Saturday, January 31, 2026

 Launching A New Scheme at Joyalukkas 





బాల్యం నుంచి నేను ధనానికి , అదనానికి దూరంగానే ఉన్నానని చెప్పొచ్చు. మితిమీరిన సంపద మనిషిని ఇబ్బంది పెడుతుంది. అలాగే చిన్నప్పటి నుంచి సంపద కలిగిన వారి సన్నిపాతకం నేనెరుగుదును. నాకున్న అనుభవాల వలన నాకు సంపద పట్ల నిర్లిప్తత ఏర్పడింది. మోతాదు మించి డబ్బున్న వారితో నేను ఎప్పుడూ కలిసి తిరుగలేదు. అదనం మీద నాకు ఆసక్తి లేకున్నా, అదృష్టం కొద్దీ లోటు వైపు నా జీవితం ఎప్పుడూ ప్రయాణించలేదు. నాకు సంపదను పోగేసుకునే అవకాశం ఎప్పుడూ రాలేదు కూడా. ఇవన్నీ ఎందుకు చెపుతున్నానంటే , సంపదతో అసలు సంబంధమే లేని నాకు Joyalukkas అనంతపురం శాఖలో ఒక స్కీమ్ launch చేసే అవకాశం మిత్రుడు పవన్ నాయక్ వలన వచ్చింది. చుట్టూ బంగారు ఉంటే జీవితం ఎంత కాంతివంతంగా ఉంటుందో అర్థం అయ్యింది. " బంగారానికి, సింగారానికి కుదిరింది ఈనాడు బేరం" అంటూ స్కీమ్ launching లో ఇంకొంతమందితో పాల్గొని ఇంటి ముఖం పట్టాను. ఆ అనుకోని బంగారు క్షణాల జ్ఞాపకాల సమాహారమే ఈ ఫొటోస్. 

No comments:

Post a Comment

  Eco Friendly Ganesh Idol DIstribution at Govt College (A) Anantapur  ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా గణేశ చతుర్థి కోసం పర్యావరణ హిత గణేశ విగ్ర...