Monday, October 26, 2026

                                     Review: "Bharath Ko Jano" Quiz Programme, 2026






Review: "Bharath Ko Jano" Quiz Programme, 2026

Organizer: Bharath Vikas Parishath
Date and time: Sunday, 25 October 2026, 10:00 am to 4:30 pm
Venue: Vijayanagar Law College, Anantapur
Participants: School children at Junior and Senior levels

 

Bharath Vikas Parishath organized the Bharath Ko Jano quiz programme for school children of Junior and Senior levels. I was invited to conduct it as quiz master by Sri Namsev Harikrishna, whom I have known since my college days, and Sri Sunku Venugopal. This was the fourth consecutive year in which I had the privilege of serving as quiz master for this programme.

Six teams took part at the Senior level and five at the Junior level. I prepared 64 questions for each level. The questions were presented in PowerPoint mode, so every team could read each question clearly and follow the proceedings. The answers were discussed at the end of the quiz, which gave the students a chance to learn the correct answers and clear their doubts. Mr Apramey acted as scorer and kept the scoring accurate and transparent.

  • Senior level: The Kurnool team was declared the winner.
  • Junior level: The Anantapur team was declared the winner.

The students from every participating team showed enthusiasm, good general awareness and a healthy competitive spirit

Sri Korada Ramakrishna sir coordinated the event meticulously, and the programme ran smoothly and on schedule. Breakfast and lunch were sumptuous, and the participants and guests were well looked after.

In the post-lunch session, the winners and all participants were felicitated with mementoes and certificates. The programme ended with the national anthem.

The programme was a rewarding experience. It encouraged students to read widely and think about India's culture, heritage and current affairs. My thanks to Bharath Vikas Parishath, the invitees, the coordinator, the scorer, the participating teams and their teachers for making the event a success. I look forward to being part of it again next year.

 


Tuesday, October 13, 2026

                                                                బిల్ల సర్గం ప్రయాణం 








చాలా కాలంగా నేను చూసి తీరాలి అనుకుంటున్న ప్రదేశాల జాబితాలో  ఉన్న బిల్ల సర్గం గుహలను నేను ఈ 2026 దసరా సెలవుల్లో చూడడం జరిగింది. ప్రణాళికా బద్దంగా చేసే ప్రయాణాలలో థ్రిల్ ఉండదు. అనుకోకుండా పెట్టె, బేడ సర్దుకుని వెళ్లి చూడడంలోనే మజా ఉంటుంది. బిల్ల సర్గం చూడడం మాత్రం నా మూడేళ్ల కల. దీనికి సంబంధించిన వీడియోలు ఇంస్టా మరియు ఇతర సామాజిక వేదికలలో చాలా హల్ చెల్ చేయడమే ఇందుకు కారణం. సామాజిక వేదికల వలన రాత్రికి రాత్రే ప్రచారంలోకి వచ్చిన ప్రాంతాలు ఇప్పుడు చాలానే ఉన్నాయి. జనాలు అనుకుంటే ఎవరినైనా ఆకాశానికి ఎత్తేయగలరు లేదా అధ: పాతాళానికి తొక్కేయగలరు. 
దసరా సెలవులు ప్రకటించిన రెండు రోజులు రాత్రి, పగలు మొద్దు నిద్ర పోవడం వలన మనసు పర్యటనల మీదికి పోయింది. ఏది వెళ్లి చూసొస్తే బాగుంటుందని ఆలోచిస్తుంటే, బిల్ల సర్గం గుహలు ఠపీమని గుర్తుకువచ్చాయి. మనోహర్ నాయక్ కు ఫోన్ చేసి "వస్తావా నా తోటి బిల్ల సర్గం" అన్నాను. వెంటనే "13 వ తేదీ పోదాము సర్ " అన్నాడు. మా డ్రైవర్ బాషాకు చెప్పేసాను. మాతో పాటుగా మరో మిత్రుడు శ్యామ్ ప్రసాద్ వస్తాను అన్నాడు. అలా ప్రణాళికా సిద్దం అయిపోయింది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ప్రయాణం ఇలా దసరాలో అనుభవానికి వచ్చింది. 
13 వ తేదీ ఉదయం 6.30 కు బాషా వచ్చేసాడు. శ్యామూ మరియు మనోహర్ కూడా సరైన సమయానికే వచ్చేసారు. మూడు వేల రూపాయలకు డీజిల్ పట్టించాము. కారు చక్రాలలో గాలి కొట్టించుకున్నాము. పూర్వము ఇలాంటి ప్రయాణాలకు సద్ది కట్టుకువెళ్ళేవారు. "ఎద్దు లేని సేద్యం, సద్ది లేని ప్రయాణం వృధా" అని నానుడి. ఇప్పుడు అలా కాదు. మనకు టిఫినీలు ఏర్పాటు చేసే హోటళ్లు కోకొల్లలు. ఇప్పుడు ఎక్కడ చూసినా హోటళ్లు కనపడతాయి. గుత్తిలో ఉన్న అన్నపూర్ణ హోటల్ లో ఇడ్లీ, వడ (సాంబార్ డిప్ ) మరియు మసాలా దోసె ఆరగించాము. అక్కడ నుంచి ద్రోణాచలం మీదుగా బేతంచర్ల చేరుకున్నాము. బేతంచెర్లకు కూతవేటు దూరంలోనే ఈ బిల్ల సర్గం గుహలు. ఒక ఐదు కిలోమీటర్లు మాత్రం రోడ్డు అధ్వాన్నంగా ఉంది. 
ఈ బిల్ల సర్గం పేరు విచిత్రంగా ఉంది కదా!!! బిలం అంటే గుహ లాంటి నిర్మాణం అని అర్థం. సొరంగం లాగా ఈ గుహలు ఉన్నాయి కాబట్టి వీటికి ఈ పేరు వచ్చి ఉండొచ్చు. 'బిల సొరంగం' అనే పేరే క్రమంగా జనాల నోళ్లలో పడి బిల్ల సర్గంగా మారి ఉంటుంది. నీటి ఒరిపిడి వలన సున్నపు రాయి క్షోభ్యతకు గురై ఏర్పడిన గుహలు ఇవి. ఈ సహజ శిలలు అనేక ఆకారాలుగా ప్రకృతి చేత మలచబడ్డాయి. ఒక శిల అయితే ఏకంగా నిలువెత్తు గణపతిని పోలి ఉంది. ఆకారాలది ఏముంది లెండి.. ఎలా భావిస్తే అలా దర్శనం అవుతుంది. సృష్టి అంతా చూసే వారి దృష్టిని బట్టే ఉంటుంది. ఈ మట్టి పొరలలో ఎన్నో జీవ పరిణామ రహస్యాలు ఇమిడి ఉంటాయి. పాత మరియు కొత్త రాతి యుగాల నాటి మానవులు వాడిన ఆయుధాలు, పాత్రలు దొరికాయి అని, అవి దేశ, విదేశాలలో వివిధ మ్యూజియంలలో భద్రపరచబడ్డాయని చెపుతున్నారు. ఏది ఏమైనా ఈ మట్టి నిక్షిప్తం చేసుకున్న జ్ఞాపకాలను తలుచుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఎన్నో మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిన గుహలు ఇవి.  ఒక ప్రదేశం నుంచి చూస్తే ఈ బిల్ల సర్గం గుహల పై భాగం నుంచి ఆకాశం దర్శనమిస్తుంది. రాత్రి పూట ఇక్కడ నిలబడి అంతరిక్షాన్ని చూస్తే ఒక ప్లానెటోరియంలో ఉన్న అనుభూతి కలుగుతుంది. కానీ రాత్రి అక్కడ ఉండే తెగువ ఎవరికి వస్తుంది???? గుహలలో పావురాల రెట్టల వాసన ముక్కులను అదరగొడుతోంది. కానీ గుహలు open గా ఉండడం వలన ఊపిరి ఆడకపోవడం లాంటి సమస్యలు మాలో ఎవరికీ ఎదురుకాలేదు. ఈ గుహలలో కొన్నిటికి 'కేథడ్రెల్'  'పవిత్ర గుహ' లాంటి పేర్లు కూడా పెట్టేసారు. ఎముకలతో చేసిన పనిముట్లు ఇక్కడ జరిపిన తవ్వకాలలో బయటపడ్డాయి. అలాగే ప్లిస్టోసీన్ కాలానికి చెందిన జంతుజాల శిలాజాలు కూడా దొరికాయి. అలా ఈ బిల్ల సర్గం గుహలు మానవ జీవ మరియు సాంస్కృతిక పరిణామ క్రమానికి documentary evidences గా ఉన్నాయని చెప్పొచ్చు. ఇలాంటివే వాల్మీకి గుహలు, సన్యాసుల గుహలు ఉన్నాయట. వీలు పడినప్పుడు చూడాలి. యాగంటి గుహలు చాలా సార్లు చూసాను. ఏది ఏమైనా కానీ ఆ కాలంలో ఆది మానవులు ఇక్కడ ఎలా జీవించి ఉంటారో అనే విషయాన్ని ఊహించుకుంటే థ్రిల్లింగా అనిపించింది. ఈ గుహలలో ప్రవేశించిన మేమందరూ ఉన్న పళంగా ఆది మానవులుగా మారి పోతే ఎలా ఉంటుంది !!!!!!. ఈ ఊహను మనోహర్ నాయక్ కు చెప్పాను. "సర్ !!!! మన PhD ఎలా అని ఆందోళనగా చూసాడు. ఊహే కదా అని నేను ఊదార్చేసరికి ఊరట చెందాడు. 
ప్రవేశ రుసుము ఒకరికి కేవలం అరవై రూపాయలు. మేము వెళ్లినపుడు  సిగ్నల్స్ లేకపోవడం వలన Phone Pay పని చేయలేదు. కొద్ది దూరం పోయి ప్రయత్నిస్తే సిగ్నల్స్ అందాయి. ప్రయాణాలలో  అంతో, ఇంతో నగదు తీసుకొని వెళ్లడం శ్రేయస్కరం అని మాకు తెలిసివచ్చింది. ఒక రెండు గంటల పాటు బిల్ల సర్గం గుహలను మా చరవాణిలో ఛాయా చిత్రాలు మరియు వీడియోల రూపంలో బంధించుకుంటూ గడిపేసాము. ఇక్కడి నుంచి నేను చాలా కాలంగా చూడాలి అనుకుంటున్న కొత్తూరు సుబ్బారాయుడి గుడికి వెళ్లాలి అనుకున్నాను. ఆ విషయమే మిత్రులతో చెపితే అలాగే.. అలాగేనంటూ తలలెగరేసారు. బిల్ల సర్గం నుంచీ కొత్తూరు 26 కిలోమీటర్లు. పలుగూరు, రామకృష్ణాపురం మీదుగా వెళ్లాలి. Single road అయినా బాగుంది. కొత్తూరుకు వెళ్లి సుబ్బారాయుడి దర్శనం చేసుకున్నాము. గర్భ గుడిలో సర్పాకృతిలో వెలసిన సుబ్రమణ్యుడికి అభిషేకాలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ ఊర్లో చాలా మంది పేర్లు సుబ్బరాయుడు అని ఉంటుందట. సుబ్బరాయుడు అని గట్టిగా పిలిస్తే ఊరు ఊరంతా వెనక్కి తిరిగి చూస్తుందేమో!!!!! 'కొత్తూరు రావు' అనే పేరు కూడా ప్రసిద్దమేనట. మంగళవారం సుబ్రమణ్యుడికి శ్రేష్టం కావడంతో భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చారు. 
తరువాత బనగాన పల్లె మీదుగా అనంతపురం పోదామని బయలుదేరాము. త్రోవలో నందవరం చౌడేశ్వరి దర్శనం చేసుకున్నాము. శరన్నవ రాత్రిలో చౌడేశ్వరి మాత సర్వాలంకార శోభితంగా దర్శనం ఇచ్చింది. నేను నందవరం చాలా సార్లు చూసాను. 
బనగాన పల్లె వద్ద వీర బ్రహ్మేంద్ర స్వామి నేల మఠం వెళ్లాము. ఈ మఠంలో బ్రహ్మం గారి ఆత్మ లింగం ఉంది. ఇక్కడనే అన్నాజయ్య, అచ్చమాంబల అంధపుత్రుడైన గరిమిరెడ్డి బ్రహ్మానంద రెడ్డికి బ్రహ్మంగారు చూపు ప్రసాదించారు. తరువాత బనగాని పల్లిలో అరోమా టీ సెంటర్ లో ఒక అమృతోపమానమైన తేనీటిని సేవించాము. అలసట అంతా తీసేసినట్టు అనిపించింది. ఇక్కడి నుంచి గరిమిరెడ్డి అచ్చమాంబ మఠం గా పిలువబడే చింతమాను మఠం వెళ్లాము. బ్రహ్మం గారి కాల జ్ఞాన ప్రతులు ఇంకా ప్రచారానికి నోచుకొనివి అసంఖ్యాకంగా ఈ మఠంలోని చింతమాను క్రింద నిక్షిప్తం చేయబడ్డాయట. ఈ బనగాని పల్లె లో వీరప్పయ్య స్వామి పేరుతో  బ్రహ్మం గారు సుమారు 23 సంవత్సరాలు సంచరించారట. బాల్యంలో సీనియర్ ఎన్టీయార్ నటించిన "శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర" సినిమా ఉరవకొండలో చూసిన తరువాత నాకు బ్రహ్మంగారి మీద ఆసక్తి కలిగింది. బ్రహ్మం గారి తత్వాలు చాలానే చదివాను. ఈ చింతమాను మఠంలో ఉచిత అన్న ప్రసాదం ఆరగించాము మేము. 
అలాగే అనంతపురం త్రోవలో బనగాని పల్లికి దగ్గరగా ఉన్న నవాబుల ప్యాలెస్ చూసాము. ఇక్కడే అరుంధతి సినిమా షూటింగ్ జరిగింది. మనోహర్ నాయక్ కు తెగ నచ్చేసింది ఈ ప్యాలెస్. 
ఇలా ఇన్నేసి ప్రాంతాలు చూసి మేము అనంతపురం చేరేసరికి సాయంత్రం ఐదు గంటలయ్యింది. 






మరో ప్రయాణంలో మళ్లీ కలుసుకుందాము. 

Tuesday, October 6, 2026











State Bank of India వారు కర్నూల్ లో మౌర్య హోటల్ లో Zonal స్థాయిలో Pensioners & Family Pensioners meet ఏర్పాటు చేసామని ఆరోజున 80 వసంతాలు పూర్తీ చేసుకున్న వారికి సన్మానం ఉంటుందని, దానికి తప్పక మీరు హాజరు కావల్సిందని నాన్నకు ఫోన్ వచ్చింది. సన్మానం అక్టోబర్ 6 వ తేదీ అని చెప్పారు. నేను నాన్నను  ఆ రోజు కర్నూల్ కు పిలుచుకుపోవడం కోసం సెలవు  పెట్టేసాను. మా రెగ్యులర్ డ్రైవరు అందుబాటులో లేకపోవడం వలన మరో డ్రైవరుని ఏర్పాటు చేసుకున్నాము. నాన్న, నేను, రమణయ్య సర్ మరియు ఆదిశేషయ్య గారు అక్టోబర్ 6 వ తేదీన ఉదయం 7.30 కు కర్నూల్ కు బయలుదేరాము. మధ్యలో ఉడిపి హోటల్ లో ఉపాహారం ముగించుకుని 10 గంటలకల్లా మేము మౌర్య హోటల్ కు చేరాము. అక్కడ ఏర్పాట్లు చూసి నేను చాలా సంతోషపడ్డాను. నేను నా ఉద్యోగ రీత్యా పదుల కొద్దీ జాతీయ, అంతర్జాతీయ సదస్సులు హాజరై ఉంటాను. వాటికి ఏ మాత్రం తీసిపోకుండా ఇక్కడ ఏర్పాట్లు చేసారు. రిజిస్ట్రేషన్ తరువాత SBI emblem తో ఉన్న bag ఇచ్చారు. దానిలో రెండు బిస్కెట్ పాకెట్స్ మరియు మినరల్ వాటర్ బాటిల్ పెట్టి మరీ ఇచ్చారు. వేదిక అలకరించిన తీరు చాలా అద్బుతంగా ఉంది. Aesthetics & dynamics పట్ల నిర్వాహకులకున్న నిబద్దత నాకు అర్థం అయ్యింది. 
వేదిక మీద ఒక anchor ice breaking ఒక చిన్న ఆట ద్వారా చేయించారు. దీనితో మేమంతా alert అయ్యాము. సుమారు మూడు వందల మందితో నిండిన ఆ హాల్ గుండు సూది పడితే వినిపించేంత నిశ్శబ్దంగా అయ్యింది. ప్రోటోకాల్ ప్రకారం వేదిక మీదికి అందరినీ ఆహ్వానించారు. వేదిక మీద ఉన్న బ్యాంక్ అధికారులు మరియు Association office bearers అందరూ కూడా చక్కగా ఉపన్యసించారు. ఎక్కడా కూడా ఊక దంపుడు లేదు. Pensioners పట్ల వీరికున్న empathy నాకు అర్థం అయ్యింది. తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు, ప్రభువెక్కిన పల్లకి కాదోయ్, అది మోసిన బోయీ లెవ్వరు ? అన్న చందంగా ఇక్కడ హాజరైన విశ్రాంత ఉద్యోగులంతా ఒకప్పుడు అహర్నిశలు బ్యాంక్ సేవలు digitalize కాకముందు శ్రమించారు. ఈ రోజు  State Bank of India ఇంత image మరియు popularity ని సంపాదించుకున్నదంటే వీరి సేవలే కారణం అని వేదిక మీద ప్రతి అధికారి ప్రశంసించారు. నేనైతే ఒక వినియోగదారుడిగా బ్యాంక్ సేవలలో వచ్చిన transitionను గమనించాను కాబట్టి అప్పట్లో వీరి సేవల నాణ్యత నాకు బాగా తెలుసు. ఒక ఆనందకరమైన విషయం ఏమంటే SBI Customer service నాణ్యత ఇప్పటికీ తగ్గకపోవడం. నా housing loan అనంతపురం తపోవనం బ్రాంచ్ లో ఉంది ఇప్పటికీ. అతి తక్కువ వ్యవధిలో వారు దానిని process చేసి నన్ను ఒకింటి వాడిగా చేసారు. Digitalize లావా దేవీలు నేను SBI Yono App ద్వారా safe గా జరుపుకుంటున్నాను. ఇప్పుడు SBI సేవలు నెట్టింట్లో మెరుపు వేగంతో జరుగుతున్నాయి. 
వేదిక మీద మాట్లాడిన ఒక మేనేజర్ pensioners మరణానంతరం funeral expenditure బ్యాంక్ ఎలా భరిస్తుందో చక్కగా చెప్పారు. సాగర్ గారు మాట్లాడుతూ pensioners అందరికీ ప్రత్యేకంగా badges ఇవ్వాలని ఒక సూచన చేసారు. నాకు ఒక ధీమా ఏమిటంటే ఎటువంటి badge లేకున్నా కూడా బ్యాంక్ శాఖలలో pensioners కు మరియు వారి కుటుంబ సభ్యులకు మంచి సేవలే అందుతాయి. మాకు లాకర్ సౌకర్యం SBI, Gooty road branch, Anantapur లో ఉంది ఇప్పటికీ. నేను ఆ బ్రాంచ్ కు వెళ్ళినప్పుడు ఒక pensioner కొడుకుగా వారు నాకు చూపించే ఆదరణ నేను మరువలేను. ఇక PSVS శర్మ గారు pensioners వివిధ సమస్యల గురించి చక్కటి అవగాహన కల్పించారు. Digital నేరాల పట్ల జాగురూకతగా ఎలా ఉండాలో చక్కగా చెప్పారు. తిరుపతి రెడ్డి గారు కూడా చక్కగా ఉపన్యసించారు. లంచ్ కు ముందు 80 వసంతాలు పూర్తీ చేసుకున్న అందరికీ DGM మరియు AGM  గారితో సన్మానం చేయించారు. Cheif manager (HR ) శిరీష గారు మరియు Pensioners association Vice President  శ్రీ రామ ఓబులేసు గారు ఇంత కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించారు. సన్మాన గ్రహీతలు మరియు వారి కుటుంబ సభ్యుల కళ్లలో ఆనందం వెల్లివిరిసింది. వీళ్లు గౌరవిస్తున్నది వ్యక్తులను కాదు....... ఒక legacyని అనిపించింది. ఈ సందర్భంగా SBI తో నాకున్న జ్ఞాపకాలను ఇక్కడ కొన్ని ముచ్చటిస్తున్నాను. 

State Bank of India అనే పేరు వింటే చాలు నాకు ఒక పులకింత. దానికి కారణం మా నాన్న ఈ బ్యాంక్ లో సుధీర్ఘ కాలం పనిచేయడమే. 6-01-1971 కదిరిలోని State Bank of India శాఖ లో నాన్న ( G Ramaseshan ) క్యాషియర్ గా విధులలో చేరారు. అప్పటికే ఆయన Post Graduate. నాన్న జియాలజీ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తీ చేసారు. ఆయనకు బ్యాంక్ లో, అందునా State Bank of India లో ఉద్యోగం లభించడం అప్పటికీ, ఇప్పటికీ మా ఇంటిల్లిపాదీ ఒక అదృష్టంగానే భావిస్తాము. 1971 లో బ్యాంక్ ఉద్యోగిగా మొదలైన ఉద్యోగ జీవితం 31-03-2001 న golden handshake తో ముగిసింది. నాన్న బ్యాంక్ లో చేరే సమయానికి నేను ఇంకా పుట్టలేదు. నాన్న పదవీ విరమణ చేసే సమయానికి లెక్చరర్ ఉద్యోగానికి ఎంపికై నేను నియామక ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. అంటే అప్పటికీ నేను నిరుద్యోగినే. నా బాల్యం, యుక్త వయసులో నేను సగర్వంగా తలెత్తుకుని జీవించడానికి కారణం నాన్న State Bank of India ఉద్యోగి కావడమే. నాన్న సహచరులతో నాకు ఎంతో అనుబంధం ఉంది. బ్యాంక్ ఉద్యోగులకు తరచూ బదిలీలు కావడం వలన నేను రెండేళ్లకోసారి స్కూల్ మారడం జరిగింది. దీని వలన కొత్తవారితో ఎలా మెలగాలో నాకు తెలిసివచ్చింది. చాలా life skills నాకు State Bank of India నేర్పించింది అని చెప్పవచ్చు. 
అప్పట్లో అనంతపురం సాయి నగర్ SBI శాఖలో ఆగస్టు 15 రోజు ఉద్యోగుల పిల్లలకు అనేక పోటీలు నిర్వహించేవారు. నేను నా బాల్యంలో అలా నిర్వహించిన అనేక పోటీలలో పాల్గొన్నాను. పరుగు పందెంలో, మ్యూజికల్ చైర్ పోటీలలో నేను చాలా సార్లు బహుమతులు గెలుచుకున్నాను. ఇలా నాకు పోటీ తత్వం ఎలా ఆరోగ్యకరంగా కొనసాగించాలో కూడా State Bank of India నేర్పింది. ఇప్పుడు అలాంటి పోటీలు ఉన్నాయో లేదో మరి తెలియదు. SBI Sai nagar Anantapur శాఖలో పనిచేసే నాన్న సహచరులు చాలా మంది మా ఇంటికి సైకిళ్ల మీద వచ్చేవారు. వారిలో చాలా మంది నాకు ఇంకా గుర్తుకు వున్నారు. కొద్ది మంది ఇంకా మా ఇంటికి వస్తూ ఉన్నారు. ముత్యాలప్ప గారు, రామ్మూర్తి సర్, పండిట్ సర్ నాకు బాల్యం లో ఎంతో ప్రోత్సహాన్ని ఇచ్చారు. పండిట్ గారు ఇటీవలనే కాలం చేసారు. వీరందరూ చాలా స్నేహశీలురు. ఇప్పటి స్నేహాలలో ( మా కాలం స్నేహాలు లెండి ) ఆ ఘాడత మచ్చుకైనా కనపడదు. ఇప్పుడు స్నేహాలు digitalize అయిపోయాయి. ముఖాముఖీ కలుసుకునే కన్నా కూడా ముఖ పుస్తకం ద్వారా కలుసుకోవడాన్ని ఇష్టపడుతున్నారు. నాన్న కదిరి, ఉరవకొండ, తాడిపత్రి, అనంతపురం, రాయదుర్గం మరియు తిరుపతిలో పనిచేసారు. ప్రతి చోట బ్యాంక్ ఉద్యోగి కొడుకుగా నేను చదువుకునే పాఠశాలలో, కళాశాలలో నాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది. అప్పట్లో బ్యాంక్ ఉద్యోగాలకు ఉన్న క్రేజ్ అలాంటిది మరి. State Bank of India officers కు leased house accomodation ఇచ్చేవారు. ఇంట్లో బ్యాంక్ వారు ఇచ్చిన ఫర్నీచర్ కూడా ఉండేది. నాన్నకు అందిన ఈ సౌకర్యాలు నా బాల్యం మరియు యవ్వనంలో నేను ఒక హోదాతో జీవించడానికి కారణం అయ్యాయి. ఉద్యోగుల మరియు వినియోగదారులకు సేవలు అందించడంలో అప్పటికీ, ఇప్పటికీ State Bank of India ముందంజలోనే ఉంటుందని నా నమ్మకం. అందుకే నేను ఇప్పటికీ నా salary account SBI లోనే ఉంచుకున్నాను. 
ఇక నా జ్ఞాపకాలు పక్కన పెట్టి , తిరిగి కర్నూల్ లో జరిగిన కార్యక్రమం ముగింపు చూద్దాం. 
ఈ సదస్సులో ఏర్పాటు చేసిన భోజనం అమృతతుల్యం. పప్పుకు పేటెంట్ తీసుకోవచ్చు. శుచికి, రుచికి మారుపేరుగా నిలిచింది లంచ్. నేను నాన్నతో కలిసి కార్యక్రమానికి హాజరయ్యేంత వరకు మాకు తగు సూచనలు మరియు ప్రోత్సాహాన్ని ఇచ్చిన శ్రీ T N అప్పాజీ గారికి మరియు P వీరభద్రా రెడ్డి గారికి ధన్యవాదాలు. 
ఈ సదస్సు ద్వారా వెనుకటి తరం ఉద్యోగులను ఎలా గౌరవించాలి అనేది నేను కూడా తెలుసుకున్నాను. నాన్న గారి మిత్రులైన శ్రీ ఛత్రం సుబ్బారావు గారిని, శ్రీ పద్మనాభ రావు గారిని కూడా కలిసాను. తరాల మధ్య గోడలు కట్టే ఈ కాలంలో తరాల మధ్య వారధి గా పని చేసిన ఒక మంచి కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం నాకు State bank of India కల్పించింది. SBI కి నా ధన్యవాదాలు. 
స్వస్తి 
G L N Prasad
Lecturer in Zoology 
Govt Arts College 
Anantapur  

                                     Review: "Bharath Ko Jano" Quiz Programme, 2026 Review: "Bharath Ko Jano" Quiz Progr...