State Bank of India వారు కర్నూల్ లో మౌర్య హోటల్ లో Zonal స్థాయిలో Pensioners & Family Pensioners meet ఏర్పాటు చేసామని ఆరోజున 80 వసంతాలు పూర్తీ చేసుకున్న వారికి సన్మానం ఉంటుందని, దానికి తప్పక మీరు హాజరు కావల్సిందని నాన్నకు ఫోన్ వచ్చింది. సన్మానం అక్టోబర్ 6 వ తేదీ అని చెప్పారు. నేను నాన్నను ఆ రోజు కర్నూల్ కు పిలుచుకుపోవడం కోసం సెలవు పెట్టేసాను. మా రెగ్యులర్ డ్రైవరు అందుబాటులో లేకపోవడం వలన మరో డ్రైవరుని ఏర్పాటు చేసుకున్నాము. నాన్న, నేను, రమణయ్య సర్ మరియు ఆదిశేషయ్య గారు అక్టోబర్ 6 వ తేదీన ఉదయం 7.30 కు కర్నూల్ కు బయలుదేరాము. మధ్యలో ఉడిపి హోటల్ లో ఉపాహారం ముగించుకుని 10 గంటలకల్లా మేము మౌర్య హోటల్ కు చేరాము. అక్కడ ఏర్పాట్లు చూసి నేను చాలా సంతోషపడ్డాను. నేను నా ఉద్యోగ రీత్యా పదుల కొద్దీ జాతీయ, అంతర్జాతీయ సదస్సులు హాజరై ఉంటాను. వాటికి ఏ మాత్రం తీసిపోకుండా ఇక్కడ ఏర్పాట్లు చేసారు. రిజిస్ట్రేషన్ తరువాత SBI emblem తో ఉన్న bag ఇచ్చారు. దానిలో రెండు బిస్కెట్ పాకెట్స్ మరియు మినరల్ వాటర్ బాటిల్ పెట్టి మరీ ఇచ్చారు. వేదిక అలకరించిన తీరు చాలా అద్బుతంగా ఉంది. Aesthetics & dynamics పట్ల నిర్వాహకులకున్న నిబద్దత నాకు అర్థం అయ్యింది.
వేదిక మీద ఒక anchor ice breaking ఒక చిన్న ఆట ద్వారా చేయించారు. దీనితో మేమంతా alert అయ్యాము. సుమారు మూడు వందల మందితో నిండిన ఆ హాల్ గుండు సూది పడితే వినిపించేంత నిశ్శబ్దంగా అయ్యింది. ప్రోటోకాల్ ప్రకారం వేదిక మీదికి అందరినీ ఆహ్వానించారు. వేదిక మీద ఉన్న బ్యాంక్ అధికారులు మరియు Association office bearers అందరూ కూడా చక్కగా ఉపన్యసించారు. ఎక్కడా కూడా ఊక దంపుడు లేదు. Pensioners పట్ల వీరికున్న empathy నాకు అర్థం అయ్యింది. తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు, ప్రభువెక్కిన పల్లకి కాదోయ్, అది మోసిన బోయీ లెవ్వరు ? అన్న చందంగా ఇక్కడ హాజరైన విశ్రాంత ఉద్యోగులంతా ఒకప్పుడు అహర్నిశలు బ్యాంక్ సేవలు digitalize కాకముందు శ్రమించారు. ఈ రోజు State Bank of India ఇంత image మరియు popularity ని సంపాదించుకున్నదంటే వీరి సేవలే కారణం అని వేదిక మీద ప్రతి అధికారి ప్రశంసించారు. నేనైతే ఒక వినియోగదారుడిగా బ్యాంక్ సేవలలో వచ్చిన transitionను గమనించాను కాబట్టి అప్పట్లో వీరి సేవల నాణ్యత నాకు బాగా తెలుసు. ఒక ఆనందకరమైన విషయం ఏమంటే SBI Customer service నాణ్యత ఇప్పటికీ తగ్గకపోవడం. నా housing loan అనంతపురం తపోవనం బ్రాంచ్ లో ఉంది ఇప్పటికీ. అతి తక్కువ వ్యవధిలో వారు దానిని process చేసి నన్ను ఒకింటి వాడిగా చేసారు. Digitalize లావా దేవీలు నేను SBI Yono App ద్వారా safe గా జరుపుకుంటున్నాను. ఇప్పుడు SBI సేవలు నెట్టింట్లో మెరుపు వేగంతో జరుగుతున్నాయి.
వేదిక మీద మాట్లాడిన ఒక మేనేజర్ pensioners మరణానంతరం funeral expenditure బ్యాంక్ ఎలా భరిస్తుందో చక్కగా చెప్పారు. సాగర్ గారు మాట్లాడుతూ pensioners అందరికీ ప్రత్యేకంగా badges ఇవ్వాలని ఒక సూచన చేసారు. నాకు ఒక ధీమా ఏమిటంటే ఎటువంటి badge లేకున్నా కూడా బ్యాంక్ శాఖలలో pensioners కు మరియు వారి కుటుంబ సభ్యులకు మంచి సేవలే అందుతాయి. మాకు లాకర్ సౌకర్యం SBI, Gooty road branch, Anantapur లో ఉంది ఇప్పటికీ. నేను ఆ బ్రాంచ్ కు వెళ్ళినప్పుడు ఒక pensioner కొడుకుగా వారు నాకు చూపించే ఆదరణ నేను మరువలేను. ఇక PSVS శర్మ గారు pensioners వివిధ సమస్యల గురించి చక్కటి అవగాహన కల్పించారు. Digital నేరాల పట్ల జాగురూకతగా ఎలా ఉండాలో చక్కగా చెప్పారు. తిరుపతి రెడ్డి గారు కూడా చక్కగా ఉపన్యసించారు. లంచ్ కు ముందు 80 వసంతాలు పూర్తీ చేసుకున్న అందరికీ DGM మరియు AGM గారితో సన్మానం చేయించారు. Cheif manager (HR ) శిరీష గారు మరియు Pensioners association Vice President శ్రీ రామ ఓబులేసు గారు ఇంత కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించారు. సన్మాన గ్రహీతలు మరియు వారి కుటుంబ సభ్యుల కళ్లలో ఆనందం వెల్లివిరిసింది. వీళ్లు గౌరవిస్తున్నది వ్యక్తులను కాదు....... ఒక legacyని అనిపించింది. ఈ సందర్భంగా SBI తో నాకున్న జ్ఞాపకాలను ఇక్కడ కొన్ని ముచ్చటిస్తున్నాను.
State Bank of India అనే పేరు వింటే చాలు నాకు ఒక పులకింత. దానికి కారణం మా నాన్న ఈ బ్యాంక్ లో సుధీర్ఘ కాలం పనిచేయడమే. 6-01-1971 కదిరిలోని State Bank of India శాఖ లో నాన్న ( G Ramaseshan ) క్యాషియర్ గా విధులలో చేరారు. అప్పటికే ఆయన Post Graduate. నాన్న జియాలజీ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తీ చేసారు. ఆయనకు బ్యాంక్ లో, అందునా State Bank of India లో ఉద్యోగం లభించడం అప్పటికీ, ఇప్పటికీ మా ఇంటిల్లిపాదీ ఒక అదృష్టంగానే భావిస్తాము. 1971 లో బ్యాంక్ ఉద్యోగిగా మొదలైన ఉద్యోగ జీవితం 31-03-2001 న golden handshake తో ముగిసింది. నాన్న బ్యాంక్ లో చేరే సమయానికి నేను ఇంకా పుట్టలేదు. నాన్న పదవీ విరమణ చేసే సమయానికి లెక్చరర్ ఉద్యోగానికి ఎంపికై నేను నియామక ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. అంటే అప్పటికీ నేను నిరుద్యోగినే. నా బాల్యం, యుక్త వయసులో నేను సగర్వంగా తలెత్తుకుని జీవించడానికి కారణం నాన్న State Bank of India ఉద్యోగి కావడమే. నాన్న సహచరులతో నాకు ఎంతో అనుబంధం ఉంది. బ్యాంక్ ఉద్యోగులకు తరచూ బదిలీలు కావడం వలన నేను రెండేళ్లకోసారి స్కూల్ మారడం జరిగింది. దీని వలన కొత్తవారితో ఎలా మెలగాలో నాకు తెలిసివచ్చింది. చాలా life skills నాకు State Bank of India నేర్పించింది అని చెప్పవచ్చు.
అప్పట్లో అనంతపురం సాయి నగర్ SBI శాఖలో ఆగస్టు 15 రోజు ఉద్యోగుల పిల్లలకు అనేక పోటీలు నిర్వహించేవారు. నేను నా బాల్యంలో అలా నిర్వహించిన అనేక పోటీలలో పాల్గొన్నాను. పరుగు పందెంలో, మ్యూజికల్ చైర్ పోటీలలో నేను చాలా సార్లు బహుమతులు గెలుచుకున్నాను. ఇలా నాకు పోటీ తత్వం ఎలా ఆరోగ్యకరంగా కొనసాగించాలో కూడా State Bank of India నేర్పింది. ఇప్పుడు అలాంటి పోటీలు ఉన్నాయో లేదో మరి తెలియదు. SBI Sai nagar Anantapur శాఖలో పనిచేసే నాన్న సహచరులు చాలా మంది మా ఇంటికి సైకిళ్ల మీద వచ్చేవారు. వారిలో చాలా మంది నాకు ఇంకా గుర్తుకు వున్నారు. కొద్ది మంది ఇంకా మా ఇంటికి వస్తూ ఉన్నారు. ముత్యాలప్ప గారు, రామ్మూర్తి సర్, పండిట్ సర్ నాకు బాల్యం లో ఎంతో ప్రోత్సహాన్ని ఇచ్చారు. పండిట్ గారు ఇటీవలనే కాలం చేసారు. వీరందరూ చాలా స్నేహశీలురు. ఇప్పటి స్నేహాలలో ( మా కాలం స్నేహాలు లెండి ) ఆ ఘాడత మచ్చుకైనా కనపడదు. ఇప్పుడు స్నేహాలు digitalize అయిపోయాయి. ముఖాముఖీ కలుసుకునే కన్నా కూడా ముఖ పుస్తకం ద్వారా కలుసుకోవడాన్ని ఇష్టపడుతున్నారు. నాన్న కదిరి, ఉరవకొండ, తాడిపత్రి, అనంతపురం, రాయదుర్గం మరియు తిరుపతిలో పనిచేసారు. ప్రతి చోట బ్యాంక్ ఉద్యోగి కొడుకుగా నేను చదువుకునే పాఠశాలలో, కళాశాలలో నాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది. అప్పట్లో బ్యాంక్ ఉద్యోగాలకు ఉన్న క్రేజ్ అలాంటిది మరి. State Bank of India officers కు leased house accomodation ఇచ్చేవారు. ఇంట్లో బ్యాంక్ వారు ఇచ్చిన ఫర్నీచర్ కూడా ఉండేది. నాన్నకు అందిన ఈ సౌకర్యాలు నా బాల్యం మరియు యవ్వనంలో నేను ఒక హోదాతో జీవించడానికి కారణం అయ్యాయి. ఉద్యోగుల మరియు వినియోగదారులకు సేవలు అందించడంలో అప్పటికీ, ఇప్పటికీ State Bank of India ముందంజలోనే ఉంటుందని నా నమ్మకం. అందుకే నేను ఇప్పటికీ నా salary account SBI లోనే ఉంచుకున్నాను.
ఇక నా జ్ఞాపకాలు పక్కన పెట్టి , తిరిగి కర్నూల్ లో జరిగిన కార్యక్రమం ముగింపు చూద్దాం. ఈ సదస్సులో ఏర్పాటు చేసిన భోజనం అమృతతుల్యం. పప్పుకు పేటెంట్ తీసుకోవచ్చు. శుచికి, రుచికి మారుపేరుగా నిలిచింది లంచ్. నేను నాన్నతో కలిసి కార్యక్రమానికి హాజరయ్యేంత వరకు మాకు తగు సూచనలు మరియు ప్రోత్సాహాన్ని ఇచ్చిన శ్రీ T N అప్పాజీ గారికి మరియు P వీరభద్రా రెడ్డి గారికి ధన్యవాదాలు.
ఇక నా జ్ఞాపకాలు పక్కన పెట్టి , తిరిగి కర్నూల్ లో జరిగిన కార్యక్రమం ముగింపు చూద్దాం. ఈ సదస్సులో ఏర్పాటు చేసిన భోజనం అమృతతుల్యం. పప్పుకు పేటెంట్ తీసుకోవచ్చు. శుచికి, రుచికి మారుపేరుగా నిలిచింది లంచ్. నేను నాన్నతో కలిసి కార్యక్రమానికి హాజరయ్యేంత వరకు మాకు తగు సూచనలు మరియు ప్రోత్సాహాన్ని ఇచ్చిన శ్రీ T N అప్పాజీ గారికి మరియు P వీరభద్రా రెడ్డి గారికి ధన్యవాదాలు.
ఈ సదస్సు ద్వారా వెనుకటి తరం ఉద్యోగులను ఎలా గౌరవించాలి అనేది నేను కూడా తెలుసుకున్నాను. నాన్న గారి మిత్రులైన శ్రీ ఛత్రం సుబ్బారావు గారిని, శ్రీ పద్మనాభ రావు గారిని కూడా కలిసాను. తరాల మధ్య గోడలు కట్టే ఈ కాలంలో తరాల మధ్య వారధి గా పని చేసిన ఒక మంచి కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం నాకు State bank of India కల్పించింది. SBI కి నా ధన్యవాదాలు.
స్వస్తి
G L N Prasad
Lecturer in Zoology
Govt Arts College
Anantapur





No comments:
Post a Comment