Eco Friendly Ganesh Idol DIstribution at Govt College (A) Anantapur
ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా గణేశ చతుర్థి కోసం పర్యావరణ హిత గణేశ విగ్రహాలను మా కళాశాలలో పంపిణీ చేసారు. ఈసారి అదనపు ఆకర్షణగా జనపనారతో చేసిన సంచులు కూడా పంచారు. ఈ సందర్భంగా నేను కొన్ని ముచ్చట్లు పెట్టుకున్నాను.
- ఏ పండగ అయినా దండుగ చేసుకోకండి
- రూపాన్ని కాదు తత్వాన్ని పట్టుకోండి.
- పండగ వెనుక ఉన్న పరమార్థాన్ని మరవకండి.
- పండగ పేరుతో పర్యావరణాన్ని కలుషితం చేయకండి.
- మట్టి విగ్రహం చెప్పే తత్వం ఏమంటే మనం మట్టి నుంచి వచ్చాము. మట్టిలోకి వెళతాము. మట్టి కున్న మహిమ దేనికి లేదు. ఎంత గట్టి మనిషి అయినా చివరకి మట్టి కరవాల్సిందే.
- 'ఆట కదరా మన్ను, ఆట కదరా మిన్ను, మిథ్యలో ముంచి తేల్చేవు నన్ను!!!" అన్న తనికెళ్ల మాటలు స్మృతిలో పెట్టుకోండి.
- మట్టిలో కొన్ని తరాల జ్ఞాపకాలు నిక్షిప్తమై ఉన్నాయి.
- వీధి.. వీధికి ఒక గణేశ మండపం వద్దు. ట్రాఫిక్ కు ఇబ్బంది అవుతుంది. వినాయకుడి పేరుతో జనాలకు విఘ్నాలు కలిగించకండి.
- చందాల పేరుతో దందాలు వద్దు.
- పండగ చేసుకునే ఉత్సాహంలో సామాజిక బాధ్యతను మరువకూడదు. ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా బతికితే ప్రతి రోజు పండుగే.
- మట్టికి, కర్మకు జ్ఞాపకశక్తి ఎక్కువ. ఎప్పుడు ఇవ్వాలో, ఎప్పుడు లాగేసుకోవాలో పంచ భూతాలకు తెలిసినట్టుగా వేటికీ తెలియదు.
- వినాయకుడిలోని నాయకత్వ లక్షణాలను అలవరుచుకునే ప్రయత్నం చేయండి.
- సూక్ష్మంలో స్థూలం, స్థూలంలో సూక్ష్మం ఎలా కలిసి ఉంటాయో గణేశుడిని చూస్తే అర్థం అవుతుంది.
- క్రింద ఎలుక, పైన ఏనుగు .. ఏది ఎక్కువ కాదు.. ఏది తక్కువా కాదు. సమాజానికి పెద్ద తలకాయలు ఎంత ముఖ్యమో, చిన్న తలకాయలు అంతే ముఖ్యం. Leader ఎంత ముఖ్యమో, Cadre కూడా అంతే ముఖ్యం. ఏనుగంత వినాయకుడు ఎలుకను వాహనంగా పెట్టుకోవడం వెనుక ఎంతో resource management దాగుంది. ఉన్నదాంతో పండగ చేసుకోవడమే ఒక resource management టెక్నిక్.







మీ వినాయక చవితి సందేశం అందరూ ఆదేశంగా ఆచరించాలని కోరుకుంటూ..
ReplyDeleteమీ పాఠకుడు..