Saturday, February 22, 2025

 APTWRS For Girls,  (AP Tribal Welfare Residential School for Girls), Navodaya Colony, Ananthapuramu







కొత్త విద్యార్థులను కలవని రోజు నా దృష్టిలో వృధా. రేపు గ్రూప్ II పరీక్షలు ఉండడంతో మా కళాశాలలో క్లాస్ వర్క్ రద్దు చేయబడింది. కానీ నేను మాత్రం దీనిని సద్వినియోగం చేసుకున్నాను. ANSET వాళ్లు  అనంతపురం నవోదయ కాలనీ లో ఉన్న AP Tribal Welfare School for Girls లో నా  కార్యక్రమం ఏర్పాటుచేసారు. చక్కటి భద్రమైన వాతావరణం ఈ పాఠశాల లో కనపడింది. ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తున్న పార్వతీ మేడం సుమారు వంద మంది విద్యార్థినులను నా క్లాస్ లో కూచోపెట్టారు. వారికి ఈ క్రింది విషయాలు నేను బోధించాను. 
  • ఆంగ్లం మరియు ఆంధ్రం రెండూ చక్కగా నేర్చుకోండి. ఒక భాష మీద సాధికారత వస్తే చాలు, మిగిలిన భాషలు నేర్చుకోవడం సులభమవుతుంది. 
  • భావోద్వేగాల మీద కూడా పట్టు సాధించండి. 
  • సమస్య వచ్చినప్పుడు ఏడుస్తూ కూచోకుండా, నిర్మాణాత్మకంగా ఆలోచించండి. 
  • చేతి రాత ద్వారా మీ తల రాత మార్చుకోవచ్చు. 
  • తెలుగు పద్య, వచన సాహిత్యాన్ని బాగా అధ్యయనం చేయండి. 
  • రోజుకు పది కొత్త ఆంగ్ల పదాలను నేర్చుకోండి. 
  • కొత్త భాషలను నేర్చుకోవడానికి ఉత్సాహం చూపండి. 
  • మూఢ నమ్మకాలకు లొంగకండి 
  • వినండి.. చదవండి.. రాయండి. మీ జీవితం మారకుంటే నన్నడగండి 
  • రేడియో లో వార్తలు మరియు ఇతర మంచి కార్యక్రమాలు వినండి. 
  • "మీ రక్షణ మీ కర్తవ్యం" అని మరవకండి. ఈ సందర్భంగా జూడో నేర్చుకున్నామని విద్యార్థినులు నాతో చెప్పడం నాకు ఆనందాన్ని కలిగించింది. 
  • చాటింగ్ చేస్తే చీటింగ్ కు అవకాశం ఇచ్చినట్టే. 
  • సైన్స్ పాఠాలు అర్థం చేసుకుంటూ చదవండి. 
  • గణితం ను నిర్లక్ష్యం చేయకండి. లెక్కలు నేర్చుకుంటే, లెక్కలేనన్ని విజయాలను మీరు సాధించవచ్చు. 
ఇలా సుమారు గంట సేపు పిల్లలతో నేను ముచ్చటించాను. ఈ కార్యక్రమం లో విద్యార్థినులు చూపించిన ఉత్సాహం నేను ఎప్పటికీ మరువలేను. అన్నట్టు చెప్పడం మరిచాను. ఈ రోజు కూడా నేను మా మీడియా సెంటర్ లో ఒక వీడియో పాఠం రికార్డు చేసాను. 
                              Thus I spent one more day in constructive manner. 

1 comment:

                                Multiple Activities in Our College Today  1. Meeting is convened in the examination committee with the membe...