా, తాత ద్వారా విని ఉన్నాను. మేము ఆ హైదరాబాద్ కేంద్రం లోకి ప్రవేశించడానికి ముందే ఎవరూ కూడా అరవకూడదు, గుస గుసలాడకూడదు అని హెచ్చరించారు. మా ఇంటిల్లిపాది తో నేను ఈ ఆకాశవాణి కేంద్రం లోకి ప్రవేశించే సమయానికి నాకు ఎక్కడి లేని దగ్గు, ఎప్పుడూ లేని దగ్గు రావడంతో, ఆ పసి వయసులో దానిని నేను ఉగ్గబట్టుకోవడానికి పడిన మల్ల గుల్లాలు అంతా ఇంతా కావు. అప్పట్లో నాకు ఆకాశవాణి ఉద్యోగుల మీద జాలి కూడా కలిగింది. ఉద్యోగం చేస్తున్నంత సేపు వీళ్లు 'దగ్గేదేలే' కదా అనుకున్నాను. అప్పట్లో రేడియో announcers కు సినిమా నటులకు ఉన్నంత క్రేజ్ ఉండేది. చాలా మంది లబ్ధ ప్రతిష్టులు ఆకాశవాణిలో పనిచేసేవారు.  ఏది ఏమైనా ఆ బాల్యం లో నేను రేడియో స్టేషన్ ను సందర్శించడం అనేది నాకో మధుర జ్ఞాపకం గా మిగిలిపోయింది. అప్పుడే ఒక సంకల్పం చేసుకున్నాను. అదేమంటే ఏనాటికైనా నా వాణి ఆకాశవాణిలో వినిపించాలని. 
తరువాత నేను తిరుపతి లో చదువుకునేటప్పుడు నా మిత్రుడు చక్రపాణి కార్యక్రమాలు రేడియో లో ప్రసారమయ్యేవి. అతను ఎక్కువగా రేడియో కార్యక్రమాలు వినేవాడు. తరువాత కాలంలో అనేక ప్రైవేట్ tv ఛానెల్స్ ప్రవేశించడం తో శబ్ధ మాధ్యమం మీద దృశ్య మాధ్యమాలు పట్టు సాధించాయి. నేను కూడా అందరి లాగే ఈ tv ఛానెల్స్ మాయలో పడిపోయాను. 'ఈ tv ' 'జెమినీ  tv' లు తెగ చూసేవాడిని. 
2002 లో నాకు జూనియర్ లెక్చరర్ గా ఉద్యోగం వచ్చిన చాలా కాలానికి నా మొదటి కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్రం ద్వారా ప్రసారమయ్యింది. రికార్డింగ్ స్టూడియో లోకి ప్రవేశించినప్పుడు నేను అనుభవించిన థ్రిల్ అంతా ఇంతా కాదు. నా రేడియో కల సాకారం కావడానికి కారణం ఆకాశవాణి లో లైబ్రేరియన్ గా పని చేసే నా class mate నాగేశ్వర. అతని వలన నాకు దేవరబొట్ల మురళి గారు, నాగేశ్వర రెడ్డి గారు, హేమంత రాజు గారు పరిచయం కావడంతో తరువాత కాలంలో నా వాణి, బాణీ ఆకాశవాణి లో చాలా సార్లు ప్రతిధ్వనించాయి. వీరందరికి నేను ఋణపడి ఉన్నాను. నేను ఆకాశవాణి లో అనేక అంశాల మీద విస్తృతంగా ప్రసంగించాను. నా ఇంటర్వ్యూ లు కూడా ప్రసారం అయ్యాయి. ఇంకో అంశం ఏమంటే మనకు జీవితం లో అందిన కిక్ అందరికీ కూడా అందుబాటులోకి రావాలి అనేది నా అభిలాష. అందుకే నా సహోద్యోగుల అందరి వాణి ఆకాశవాణిలో వినిపించేలా అవకాశాలు కలుగజేస్తున్నాను. నా విద్యార్థులు కూడా రేడియో కార్యక్రమాలలో పాల్గొన్నారు. వారితో క్విజ్ లు నిర్వహించాను. కల్యాణదుర్గం లో ఉన్నప్పుడైతే ఏకంగా విద్యార్థులతో ఇంగ్షీషు నాటిక వేసాము. 
శబ్ధం మీద, దృశ్యం మీదా సాధికారత సాధించినవాడు ప్రపంచాన్ని జయించగలడు. అలాంటి జయించే ఉద్దేశ్యం లేని వారికి ఈ సాధికారత జీవితంలో ఒక రసానుభూతిని మిగిలిస్తుంది. 
నా జీవితం రసమయం కావడానికి సహకరించిన ఆకాశవాణి ఉద్యోగులందరికి నా బ్లాగ్ సాక్షిగా శతాధిక ప్రణామాలు. 

 

Monday, March 17, 2025

                   Guest talk at SVGM Govt Degree College on 15th & 17th March 2025 







                            




Thursday, March 13, 2025

 Academic Audit of Zoology & Biochemistry Departments at Govt.College (A) Anantapur 


On 13th March 2025, following the instructions of the CCE, a team of academic advisers visited Government College (A), Anantapur. The team included Dr. Annapurna, Dr. Kiran, and Dr. Gopi Naik. Among them, Dr. Gopi Naik was assigned to conduct the academic audit for the Departments of Zoology and Biochemistry.

Dr. Gopi Naik visited the Zoology and Biochemistry departments at 10:30 AM. An interactive session, presented in PowerPoint format, was conducted in the digital classroom. During this session, I presented a comprehensive overview of the department's profile and activities undertaken over the past two academic years. The presentation covered:

  1. Profile of the Department of Zoology
  2. Achievements of the staff members
  3. Departmental activities with supporting evidence
  4. Details of blood donation camps organized by Dr. P. Giridhar
  5. Information on the Foldscope workshop conducted by Dr. B. Sreedevi
  6. Student-centric activities such as seminars and quizzes
  7. Extension activities by faculty members, including invited talks
  8. Guest lectures organized by the department
  9. Seminar on coral reefs and their conservation
  10. Collaborative activities with NYK and ANSET, where our faculty members participated as key resource persons

Following the presentation, Dr. Gopi Naik reviewed the department's physical documents and collected Format-III from individual lecturers. The faculty members responded efficiently, ensuring the audit proceeded smoothly and successfully. After completing the review in the Zoology department, the adviser proceeded to the Biochemistry department.

The Biochemistry department received special appreciation for its Certificate Course on First Aid and a workshop on CPR, which was recognized as a significant achievement.

SWOC Analysis of the Departments of Zoology & Biochemistry

Based on constructive feedback from the adviser, the following analysis was developed:

Strengths:

  • Strong team spirit among faculty members
  • Proactiveness in administrative duties
  • Active participation in social initiatives in collaboration with NYK and ANSET
  • Faculty contributions to journals and books
  • Faculty members serving as textbook authors and trainers for lecturers, teachers, and police personnel
  • Regular organization of blood donation camps (twice a year)
  • Dynamic RRC Coordinator
  • Proficiency in utilizing digital platforms for teaching
  • Two faculty members maintaining individual YouTube channels with over 1,000 videos each
  • A departmental blog showcasing faculty-led events
  • Installation of an RO Plant, facilitated by Dr. D. Aruna Kumari, providing potable water to thousands of students
  • Well-maintained departmental library and museum
  • Field visits conducted in collaboration with the Department of Fisheries and the Indian Red Cross

Weaknesses:

  • The aesthetics of the museum require improvement
  • Old stock items need to be written off
  • Some documents are not in tune with SOP

Opportunities:

  • Availability of a PG Course in Zoology
  • Employment prospects for Biochemistry students in Anantapur's numerous clinical labs

Challenges:

  • Competition from private institutions
  • Outdated laboratory equipment
  • Limited research funding

The dedication and cooperative effort of the faculty ensured that this academic audit was a resounding success, reflecting the commitment to quality education and departmental growth.












  Certificates and programs of Karmayogi